Sikandar Day 8 Collections : సికందర్ 8వ రోజు కలెక్షన్లు.. రష్మిక మందన్న సినిమాకు ఎన్ని కోట్లో తెలుసా?
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ లేటెస్ట్ ఫిల్మ్ సికందర్. ఈ చిత్రాన్ని తమిళ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ దర్శకత్వం వహించారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. మరో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కీలకపాత్రలో అలరించింది. అయితే ఈ చిత్రం డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం వసూళ్ల వర్షం కురిపిస్తోంది. సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్, సాజిద్ నడియావాలా గ్రాండ్ సన్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మించిన సికందర్‌ను ప్రముఖ నిర్మాత సాజిద్ నాడియావాలా నిర్మించారు. ఈ సినిమా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్? గత 8 రోజులుగా సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
సికందర్ బడ్జెట్ ఎంత (Sikandar Budget)?
యాక్షన్, హ్యుమన్ ఎమోషన్స్‌తో రూపొందించిన సికందర్ సినిమాలో స్టార్ యాక్టర్లు, టాప్ టెక్నిషియన్స్ వర్క్ చేశారు. అలాగే సల్మాన్ ఖాన్‌కు ఉన్న భద్రతా ఏర్పాట్ల దృష్ట్యా ఈ సినిమాను భారీ సెట్స్ వేసి, విదేశాల్లో కూడా చిత్రీకరించారు. దాంతో ఈ సినిమాకు భారీగానే బడ్జెట్ అయింది. సుమారుగా 200 కోట్ల రూపాయలతో గ్రాండ్‌గా తెరకెక్కించారు.

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత (Sikandar Break Even Target)?
ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్‌కు మాత్రం భారీ రేటు పలికింది. దాంతో ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ బాక్సాఫీస్ వద్ద సులభమైంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పాయింట్ సుమారుగా 100 కోట్ల రూపాయల నెట్, 200 కోట్ల రూపాయలు గ్రాస్ వసూళ్లను కలెక్ట్ చేయాలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు.
గత 7 రోజుల కలెక్షన్లు (Salman's Movie 7 days Collections)
సికందర్ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 26 కోట్ల రూపాయల నెట్, 2వ రోజు 29 కోట్ల రూపాయల నెట్, 3వ రోజు 20 కోట్ల నెట్, 4వ రోజు 10 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా కేవలం నాలుగు రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిందని సాక్ నిల్క్ వెబ్ సైట్ వెల్లడించింది. ఐదో రోజు రూ.6 కోట్లు, ఆరో రోజు రూ.4 కోట్ల నెట్ రాబట్టింది. 7వ రోజు 4 కోట్ల రూపాయల ఇండియా నెట్ వసూల్ చేసింది. ఫలితం మొదటి వారం రోజుల్లో రూ.97.75 కోట్ల ఇండియా నికర వసూళ్లను సాధించింది. రూ.116 కోట్ల వరకు ఇండియా గ్రాస్ ను అందుకుంది.
ఓవర్సీస్‌లో కలెక్షన్లు (Overseas Collections)
సల్మాన్‌ఖాన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ దృష్ట్యా సికందర్ సినిమాకు ఓవర్సీస్‌లోనూ భారీగా వసూలు వస్తున్నాయి. ఓవర్సీస్ కలెక్షన్స్ ఈ సినిమాకు ప్లస్‌గా మారాయి. ఆడియెన్స్ నుంచి మిశ్రమ స్పందనను తెచ్చుకున్నప్పటికీ ఈ సినిమా ఓవర్సీస్‌లో 7వ రోజు వరకు రూ.45.35 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో సికందర్ ప్రపంచవ్యాప్తంగా 161.50 కోట్ల రూపాయల గ్రాస్ ను ఆర్జించిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
8వ రోజు కలెక్షన్లు ఎంతంటే (Sikandar Day 8 Collections)?
ఆదివారం శ్రీరామనవమి అయిన్పటికీ సికిందర్‌కు మునపటి రోజుతో పోల్చితే బుకింగ్స్ కాస్తా మెరుగయ్యాయి. సల్మాన్ చిత్రం ఓవరాల్‌గా 11.50 శాతం థియేటర్ ఆక్యూపెన్సీ సాధించింది. ఇక 8వ రోజు ఈ చిత్రం నిలకడగా కలెక్షన్లను సాధించిందని సాక్ నిల్క్ వెబ్‌సైట్ వెల్లడించింది. ఆదివారం ఇండియా వైడ్‌గా రూ.4.50 కోట్ల నెట్ సాధించింది. మొత్తంగా 8 రోజుల వరకు సికందర్ చిత్రం భారత్‌లో నికరంగా రూ. 102.25 కోట్లు కలెక్ట్ చేసింది. రూ.116.15 కోట్ల గ్రాస్ అందుకుంది. భారత్‌లో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ రూ.45.35 కోట్లు కలిపి సికందర్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.161.50 కోట్లు ఆర్జించినట్లు సాక్ నిల్క్ వెబ్‌సైట్ నివేదించింది.


Click it and Unblock the Notifications











