Siknadar 4 days Collections: సల్మాన్ సరికొత్త బాక్సాఫీస్ రికార్డు.. డిజాస్టర్ టాక్‌లోను కోట్ల కలెక్షన్లు!

సౌత్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న, స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటించిన చిత్రం సికందర్. ఈ చిత్రంలో శర్మాన్ జోషి, సత్యరాజ్, సంజయ్ కపూర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. రంజాన్ పండుగ కానుకగా ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ చిత్రాన్ని సాజిద్ నాడియావాలా నిర్మించారు. ఈ సినిమా బడ్జెట్ ఎంత? సల్మాన్ ఖాన్ సాధించిన రికార్డు ఏమిటి? ప్రస్తుతం వసూలు చేస్తున్న కలెక్షన్లు ఎంత అనే వివరాల్లోకి వెళితే..

హిందీ సినిమా పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థలు నాడియావాలా గ్రాండ్‌సన్, సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ బ్యానర్లపై సంయుక్తంగా రూపొందించిన ఈ సినిమాను భారీ సెట్టింగ్స్, హై ప్రొడక్షన్ వాల్యూస్‌లో రూపొందించారు. అంతేకాకుండా ఈ చిత్రానికి హైలీ టాలెంటెడ్ టెక్నిషియన్స్ పనిచేశారు. దాంతో ఈ సినిమా ప్రమోషనల్ ఖర్చులు, చిత్ర యూనిట్ రెమ్యునరేషన్లన్నీ కలుపుకొని ఈ మూవీ బడ్జెట్ 200 కోట్ల రూపాయలు అయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించారు.

Siknadar 4 days Collections

సుమారుగా ఈ సినిమా 100 కోట్ల నికరంగా, 200 కోట్లు గ్రాస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. అయితే సికందర్ రిలీజ్ తర్వాత పూర్తిగా నెగిటివ్ టాక్ దేశవ్యాప్తంగా విస్తరించింది. అయితే ప్రతికూల పరిస్థితుల్లోను సల్మాన్ ఖాన్ బాక్సాఫీస్ స్టామినా ఏంటో చెబుతూ ఈ సినిమా కేవలం మూడు రోజుల్లోనే 100 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించడమే కాకుండా సల్మాన్ కెరీర్‌లో అరుదైన రికార్డును క్రియేట్ చేసింది.

సల్మాన్ ఖాన్ తన కెరీర్‌లో తొలి 100 కోట్ల చిత్రాన్ని దబాంగ్ రూపంలో అందించారు. ఈ సినిమా 140 కోట్లకుపైగానే వసూలు చేసింది. ఆ తర్వాత హిట్లు, ఫ్లాపులు అనే తేడా లేకుండా రెడీ, బాడీ గార్డ్, ఏక్ థా టైగర్, దబాంగ్ 2, జై హో, కిక్ నుంచి దబాంగ్ 3, కిసి కా భాయ్ కిసి కా జాన్, టైగర్ 3 సినిమాలు సుమారుగా 17 చిత్రాలు వంద కోట్ల క్లబ్‌లో చేరడం ఓ రికార్డుగా చెప్పుకొంటున్నారు.

ఇక సికందర్ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ చిత్రం తొలి రోజున 26 కోట్ల రూపాయలు, రెండో రోజున 29 కోట్ల రూపాయలు, మూడో రోజున 20 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మూడు రోజుల్లోనే ఈ సినిమా ఇండియాలో 75 కోట్లు నికర వసూళ్లను రాబట్టింది. ఇక మూడు రోజుల్లో ఓవర్సీస్‌లో సుమారుగా 4 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో 35 కోట్ల మేర వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం 100 కోట్ల క్లబ్‌లో చేరింది.

Siknadar 4 days Collections

సల్మాన్ ఖాన్ కెరీర్‌లో ఎన్నడూ లేని విధంగా సికందర్ సినిమా డిజాస్టర్ టాక్‌తో బాక్సాఫీస్ యాత్రను మొదలుపెట్టింది. ప్రతికూల పరిస్థితులను ఎదురిస్తూ సల్మాన్ 100 కోట్ల మార్కును సునాయసంగా దాటాడు. ఈ సినిమా 4వ రోజు సుమారుగా ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల మేర కలెక్షన్లు సాధించే అవకాశం ఉందని సాక్ నిల్క్‌తోపాటు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమా రానున్న రోజుల్లో నిలదొక్కుకొని బ్రేక్ ఈవెన్ అవుతుందా? అనేది వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X