Sikandar Day 1 Collections: షాకింగ్‌గా సల్మాన్ మూవీ కలెక్షన్లు.. సికందర్‌కు ఎన్ని కోట్లంటే?
బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్, రష్మిక మందన్న, కాజల్ అగర్వాల్, శర్మాన్ షోషి, సత్యరాజ్, సంజయ్ కపూర్ తదితరులు నటించిన సికందర్ చిత్రం రంజాన్ పండుగ కానుకగా ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. సౌత్ టాప్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సాజిద్ నాడియావాలా నిర్మించారు. ఈ సినిమా బడ్జెట్ ఎంత? వసూలు చేస్తున్న కలెక్షన్లు ఎంత అనే వివరాల్లోకి వెళితే..
హిందీ సినిమా పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థలు నాడియావాలా గ్రాండ్‌సన్, సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ బ్యానర్లపై సంయుక్తంగా రూపొందించిన ఈ సినిమాను భారీ సెట్టింగ్స్, హై ప్రొడక్షన్ వాల్యూస్‌లో రూపొందించారు. అంతేకాకుండా ఈ చిత్రానికి హైలీ టాలెంటెడ్ టెక్నిషియన్స్ పనిచేశారు. దాంతో ఈ సినిమా బడ్జెట్ 200 కోట్ల రూపాయలు అయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించారు.

కిసి కా భాయ్ కిసి కా జాన్ సినిమా డిజాస్టర్ తర్వాత సికందర్ రావడంతో అంచనాలు పెరిగాయి. రష్మిక మందన్న వరుస హిట్స్‌తో కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో నటించారు. దాంతో ఈ సినిమాపై క్రేజ్ ఎక్కువగానే నెలకొనడంతో ఈ మూవీని గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఈ సినిమాను సుమారుగా 6000 స్క్రీన్లపై రిలీజ్ చేశారు. దాంతో ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద భారీగానే ఓపెనింగ్స్ సాధించాయి.
సికందర్ సినిమా రెగ్యులర్ రిలీజ్ ఫార్మాట్‌కు భిన్నంగా రిలీజైంది. ఈ సినిమా శుక్రవారం కాకుండా ఆదివారం ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ఉగాది పండుగతోపాటు రంజాన్‌కు ముందు రోజు ఈ సినిమాను విడుదల చేశారు. ఆదివారం ఈ సినిమా 15 శాతం, మ్యాట్నికి 30 శాతం, ఫస్ట్ షోకు 30 శాతం, సెకండ్ షోకు 35 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. అత్యధికంగా చెన్నైలో 47 శాతం, 28 శాతం బెంగళూరు, 25 శాతం ముంబైలో, హైదరాబాద్‌లో 22 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.
ఇక సల్మాన్ ఖాన్ సినిమా అంచనాలకు భిన్నంగా కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 28 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని సాక్ నిల్క్, ఇతర ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే సెకండ్ షోకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తే.. ఇంకాస్త కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
సికిందర్ సినిమా బ్రేక్ ఈవెన్ పాయింట్ విషయానికి వస్తే.. ఈ సినిమా కనీసం 200 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ మూవీని బాక్సాఫీస్ వద్ద ఎలా పెర్ఫార్మ్ చేస్తుందనే విషయం గురించి కొద్ది రోజులు అగితే ఈ సినిమా ఫేట్ తెలియడం ఖాయమని ట్రేడ్ వర్గాలు వెల్లడించారు.


Click it and Unblock the Notifications











