Tillu Square Day 1 Collections: టిల్లు గాడు కుమ్మేశాడు.. తొలి రోజే సంచలన వసూళ్లు.. 2వ మూవీగా రికార్డు
టాలీవుడ్‌లో యంగ్ హీరోలు అందరూ తమదైన యాక్టింగ్ స్కిల్స్‌తో మెప్పిస్తూ ముందుకు సాగుతున్నారు. అందులో కొందరైతే విశేషమైన గుర్తింపుతో రచ్చ లేపుతున్నారు. అలాంటి వారిలో స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ ఒకడు. చాలా తక్కువ సమయంలోనే సెన్సేషన్ అయిన అతడు.. ఇప్పుడు 'టిల్లు స్క్వేర్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి ఆరంభంలోనే పాజిటివ్ టాక్ రావడంతో రెస్పాన్స్ కూడా భారీ స్థాయిలో లభించింది. ఫలితంగా కలెక్షన్లు పోటెత్తాయి. మరి 'టిల్లు స్క్వేర్' మొదటి రోజు ఎంత వసూలు చేసిందో మీరే చూసేయండి మరి!
టిల్లు స్క్వేర్ అంటూ ఎంట్రీ
సిద్దు జొన్నలగడ్డ హీరోగా మల్లిక్ రామ్ రూపొందించి సినిమానే 'టిల్లు స్క్వేర్'. అనుపమ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీని ఫార్చూన్ ఫోర్ సినిమాస్, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించారు. శ్రీ చరణ్ పాకాల, రామ్ మిరియాల ఈ మూవీకి సాంగ్స్.. థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ప్రిన్స్, మురళిధర్ తదితరులు నటించారు.

టిల్లు స్క్వేర్ బిజినెస్ ఇలా
సిద్దు నటించిన 'టిల్లు స్క్వేర్' మూవీకి నైజాంలో రూ. 8.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.00 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 11.00 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 22.00 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 3 కోట్లతో కలిపి మొత్తంగా దీనికి రూ. 27 కోట్లు బిజినెస్ అయింది.
డీసెంట్ టాక్‌తో భారీగానే
క్రేజీ కామెడీతో రూపొందిన 'టిల్లు స్క్వేర్' మూవీ గత శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ డీసెంట్ టాక్ వచ్చింది. దీంతో ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన కూడా ఆ రేంజ్‌లోనే అంటే భారీగానే లభించింది. ఫలితంగా ఈ చిత్రానికి ఆశించిన రీతిలోనే కంటే ఎక్కువ వసూళ్లు వస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.

తొలి రోజు ఎంత వచ్చింది?
'టిల్లు స్క్వేర్' సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 4.35 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.04 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.24 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 75 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 43 లక్షలు, గుంటూరులో రూ. 56 లక్షలు, కృష్ణాలో రూ. 49 లక్షలు, నెల్లూరులో రూ. 39 లక్షలతో కలిపి.. రూ. 9.25 కోట్లు షేర్, రూ. 13.45 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంత?
సిద్దు జొన్నలగడ్డ నటించిన 'టిల్లు స్క్వేర్' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో మొదటి రోజు రూ. 9.25 కోట్లు షేర్‌ను వసూలు చేసి సత్తా చాటింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 45 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 4.60 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే మొదటి రోజు ఈ చిత్రానికి రూ. 14.30 కోట్లు షేర్‌తో పాటు రూ. 23.70 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?
ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'టిల్లు స్క్వేర్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 27 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 28 కోట్లుగా నమోదైంది. ఇక, తొలి రోజు దీనికి రూ. 14.30 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 13.70 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.
రెండో మూవీ.. అక్కడ 4లో
'టిల్లు స్క్వేర్' మూవీకి మొదటి రోజు అనూహ్యమైన స్పందన వచ్చింది. ఫలితంగా ఇది 2024లో రెండో అత్యధిక గ్రాస్‌ను వసూలు చేసిన చిత్రంగా నిలిచింది. అలాగే, మీడియం రేంజ్ హీరోల్లో నైజాంలో మూడో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగానూ నిలిచింది. అలాగే, ఇది ఎన్నో రికార్డులను సైతం నమోదు చేసుకుని సత్తా చాటుకుంది.


Click it and Unblock the Notifications











