Tillu Square 8 Days Collections: 50 కోట్ల సంచలనం.. తెలుగులో ఫస్ట్ హీరోగా సిద్దు.. లాభమే అన్ని కోట్లా!
తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఈ మధ్య కాలంలోనే టాలెంట్ ఉన్న హీరోలు చాలా మంది వచ్చారు. కానీ, అందులో కొందరు చాలా కాలం కష్టపడ్డ తర్వాత పాపులర్ అయ్యారు. వారిలో సిద్దు జొన్నలగడ్డ ఒకడు. 'డీజే టిల్లు'తో సెన్సేషన్ అయిన అతడు.. ఇటీవలే 'టిల్లు స్క్వేర్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి ఆరంభంలోనే పాజిటివ్ టాక్ రావడంతో రెస్పాన్స్ భారీ స్థాయిలో లభిస్తోంది. ఫలితంగా ఈ చిత్రం అదిరిపోయే వసూళ్లతో సత్తా చాటుతోంది. ఈ నేపథ్యంలో 'టిల్లు స్క్వేర్' 8 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే లుక్కేయండి!
భారీ హిట్ మూవీకి సీక్వెల్‌తో
సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన ఫన్ మూవీనే 'టిల్లు స్క్వేర్'. మల్లిక్ రామ్ రూపొందించిన ఈ మూవీలో అనుపమ హీరోయిన్‌గా చేసింది. దీన్ని ఫార్చూన్ ఫోర్ సినిమాస్, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించారు. నేహా శెట్టి, ప్రిన్స్, మురళిధర్ కీలక పాత్రలు చేశారు. శ్రీ చరణ్ పాకాల, రామ్ మిరియాల, థమన్ మ్యూజిక్ అందించారు.

టిల్లు స్క్వేర్ బిజినెస్ ఇలా
సిద్దు జొన్నలగడ్డ నటించిన 'టిల్లు స్క్వేర్'కు నైజాంలో రూ. 8.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.00 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 11.00 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 22.00 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 3 కోట్లతో కలిపి మొత్తంగా దీనికి రూ. 27 కోట్లు బిజినెస్ అయింది.

8వ రోజు ఎంత వచ్చింది?
8వ రోజు 'టిల్లు స్క్వేర్' సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రెస్పాన్స్ డౌన్ అయింది. ఫలితంగా నైజాంలో రూ. 67 లక్షలు, సీడెడ్‌లో రూ. 11 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 15 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 8 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 5 లక్షలు, గుంటూరులో రూ. 8 లక్షలు, కృష్ణాలో రూ. 7 లక్షలు, నెల్లూరులో రూ. 4 లక్షలతో కలిపి.. రూ. 1.25 కోట్లు షేర్, రూ. 1.85 కోట్లు గ్రాస్ వచ్చింది.

8 రోజుల్లో ఎంత వచ్చింది?
8 రోజుల్లో 'టిల్లు స్క్వేర్'కు తెలుగులో భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 18.63 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.26 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.42 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.21 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.32 కోట్లు, గుంటూరులో రూ. 1.91 కోట్లు, కృష్ణాలో రూ. 1.75 కోట్లు, నెల్లూరులో రూ. 1.06 కోట్లతో కలిపి.. రూ. 35.56 కోట్లు షేర్, రూ. 58.20 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంత?
సిద్దు జొన్నలగడ్డ నటించిన 'టిల్లు స్క్వేర్' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 8 రోజుల్లోనే రూ. 35.56 కోట్లు షేర్‌ను వసూలు చేసి సత్తా చాటింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 3.05 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 11.90 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 8 రోజుల్లో ఈ చిత్రానికి రూ. 50.51 కోట్లు షేర్‌తో పాటు రూ. 93 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. లాభమెంత?
క్రేజీ స్టోరీతో రూపొందిన 'టిల్లు స్క్వేర్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 27 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 28 కోట్లుగా నమోదైంది. ఇక, 8 రోజుల్లోనే దీనికి రూ. 50.51 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌ను అందుకోవడంతో పాటు రూ. 22.51 కోట్లు లాభాలు దక్కించుకుంది. అలాగే, వేగంగా రూ. 50 కోట్లు షేర్ మార్క్ కొట్టిన మీడియం రేంజ్ హీరోగా సిద్దు రికార్డు సాధించాడు.


Click it and Unblock the Notifications











