Tillu Square Business: సిద్దు మూవీకి రికార్డు బిజినెస్.. ఆ హీరోలతో సమానంగా.. టిల్లు 2 హిట్ కావాలంటే!

ఎలాంటి సినీ నేపథ్యం లేకుండానే హీరోగా పరిచయమైనా అసాధారణమైన టాలెంట్‌తో సత్తా చాటుకుంటూ వెళ్తున్నాడు స్టార్ బాయ్ సిద్దు జొన్నలగొడ్డ. కెరీర్ ఆరంభం నుంచీ డిఫరెంట్ మూవీలు చేస్తోన్న అతడు.. 'డీజే టిల్లు'తో సెన్సేషనల్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు.

ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు 'టిల్లు స్క్వేర్' అనే సినిమాను చేశాడు. ఎన్నో అంచనాలను ఏర్పరచుకున్న ఈ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమాకు థియేట్రికల్ బిజినెస్ ఎంత జరిగింది? ఎన్ని కోట్లు వస్తే ఇది హిట్ అవుతుంది? చూద్దాం పదండి!

Siddu Jonnalagadda Starrer Tillu Square Movie Pre Release Business Details

డీజే టిల్లుకు సీక్వెల్‌లో సిద్దు
సిద్దు జొన్నలగడ్డ హీరోగా మల్లిక్ రామ్ తెరకెక్కించిన సినిమానే 'టిల్లు స్క్వేర్'. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీని ఫార్చూన్ ఫోర్ సినిమాస్, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించారు. శ్రీ చరణ్ పాకాల, రామ్ మిరియాల ఈ మూవీకి సాంగ్స్ ఇవ్వగా.. థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్‌ను అందించాడు.

Siddu Jonnalagadda Starrer Tillu Square Movie Pre Release Business Details

అలాంటి కథతో ఫుల్ ఫన్‌తో

అమ్మాయి ప్రేమలో పడి మోసపోయిన కుర్రాడి కథతో 'డీజే టిల్లు' మూవీ తెరకెక్కింది. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా వచ్చిన 'టిల్లు స్క్వేర్' కూడా ఇంచుమించు అదే స్టోరీలైన్‌తో రూపొందినట్లు తెలుస్తోంది. అయితే, ఇందులో కొంచెం యాక్షన్, ట్విస్టులు ఇంకాస్త ఎక్కువ పెట్టారు. ఫలితంగా ఈ చిత్రం మరిన్ని అంచనాలను ఏర్పరచుకుని ఆడియెన్స్‌ను అలరించేందుకు వచ్చింది.

Siddu Jonnalagadda Starrer Tillu Square Movie Pre Release Business Details

గ్రాండ్ రిలీజ్.. టాక్ బాగానే
డీజే టిల్లు మూవీతో సెన్సేషనల్ హిట్‌ను అందుకున్న సిద్దు జొన్నలగడ్డ నటించిన 'టిల్లు స్క్వేర్' మూవీ ఎన్నో అంచనాలతో తాజాగా రిలీజ్ అయింది. దీనికి ఆరంభంలోనే డీసెంట్ టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లుగానే ప్రేక్షకుల నుంచి స్పందన కూడా లభిస్తోంది. ఇదే కంటిన్యూ అయితే కలెక్షన్లు కూడా భారీగానే వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

సినిమా ప్రీ బిజినెస్ ఇలా

ఫుల్ లెంగ్త్ కామెడీతో రూపొందిన 'టిల్లు స్క్వేర్' మూవీపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. దీంతో దీనికి అన్ని ఏరియాల్లో మంచి డిమాండ్ వచ్చింది. ఫలితంగా ఈ సినిమా నైజాంలో రూ. 8.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.00 కోట్లు, ఆంధ్రా మొత్తంలో రూ. 11.00 కోట్లు బిజినెస్ చేసింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ. 22.00 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకుంది.

Siddu Jonnalagadda Starrer Tillu Square Movie Pre Release Business Details

వరల్డ్ వైడ్‌గా ఎంతంటే
సిద్దు జొన్నలగడ్డ - అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన 'టిల్లు స్క్వేర్' మూవీపై అందరిలో ఆసక్తి ఉంది. అందుకు తగ్గట్లే మార్కెట్ పరంగా ఇది బయ్యర్ల దృష్టిని ఆకట్టుకుంది. ఫలితంగా రెస్టాఫ్ ఇండియా, కర్నాటకలో రూ. 2 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 3.00 కోట్లకు అమ్ముడైంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 27 కోట్లు థియేట్రికల్ బిజినెస్‌ను చేసుకుంది.

Siddu Jonnalagadda Starrer Tillu Square Movie Pre Release Business Details

అన్ని కోట్లు వస్తేనే హిట్

సిద్దు నటించిన 'టిల్లు స్క్వేర్' సినిమాకు రికార్డు స్థాయిలో రూ. 27 కోట్లు బిజినెస్ జరిగింది. దీంతో ఈ సినిమాకు రూ. 28.00 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ నమోదైంది. అంటే.. ఇంత మొత్తం వసూలు చేస్తేనే 'టిల్లు స్క్వేర్' సినిమా కమర్షియల్‌గా విజయం సాధిస్తుంది. ఇదిలా ఉండగా.. ఈ బిజినెస్ టాలీవుడ్‌లో మీడియం రేంజ్ హీరోల సినిమాలకు సమానంగా ఉందని చెప్పొచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X