Sikandar Day 9 Collections : పడిపోయిన బుకింగ్స్ .. సికందర్‌కు షాకింగ్ కలెక్షన్స్ .. ఎన్ని కోట్లంటే?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తాజాగా నటించిన చిత్రం సికందర్. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించగా.. కాజల్ అగర్వాల్ కీలకపాత్ర పోషించింది. మార్నింగ్ షో నుంచే డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రంబాక్సాఫీస్ వద్ద మాత్రం వసూళ్ల వర్షం కురిపిస్తోంది. సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్, సాజిద్ నడియావాలా గ్రాండ్ సన్స్ బ్యానర్‌లపై సికందర్‌ను సాజిద్ నాడియావాలా నిర్మించారు. ఈ సినిమా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్? గత 9 రోజులుగా సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

Sikandar Day 9 Collections Worldwide salman khan and rashmika mandanna movie faced heavy drop

సికందర్ బడ్జెట్ ఎంత (Sikandar Budget)?

యాక్షన్, హ్యుమన్ ఎమోషన్స్‌తో రూపొందించిన సికందర్ సినిమాలో స్టార్ యాక్టర్లు, టాప్ టెక్నిషియన్స్ వర్క్ చేశారు. అలాగే సల్మాన్ ఖాన్‌కు ఉన్న భద్రతా ఏర్పాట్ల దృష్ట్యా ఈ సినిమాను భారీ సెట్స్ వేసి, విదేశాల్లో కూడా చిత్రీకరించారు. దాంతో ఈ సినిమాకు భారీగానే బడ్జెట్ అయింది. సుమారుగా 200 కోట్ల రూపాయలతో గ్రాండ్‌గా తెరకెక్కించారు.

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత (Sikandar Break Even Target)?

ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్‌కు మాత్రం భారీ రేటు పలికింది. దాంతో ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ బాక్సాఫీస్ వద్ద సులభమైంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పాయింట్ సుమారుగా 100 కోట్ల రూపాయల నెట్, 200 కోట్ల రూపాయలు గ్రాస్ వసూళ్లను కలెక్ట్ చేయాలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు.

గత 8 రోజుల కలెక్షన్లు (Salman's Movie 8 days Collections)

సికందర్ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 26 కోట్ల రూపాయల నెట్, 2వ రోజు 29 కోట్ల రూపాయల నెట్, 3వ రోజు 20 కోట్ల నెట్, 4వ రోజు 10 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా కేవలం నాలుగు రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిందని సాక్ నిల్క్ వెబ్ సైట్ వెల్లడించింది. ఐదో రోజు రూ.6 కోట్లు, ఆరో రోజు రూ.4 కోట్ల నెట్ రాబట్టింది. 7వ రోజు 4 కోట్ల రూపాయల ఇండియా నెట్ వసూల్ చేసింది. ఫలితంగా మొదటి వారం రోజుల్లో ఇండియా వైడ్‌గా రూ.97.75 కోట్ల నికర వసూళ్లు, రూ.116 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇక 8వ రోజు భారత్‌లో నికరంగా 4.75 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది సికందర్.

ఓవర్సీస్‌లో కలెక్షన్లు (Overseas Collections)

సల్మాన్‌ఖాన్‌, రష్మికల మేనియాతో ప్రపంచవ్యాప్తంగా సికందర్ సినిమాకు భారీ కలెక్షన్స్ వస్తున్నాయి. డివైడ్ టాక్ వచ్చినప్పటికీ ఓవర్సీస్ ఆడియన్స్ మాత్రం సల్మాన్ చిత్రానికి బ్రహ్మారథం పడుతున్నారు. సికందర్ సినిమా ఓవర్సీస్‌లో 8వ రోజు వరకు రూ.47 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో సికందర్ ప్రపంచవ్యాప్తంగా 161.50 కోట్ల రూపాయల గ్రాస్ ను ఆర్జించిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

9వ రోజు కలెక్షన్లు ఎంతంటే (Sikandar Day 9 Collections)?

వీకెండ్, ఫెస్టివల్ సీజన్ ముగియడంతో సికందర్‌కు బుకింగ్స్ డ్రాప్ అయ్యాయి. సోమవారం సల్మాన్ చిత్రం ఓవరాల్‌గా 7.02 శాతం థియేటర్ ఆక్యూపెన్సీ సాధించింది. ఇక 9వ రోజు సికందర్‌కు కలెక్షన్స్ భారీగా పడిపోయినట్లు సాక్ నిల్క్ వెబ్‌సైట్ వెల్లడించింది. సోమవారం ఇండియా వైడ్‌గా రూ.1.75 కోట్ల నెట్ సాధించింది. మొత్తంగా 9 రోజుల వరకు సికందర్ చిత్రం భారత్‌లో నికరంగా రూ. 104.25 కోట్లు .. రూ.121.65 కోట్ల గ్రాస్ అందుకుంది. భారత్‌లో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్‌ కలెక్షన్స్ రూ.47 కోట్లు కలిపి సికందర్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.168.65 కోట్లు ఆర్జించినట్లు సాక్ నిల్క్ వెబ్‌సైట్ నివేదించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X