‘సికిందర్’ ఫస్ట్ డే కలెక్షన్స్
హైదరాబాద్: సూర్య, సమంత హీరో హీరోయిన్లుగా లింగు స్వామి దర్శకత్వంలో తెరకెక్కిన 'సికిందర్' చిత్రానికి ఫస్ట్ డే కలెక్షన్స్ ఫర్వాలేదనే విధంగా ఉన్నాయి. సినిమా విడుదలకు ముందు నుండే ప్రమోషన్స్ అదరగొట్టడంతో మంచి ఓపెనింగ్స్ రాబట్టింది.
నైజాం ఏరియాలో తొలి రోజు 1.5 కోట్లు వసూలు చేసినట్లు అంచనా. ఇతర ప్రాంతాల్లో కలుపుకుంటే ఆంధ్రా, తెలంగాణలో 3 కోట్లు వసూలు చేసినట్లు అంచనా. తమిళ వెర్షన్ 'అంజాన్' తమిళనాడులో తొలి రోజు రూ. 7 కోట్లకు పైగా వసూలు చేసింది. హాలీడే రోజు విడుదల కావడం కలెక్షన్ల పరంగా కలిసొచ్చింది.

అయితే సినిమా మార్నింగ్ షో నుండే డివైడ్ టాక్ రావడంతో వీకెండ్ కలెక్షన్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది. రొటీన్ మాఫియా బ్యాగ్రౌండ్ స్టోరీలైన్ కావడం, కథనం కూడా ఆకట్టుకునే విధంగా లేక పోవడంతో నెగెటివ్ టాక్ ప్రచారంలోకి వచ్చింది.


Click it and Unblock the Notifications











