200 కోట్ల కలెక్షన్లపై కన్నేసిన సికందర్.. డిజాస్టర్ టాక్‌తో సల్మాన్ మూవీకి 5వ రోజు ఎన్ని కోట్లంటే?
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన సికందర్ సినిమా డిజాస్టర్ టాక్‌తో కూడా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తున్నది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న, స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటించిన ఈ సినిమాకు మురగదాస్ దర్శకత్వం వహించారు. సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్, సాజిద్ నడియావాలా గ్రాండ్ సన్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను పాపులర్ ప్రొడ్యూసర్ సాజిద్ నాడియావాలా నిర్మించారు. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఈ సినిమా గత 5 రోజులుగా సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
సికందర్ బడ్జెట్ ఎంత (Sikandar Budget)?
యాక్షన్, హ్యుమన్ ఎమోషన్స్‌తో రూపొందించిన సికందర్ సినిమాలో స్టార్ యాక్టర్లు, టాప్ టెక్నిషియన్స్ వర్క్ చేశారు. అలాగే సల్మాన్ ఖాన్‌కు ఉన్న భద్రతా ఏర్పాట్ల దృష్ట్యా ఈ సినిమాను భారీ సెట్స్ వేసి, విదేశాల్లో కూడా చిత్రీకరించారు. దాంతో ఈ సినిమాకు భారీగానే బడ్జెట్ అయింది. ఈ సినిమాను సుమారుగా 200 కోట్ల రూపాయలతో గ్రాండ్‌గా తెరకెక్కించారు.

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత (Sikandar Break Even Target)?
అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్‌కు భారీ రేటు పలికింది. దాంతో ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ బాక్సాఫీస్ వద్ద సులభమైంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పాయింట్ సుమారుగా 100 కోట్ల రూపాయలు, 200 కోట్ల రూపాయలు గ్రాస్ వసూళ్లను కలెక్ట్ చేయాల్సిన పరిస్థితుల్లో ఈ సినిమా రిలీజైంది.
గత 4 రోజుల కలెక్షన్లు (Salman's Movie 4 days Collections)
సికందర్ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 26 కోట్ల రూపాయల నెట్, రెండో రోజు 29 కోట్ల రూపాయల నెట్, 3వ రోజు 20 కోట్ల నెట్, నాలుగవ రోజు 10 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా గత 4 రోజుల్లో 85 కోట్ల రూపాయల నెట్, 100 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిందని సాక్ నిల్క్ వెబ్ సైట్ వెల్లడించింది. దాంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌కు చేరువైందనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఓవర్సీస్‌లో కలెక్షన్లు (Overseas Collections)
ఇక సికందర్ సినిమాకు ఓవర్సీస్‌లో కూాడ భారీగానే స్పందన కనిపించింది. తొలి ఆట నుంచే డిజాస్టర్ టాక్ సొంతం చేసుకొన్నప్పటికీ.. ఈ సినిమా కలెక్షన్ల పరంగా ఎలాంటి నిరాశను కలిగించలేదు. దాంతో ఈ సినిమా ఓవర్సీస్‌లో సుమారుగా 40 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 140 కోట్ల రూపాయలను ఆర్జించిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
5వ రోజు కలెక్షన్ల అంచనా ఎంతంటే (Sikandar Day 5 Collections)?
ఇక 5వ రోజు గురువారం నాడు వర్కిండే అయినప్పటికీ ఈ సినిమా కలెక్షన్ల పరంగా నిలకడగా కలెక్షన్లను సాధించిందని సాక్ నిల్క్ వెల్లడించింది. ఈ సినిమా ఇండియాలో కనిష్టంగా 6 కోట్లు, గరిష్టంగా 8 కోట్ల మేరకు వసూళ్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మేర వసూల్లను రాబట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











