Pathu Thala Collections శింబు కెరీర్‌లో హయ్యెస్ట్.. ఫస్ట్ డే కలెక్షన్లు ఎన్ని కోట్లంటే?
తమిళ స్టార్ హీరో శింబు, గౌతమ్ కార్తీక్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రియా భవానీ శంకర్, అను సితార నటించిన చిత్రం పత్తు తలా (Pathu Thala). కథను నార్థన్ అందించగా ఒబెలీ ఎన్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మార్చి 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం తొలి రోజున మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకొన్నది. ఈ సినిమా తొలి రోజు కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే?

భారీ తారాగణం, బడ్జెట్‌తో
పత్తు తల చిత్రం భారీ తారాగణంతోపాటు బడ్జెట్‌తో రూపొందింది. ఈ సినిమాను సుమారు 35 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ప్రమోషన్ కార్యక్రమాలను జోరుగా చేశారు. విడుదలకు ముందే మంచి క్రేజ్ సంపాదించుకొన్నది. ధనుష్ సార్, విజయ్ వారిసు తర్వాత భారీగా ఈ సినిమాను రిలీజ్ చేశారు.

పత్తు తలా స్క్రీన్ కౌంట్
ఇక తమిళ ప్రేక్షకుల డిమాండ్ మేరకు పత్తు తలా సినిమాను భారీగా థియేటర్లలో రిలీజ్ చేశారు. ఈ సినిమాను తమిళనాడులో 500 స్క్రీన్లలో రిలీజ్ చేయగా, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను 800 స్క్రీన్లలో ప్రదర్శిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను రిలీజ్ చేయకపోవడం గమనార్హం.

పత్తు తలా స్క్రీన్ కౌంట్
శింబు నటించిన పత్తు తలా సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగింది. తమిళంలో 18 కోట్లు, ఓవర్సీస్‌లో మరో 2 కోట్లకు బిజినెస్ జరిగినట్టు సమాచారం. దాంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కనీసం 20 కోట్ల షేర్, 40 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సిన అవసరం ఉంది. దాంతో ఈ సినిమాకు భారీ లక్ష్యమే బాక్సాఫీస్ వద్ద కనిపించింది.

శింబు మూవీ ఫస్ట్ డే కలెక్షన్ల అంచనా
పత్తు తలా చిత్రానికి, శింబు ఫ్యాన్స్ నుంచి భారీ క్రేజ్ కనిపించడంతో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ రూపంలో 2.6 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. తమిళనాడులో తొలి రోజున 6 నుంచి 7 కోట్ల వసూళ్లు రాబట్టే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు 9 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

విజయ్, అజిత్, ధనుష్‌తో పోటీపడుతూ..
ఇటీవల తమిళంలో రిలీజైన స్టార్ హీరోల కలెక్షన్లను పరిశీలిస్తే శింబు చిత్రం తొలి రోజు అత్యధిక వసూళ్లను సాధించిన నాలుగో చిత్రంగా ఘనతను సాధించే అవకాశం ఉంది. వారిసు చిత్రం తొలి రోజున 47.5 కోట్లు రాబడితే.. తునివు 41 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. వాతి (సార్) చిత్రం తమిళంలో 15 కోట్ల వరకు వసూలు చేసింది. శింబు నటించిన పత్తు తలా చితరం 9 కోట్ల వరకు బాక్సాఫీస్ వద్ద నమోదు చేయవచ్చని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











