Don't Miss!
- News తనపై ఉన్న కేసుల వివరాలను వెల్లడించిన సీఎం జగన్
- Sports IPL 2024: అప్పుడు కావ్య పాపను చూసి నవ్వుకున్నారు.. ఇప్పుడు ఆమె నవ్వుతోంది!
- Technology యూట్యూబ్‌కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
డబ్బింగైనా బిజినెస్ ఇరగతీస్తోంది
హైదరాబాద్ : తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకున్న తమిళ డబ్బింగ్ చిత్రాల బిజినెస్ ...మన స్ట్రైయిట్ హీరోల బిజినెస్ లతో పోటీబడుతున్నాయి. తాజాగా సూర్య హీరోగా నటించిన అంజాన్ చిత్రం సికిందర్ టైటిల్ తో తెలుగులో కి దిగుతోంది. ఈ చిత్రం రైట్స్ ని లగడపాటి శ్రీధర్ తీసుకున్నారు. ఆయనకు ఈ చిత్రం బిజినెస్ పరంగా మంచి ఆఫర్స్ వస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కి అన్ని వర్గాల నుంచి ఆదరణ రావటం, యాక్షన్ చిత్రం కావటం, గతంలో సూర్య చిత్రాలు బాగా ఆడటం, దర్శకుడు లింగు స్వామి డైరక్ట్ చేసిన చిత్రాలు పందెం కోడి, ఆవారా వంటివి ఇక్కడ కూడా బాగా కలెక్షన్స్ సంపాదించటంతో ఈ చిత్రానికి బిజినెస్ మంచి ఊపు మీద నడుస్తోంది.
తాజాగా సీడెడ్ ఏరియాకు చెందిన పాపులర్ డిస్ట్రిబ్యూటర్ కె.మధు ఈ చిత్రం రైట్స్ ని ఫ్యాన్సీ రైట్స్ కు తీసుకున్నట్లు తెలుస్తోంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం రెండు కోట్ల డభ్బై ఐదు లక్షలకు ఈ రైట్స్ ని సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఓ డబ్బింగ్ సినిమాకు ఒకే ఏరియా నుంచి ఆ బిజనెస్ రావటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ముఖ్యంగా సమంత ఫ్యాక్టర్ కూడా ఈ బిజినెస్ పై ప్రభావం చూపుతోంది. ఆగస్టు 15న విడుదల కాబోయే ఈ చిత్రానికి మంచి ఓపినింగ్స్ వస్తాయని భావిస్తున్నారు.
సూర్య, సమంత కలిసి నటిస్తున్న సినిమా 'అంజాన్'. తెలుగు - తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతోంది. లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంలో తిరుపతి బ్రదర్స్, యు టీవీవీ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ టీజర్ కోసం తెలుగులోనూ వెయిటింగ్. తెలుగులో సూర్యకి మంచి మార్కెట్ ఉండటం, అలాగే ఎన్టీఆర్ రభసకు పోటీగా ఈ చిత్రం వేస్తూండటంతో టాలీవుడ్ మొత్తం ఈ చిత్రం టీజర్ కోసం ఎదురుచూస్తోంది. లింగు స్వామి ఈ చిత్రాన్ని ఓ రేంజిలో తీసాడని తమిళంలో టాక్ నడుస్తోంది. దానికి తగ్గట్లే తెలుగు నిర్మాత లగడపాటి శ్రీధర్ భారీ మొత్తం ఇచ్చి మంచి పోటీలో ఈ చిత్రం డబ్బింగ్ రైట్స్ సొంతం చేసుకోవటం వార్తల్లో నిలిచింది.
మరోప్రక్క ఇన్నాళ్లూ ఫ్యామిలీ లుక్ లో కాస్త ఒద్దికగా సమంతను చూసిన వారు ఆమె తాజా చిత్రం లో ఆమె లుక్ ని షాక్ అవుతున్నారు. లింగుస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న అంజాన్ చిత్రం స్టిల్స్ ఇప్పుడు తెలుగు,తమిళ భాషల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.
"నేను
ఇంత
వరకు
పనిచేసిన
వ్యక్తుల్లో
ది
బెస్ట్
టీమ్
'అంజాన్'
టీమ్.
చాలా
నైస్
టీమ్.
కావాలంటే
ఈ
విషయంలో
ఎవరితోనైనా
బెట్
కట్టడానికి
సిద్ధంగా
ఉన్నాను.
నేను
చాలా
కంఫర్టబుల్‌గా
పనిచేయడానికి
కావాల్సిన
అన్ని
సదుపాయాలను
సమకూర్చారు''
అని
అంటున్నారు
సమంత.
సూర్యతో
కలిసి
ఆమె
నటిస్తున్న
సినిమా
'అంజాన్'.
శుక్రవారంతో
షూటింగ్
పూర్తయిందని
సమంత
ట్విట్టర్
ద్వారా
తెలిపారు.
లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఇది. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 15న ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తిరుపతి బ్రదర్స్, యూటీవీ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది.
రెండు భిన్నమైన పాత్రల్లో సూర్య కనిపించనున్నట్లు సమాచారం.ఒక పాత్రలో సూర్య గడ్డంతో కనిపించనున్నట్లు చిత్రవర్గాలు చెబుతున్నాయి. ప్రపంచంలోనే తొలిసారిగా ఈ సినిమా కోసం రెడ్ డ్రాగన్ కెమెరాను వినియోగిస్తున్నామని కెమెరామెన్ సంతోష్‌శివన్ తెలిపారు. విద్యుత్ జమ్వాల్, మనోజ్‌బాజ్‌పాయ్, వివేక్, బ్రహ్మానందం, సూరి తదితరులు నటిస్తున్నారు. యూటీవీ మోషన్ పిక్చర్స్, తిరుపతి బ్రదర్స్ సంయుక్తంగా దీనిని నిర్మిస్తున్నాయి. యువన్ శంకర్‌రాజా సంగీతం సమకూర్చుతున్నారు.