Tillu Square 5 Days Collections: నక్కతోక తొక్కన సిద్దు.. 5 రోజుల్లో షాకిచ్చేలా.. అప్పుడే అంత లాభమా!

కెరీర్ ఆరంభం నుంచే డిఫరెంట్ కాన్సెప్టులతో సినిమాలు చేస్తూ.. తనకంటూ స్పెషల్ నేమ్‌ను సొంతం చేసుకున్నాడు స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ. అలా తనదైన చిత్రాలతో సాగిపోతోన్న అతడు.. 'డీజే టిల్లు'తో చరిత్ర సృష్టించాడు.

ఈ ఊపులోనే ఇటీవలే 'టిల్లు స్క్వేర్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి ఆరంభంలోనే పాజిటివ్ టాక్ రావడంతో రెస్పాన్స్ భారీ స్థాయిలో లభిస్తోంది. ఫలితంగా ఈ చిత్రం అదిరిపోయే వసూళ్లతో సత్తా చాటుతోంది. ఈ నేపథ్యంలో 'టిల్లు స్క్వేర్' 5 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూసేయండి మరి!

Siddu Jonnalagadda Starrer Tillu Square Movie 5 Days Worldwide Collections Details

మరో రాధికతో వచ్చిన టిల్లు
స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా మల్లిక్ రామ్ రూపొందించిన చిత్రమే 'టిల్లు స్క్వేర్'. ఈ మూవీలో అనుపమ హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీని ఫార్చూన్ ఫోర్ సినిమాస్, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించారు. నేహా శెట్టి, ప్రిన్స్, మురళిధర్ కీలక పాత్రలు చేశారు. శ్రీ చరణ్ పాకాల, రామ్ మిరియాల, థమన్ సంగీతం అందించారు.

టిల్లు స్క్వేర్ బిజినెస్ ఇలా

సిద్దు హీరోగా నటించిన 'టిల్లు స్క్వేర్' సినిమాకు నైజాంలో రూ. 8.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.00 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 11.00 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 22.00 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 3 కోట్లతో కలిపి మొత్తంగా దీనికి రూ. 27 కోట్లు బిజినెస్ అయింది.

Siddu Jonnalagadda Starrer Tillu Square Movie 5 Days Worldwide Collections Details

5వ రోజు ఎంత వచ్చింది?
'టిల్లు స్క్వేర్' సినిమాకు 5వ రోజు తెలుగు రాష్ట్రాల్లో స్పందన తగ్గింది. ఫలితంగా నైజాంలో రూ. 1.58 కోట్లు, సీడెడ్‌లో రూ. 33 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 33 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 16 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 9 లక్షలు, గుంటూరులో రూ. 13 లక్షలు, కృష్ణాలో రూ. 12 లక్షలు, నెల్లూరులో రూ. 6 లక్షలతో కలిపి.. రూ. 2.80 కోట్లు షేర్, రూ. 4.40 కోట్లు గ్రాస్ వచ్చింది.

5 రోజుల్లో ఎంత వచ్చింది?

5 రోజుల్లో 'టిల్లు స్క్వేర్'కు తెలుగులో భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 16.08 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.70 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.80 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.92 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.14 కోట్లు, గుంటూరులో రూ. 1.66 కోట్లు, కృష్ణాలో రూ. 1.53 కోట్లు, నెల్లూరులో రూ. 93 లక్షలతో కలిపి.. రూ. 30.76 కోట్లు షేర్, రూ. 49.00 కోట్లు గ్రాస్ వచ్చింది.

https telugu filmibeat com whats-new actor-vk-naresh-sensational-tweet-about-ap-politics-news-goes-viral-135735 html

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?
సిద్దు జొన్నలగడ్డ నటించిన 'టిల్లు స్క్వేర్' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 5 రోజుల్లోనే రూ. 30.76 కోట్లు షేర్‌ను వసూలు చేసి సత్తా చాటింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.70 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 10.55 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 5 రోజుల్లో ఈ చిత్రానికి రూ. 44.01 కోట్లు షేర్‌తో పాటు రూ. 83 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. లాభమెంత?

క్రేజీ స్టోరీతో రూపొందిన 'టిల్లు స్క్వేర్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 27 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 28 కోట్లుగా నమోదైంది. ఇక, 5 రోజుల్లోనే దీనికి రూ. 44.01 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌ను అందుకోవడంతో పాటు రూ. 16.01 కోట్లు లాభాలు దక్కించుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X