Tillu Square: మరో రికార్డు కొట్టిన టిల్లు స్క్వేర్.. టాలీవుడ్‌లో తొలి హీరోగా సిద్దు ఘనత
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది యంగ్ హీరోలు ఉన్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ ఒకడు. చాలా కాలం క్రితమే ఇండస్ట్రీలోకి వచ్చిన అతడు.. కొన్ని విజయాలను మాత్రమే అందుకున్నాడు. ఈ పరిస్థితుల్లో 'డీజే టిల్లు'తో సెన్సేషనల్ హిట్‌ను కొట్టాడు. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా 'టిల్లు స్క్వేర్' మూవీతో వచ్చాడు. ఈ సినిమా తాజాగా అమెరికాలో సంచలన రికార్డును సొంతం చేసుకుంది. ఆ సంగతులేంటో మీరే చూసేయండి మరి!
మరో క్రేజీ కథతో వచ్చాడు
సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన తాజా చిత్రమే 'టిల్లు స్క్వేర్'. మల్లిక్ రామ్ రూపొందించిన ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా చేసింది. ఫార్చూన్ ఫోర్ సినిమాస్, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై నాగ వంశీ, సాయి సౌజన్య దీన్ని నిర్మించారు. శ్రీ చరణ్ పాకాల, రామ్ మిరియాల, థమన్ మ్యూజిక్ ఇచ్చారు. నేహా శెట్టి కామియో రోల్‌తో సర్‌ప్రైజ్ చేసింది.

అమెరికాలో భారీగా రిలీజ్
హిట్ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన 'టిల్లు స్క్వేర్' మార్చి 29వ తేదీన ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2000లకు థియేటర్లకు పైగానే తీసుకు వచ్చారు. పెద్దగా పోటీ లేకపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో దీనికి పెద్ద స్క్రీన్లు లభించాయి. అందుకు అనుగుణంగానే ఓవర్సీస్‌లో కూడా ఈ చిత్రం అత్యధిక లొకేషన్లలో ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అయింది.
భారీ స్పందనతో టార్గెట్
సిద్దు జొన్నలగడ్డ- అనుపమ జంటగా నటించిన 'టిల్లు స్క్వేర్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ మంచి టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లుగానే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఓవర్సీస్‌లో అయితే ఈ చిత్రం మొదటి రోజు నుంచే భారీ రెస్పాన్స్ రాబడుతోంది. దీంతో అక్కడ అత్యధిక కలెక్షన్లను వసూలు చేస్తూ రెండు రోజుల్లోనే టార్గెట్‌ను పూర్తి చేసుకుంది.

2 మిలియన్ల మార్క్ కొట్టి
సిద్దు జొన్నలగడ్డ హీరోగా చేసిన 'టిల్లు స్క్వేర్' మూవీకి ఓవర్సీస్‌లో ఊహించని రీతిలో భారీ స్పందన దక్కుతూనే ఉంది. ఈ సినిమాకు ప్రీమియర్స్ ద్వారానే 400K డాలర్లకు పైగా గ్రాస్ వచ్చింది. ఆ తర్వాత మొదటి రోజు ఇది 550K డాలర్లు వరకూ రాబట్టింది. ఆ తర్వాత కూడా ఈ చిత్రం దూసుకెళ్తూనే ఉంది. ఇలా ఈ సినిమా తాజాగా 2 మిలియన్ మార్కును చేరుకుంది.
మొదటి హీరోగా రికార్డు
'టిల్లు స్క్వేర్' మూవీ ఓవర్సీస్‌లో హవాను చూపిస్తూనే ఉంది. ముఖ్యంగా ఇది 2 మిలియన్ మార్కును చేరుకోవడంతో నార్త్ అమెరియాలో వేగంగా ఈ మార్కును చేరుకున్న మొదటి మీడియం రేంజ్ మూవీగా రికార్డు సాధించింది. అదే సమయంలో సిద్దు జొన్నలగడ్డ కూడా ఈ మార్కును వేగంగా చేరుకున్న ఫస్ట్ మీడియం రేంజ్ హీరోగా నిలిచి సత్తా చాటుకున్నాడు.


Click it and Unblock the Notifications











