Siknadar Box Office : సల్మాన్ వసూళ్ల జాతర .. 150 కోట్ల దిశగా సికందర్, ఆ రికార్డుపై కన్ను
దక్షిణాదికి చెందిన అగ్ర దర్శకుడు ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్‌లో బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన చిత్రం సికందర్. రంజాన్ కానుకగా మార్చి 30వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న, కాజల్ అగర్వాల్ కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రంలో శర్మాన్ జోషి, సత్యరాజ్, సంజయ్ కపూర్ తదితరులు నటించారు. సాజిద్ నాడియావాలా నిర్మించిన ఈ సికందర్ చిత్రానికి బడ్జెట్ ఎంత? ఇప్పటి వరకు ఎన్ని కోట్ల కలెక్షన్స్ రాబట్టింది? సల్మాన్ తన పేరిట ఏమేం రికార్డులు నెలకొల్పాడో చూస్తే:
నాడియావాలా గ్రాండ్‌సన్, సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ సంస్ధలు సంయుక్తంగా సికందర్ సినిమాను తెరకెక్కించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రమోషనల్ ఖర్చులు కలుపుకుని సికందర్ మూవీకి రూ.200 కోట్ల బడ్జెట్ అయినట్లుగా హిందీ చిత్ర పరిశ్రమ వర్గాలు తెలిపాయి. 100 కోట్ల నికరంగా, 200 కోట్లు గ్రాస్ లక్ష్యంగా బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టిన సికందర్ మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది.

సినిమా రిలీజైన కాసేపటికీ నెగిటివ్ టాక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. భారీ చిత్రాల పోటీ, ప్రతికూల పరిస్థితుల్లోను సల్మాన్ ఈ సినిమాను తన భుజాలపై మోస్తున్నారు. సికందర్ మూవీకి తొలి రోజున రూ.26 కోట్లు, రెండో రోజున రూ.29 కోట్లు, మూడో రోజున రూ.20 కోట్లు రాబట్టింది. తద్వారా మూడు రోజుల్లోనే భారత్‌లో నికరంగా రూ. 75 కోట్లను అందుకుంది. అటు ఓవర్సీస్‌లో మూడు రోజులకు గాను 4 మిలియన్ డాలర్లు (భారతీయ కరెన్సీలో రూ.35 కోట్లు)ను రాబట్టింది. మొత్తంగా మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టిన సల్మాన్ ఖాన్ తనపై, సికందర్‌పై వస్తున్న విమర్శలకు గట్టి సమాధానం చెప్పారు. డిజాస్టర్ టాక్‌తో ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం మామూలు విషయం కాదని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
ఇక నాలుగో రోజు సికందర్ వసూళ్లను చూస్తే.. ఫస్ట్ షోకు 11.35 శాతం, సెకండ్ షోలకు 16.01 శాతం చొప్పున ఓవరాల్‌గా 12.08 శాతం ఆక్యూపెన్సీ నమోదైంది. అత్యధికంగా ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో 1677, ముంబైలో 1193, అహ్మదాబాద్‌లో 873, సూరత్‌లో 513, పుణేలో 488 షోలు పడ్డాయి. 4వ రోజు ప్రపంచవ్యాప్తంగా సికందర్ సినిమా ఇండియా వైడ్ నికరంగా రూ.10 కోట్ల వసూళ్లు సాధించినట్లు సాక్‌నిక్ తెలిపింది. దీనితో కలిపి భారత్‌లో సికందర్ రూ.84.25 కోట్ల నెట్ రాబట్టింది. ఇండియా వైడ్ రూ.88.75 కోట్ల గ్రాస్ కలెక్షన్స్, ఓవర్సీస్‌లో రూ.35 కోట్లతో కలిపి మొత్తంగా నాలుగు రోజుల వరకు సికందర్ ప్రపంచవ్యాప్తంగా రూ.123.75 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు సాక్‌నిక్ వెల్లడించింది. త్వరలోనే ఈ సినిమా రూ.150 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టనుంది.
ఈ వసూళ్లతో సల్మాన్ ఖాన్ అరుదైన ఘనతకు చేరువయ్యాడు. గతేడాది రంజాన్ సందర్భంగా విడుదలైన అజయ్ దేవగణ్ మైదాన్ రూ.71.52 కోట్లు, అక్షయ్ కుమార్ నటించిన బడా మియా చోటే మియా రూ.111.60లు లాంగ్ రన్‌లో సాధించిన కలెక్షన్‌లకు (రూ.184.6 కోట్లు) సికందర్ దగ్గరైంది. మరో రూ. 60 కోట్లు సాధిస్తే ఈ రెండు చిత్రాల కలెక్షన్స్‌ను సల్మాన్ అధిగమిస్తాడు. ఇక సికందర్ బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో రూ.80 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టాల్సి ఉంది. బాలీవుడ్‌లో పెద్ద సినిమాలేం లేకపోవడం, వేసవి సెలవులు ప్రారంభం కావడంతో సికందర్ బ్రేక్ ఈవెన్‌ను ఎన్ని రోజుల్లో కొడుతుందోనని ఉత్కంఠ నెలకొంది.


Click it and Unblock the Notifications











