Sikandar Day 11 Collections : 200 కోట్లు కొట్టి రిలాక్స్ .. సికందర్‌కు షాకింగ్ కలెక్షన్స్ , 11వ రోజు ఎంతంటే?

తన లక్కీ డైరెక్టర్ ఏఆర్ మురదాస్ దర్శకత్వంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన చిత్రం సికందర్. రష్మిక మందన్న ఫిమేల్ లీడ్‌గా నటించగా.. స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కథను మలుపుతిప్పే కీ రోల్‌ పోషించారు. టఫ్ ఫైట్‌తో పాటు రిలీజైన రోజు నుంచే డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ సికిందర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్, సాజిద్ నడియావాలా గ్రాండ్ సన్స్ బ్యానర్‌లపై ఈ చిత్రాన్ని సాజిద్ నడియద్‌వాలా నిర్మించారు. ఈ సినిమా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్? గత 11 రోజులుగా సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

Sikandar Day 11 Collections Worldwide Salman Khan s Movie Entered in 200 Crores club

సికందర్ బడ్జెట్ ఎంత (Sikandar Budget)?

యాక్షన్, హ్యుమన్ ఎమోషన్స్‌తో రూపొందించిన సికందర్ సినిమాలో స్టార్ యాక్టర్లు, టాప్ టెక్నిషియన్స్ వర్క్ చేశారు. అలాగే సల్మాన్ ఖాన్‌కు ఉన్న భద్రతా ఏర్పాట్ల దృష్ట్యా ఈ సినిమాను భారీ సెట్స్ వేసి, విదేశాల్లో కూడా చిత్రీకరించారు. దాంతో ఈ సినిమాకు భారీగానే బడ్జెట్ అయింది. సుమారుగా 200 కోట్ల రూపాయలతో గ్రాండ్‌గా తెరకెక్కించారు.

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత (Sikandar Break Even Target)?

ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్‌కు మాత్రం భారీ రేటు పలికింది. దాంతో ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ బాక్సాఫీస్ వద్ద సులభమైంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పాయింట్ సుమారుగా 100 కోట్ల రూపాయల నెట్, 200 కోట్ల రూపాయలు గ్రాస్ వసూళ్లను కలెక్ట్ చేయాలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు.

గత 10 రోజుల కలెక్షన్లు (Salman's Movie 10 days Collections)

సికందర్ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 26 కోట్ల రూపాయల నెట్, 2వ రోజు 29 కోట్ల రూపాయల నెట్, 3వ రోజు 20 కోట్ల నెట్, 4వ రోజు 10 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా కేవలం నాలుగు రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిందని సాక్ నిల్క్ వెబ్ సైట్ వెల్లడించింది. ఐదో రోజు రూ.6 కోట్లు, ఆరో రోజు రూ.4 కోట్ల నెట్ రాబట్టింది. 7వ రోజు 4 కోట్లు, 8వ రోజు రూ. 4.75 కోట్లు, 9వ రోజు రూ.1.75 కోట్లు, 10వ రోజు రూ.1.50 కోట్ల ఇండియా నెట్ వసూల్ చేసింది. ఫలితంగా 10 రోజుల వరకు ఇండియా వైడ్‌గా రూ.105.6 కోట్ల నికర వసూళ్లు, రూ.123.65 కోట్ల గ్రాస్ అందుకుంది సికందర్. అయితే సల్మాన్ ఖాన్ - రష్మికల చిత్రం రూ.200 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టినట్లు నడియాద్‌వాలా గ్రాండ్‌సన్స్ అధికారికంగా ప్రకటించింది. 9వ రోజు వసూళ్లతో కలిపి సికందర్ 200 కోట్ల క్లబ్‌లో చేరినట్లు చిత్ర నిర్మాణ సంస్థ తెలిపింది.

ఓవర్సీస్‌లో కలెక్షన్లు (Overseas Collections)

హిందీ సినిమాకు స్ట్రాంగ్ బేస్ ఉన్న ఓవర్సీస్‌లో సికందర్ ఎలాంటి వసూళ్లు రాబడతాడోనని టెన్షన్ వాతావరణం నెలకొంది. తొలిరోజే డివైడ్ టాక్ వచ్చినప్పటికీ ఓవర్సీస్‌ ఆడియన్స్ ఏమాత్రం డిజప్పాయింట్ చేయలేదు. విడుదలైన నాటి నుంచి సికందర్ సినిమాకు సాలీడ్ కలెక్షన్స్ వస్తూ సినిమాకు ప్లస్ పాయింట్‌గా మారాయి. ఓవర్సీస్‌లో సల్మాన్ ఖాన్ - రష్మికల చిత్రానికి 10వ రోజు వరకు రూ.49 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో సికందర్ ప్రపంచవ్యాప్తంగా 172 కోట్ల రూపాయల గ్రాస్ ను ఆర్జించిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

11వ రోజు కలెక్షన్లు ఎంతంటే (Sikandar Day 11 Collections)?

సోమవారం నుంచి క్రమం తప్పకుండా కలెక్షన్స్ కోల్పోతున్న సిందకర్ ఏ దశలోనూ పుంజుకోలేకపోతోంది. బుధవారం ఓవరాల్‌గా కేవలం 7.15 శాతం థియేటర్ ఆక్యూపెన్సీ మాత్రమే చేసి మరోసారి షాకిచ్చింది. ఈ పరిణామాలతో 11వ రోజు కూడా సల్మాన్ చిత్రానికి కలెక్షన్స్ భారీగా పడిపోయినట్లు సాక్ నిల్క్ వెబ్‌సైట్ వెల్లడించింది. బుధవారం ఈ సినిమా ఇండియా వైడ్‌గా రూ.1.35 కోట్ల నెట్ సాధించింది.

మొత్తంగా 11 రోజుల వరకు సికందర్ చిత్రం భారత్‌లో నికరంగా రూ. 107.14 కోట్లు .. రూ.125.50 కోట్ల గ్రాస్ అందుకుంది. భారత్‌లో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్‌ కలెక్షన్స్ రూ.49 కోట్లు కలిపి సికందర్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.174.64 కోట్లు ఆర్జించినట్లు సాక్ నిల్క్ వెబ్‌సైట్ నివేదించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X