Tillu Square 9 Days Collections: ఊచకోత అంటే ఇదే.. 100 కోట్లు కొట్టి టిల్లు.. లాభంతోనే సంచలన రికార్డు
టాలీవుడ్‌లో కొందరు యంగ్ హీరోలు మాత్రమే ప్రత్యేకమైన ఇమేజ్‌తో సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ. కెరీర్ ఆరంభం నుంచే తనదైన చిత్రాలతో మెప్పిస్తోన్న అతడు.. 'డీజే టిల్లు'తో బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. ఈ ఊపులోనే ఇప్పుడు 'టిల్లు స్క్వేర్' అనే సినిమాతో వచ్చాడు. ఈ మూవీకి మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ రావడంతో రెస్పాన్స్ భారీ స్థాయిలోనే లభిస్తోంది. ఫలితంగా ఈ చిత్రం అదిరిపోయే వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో 'టిల్లు స్క్వేర్' 9 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే లుక్కేయండి మరి!
మరోసారి వచ్చేసిన టిల్లు
సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన క్రేజీ సినిమానే 'టిల్లు స్క్వేర్'. మల్లిక్ రామ్ రూపొందించిన ఈ మూవీలో అనుపమ హీరోయిన్‌గా చేసింది. దీన్ని ఫార్చూన్ ఫోర్ సినిమాస్, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించారు. నేహా శెట్టి, ప్రిన్స్, మురళిధర్ కీలక పాత్రలు చేశారు. శ్రీ చరణ్ పాకాల, రామ్ మిరియాల, థమన్ మ్యూజిక్ ఇచ్చారు.

టిల్లు స్క్వేర్ బిజినెస్ ఇలా
సిద్దు జొన్నలగడ్డ 'టిల్లు స్క్వేర్' సినిమాకు నైజాంలో రూ. 8.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.00 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 11.00 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 22.00 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 3 కోట్లతో కలిపి మొత్తంగా దీనికి రూ. 27 కోట్లు బిజినెస్ జరిగింది.
9వ రోజు కూడా భారీగానే
మల్లిక్ రామ్ దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన 'టిల్లు స్క్వేర్' సినిమాకు 9వ రోజు రెస్పాన్స్ మరింతగా పెరిగిపోయింది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ మూవీ రూ. 1.60 కోట్లు వసూలు చేసింది. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా రూ. 2.10 కోట్లు షేర్ రాబట్టింది. ఇలా 9 రోజుల్లో రూ. 52 కోట్లకు పైగా షేర్‌ను వంద కోట్ల వరకూ గ్రాస్‌ను రాబట్టి సత్తా చాటింది.



Click it and Unblock the Notifications











