Pathu Thala Collections శింబు బాక్సాఫీస్ ధమాకా.. పత్తు తలై 4 రోజులకు ఎన్ని కోట్లంటే?
తమిళ స్టార్ హీరో శింబు, గౌతమ్ కార్తీక్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రియా భవానీ శంకర్, అను సితార నటించిన పత్తు తలా చిత్రం మంచి రెస్సాన్స్‌ను సొంతం చేసుకొన్నది. ఒబెలీ ఎన్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని జయంతి లాల్ గదా, జానవేల్ రాజా నిర్మించారు. నార్తన్ రచించిన ముఫ్తీ ఆధారంగా రూపొందిన ఈ సినిమా తొలి ఆట నుంచి బ్రహ్మండమైన ఆదరణను చూరగొంటున్నది. అయితే మార్చి 30న రిలీజైన ఈ చిత్రం గత 4 రోజల్లో ఏ రేంజ్ కలెక్షన్లు సాధించిందంటే?

హ్యాట్రిక్ హిట్స్‌తో శింబు
పత్తు తలా చిత్రానికి సగటు ప్రేక్షకుడి నుంచి, సినీ విమర్శకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చినా నిదానంగా బాక్సాఫీస్ యాత్రను ప్రారంభించింది. ఆడియెన్స్ మౌత్ టాక్‌తో ఈ చిత్రం క్రమక్రమంగా పుంజుకొంటున్నది. దాంతో మనాడు, వెండు తానిందాతు కాడు లాంటి వరుస హిట్ల తర్వాత శింబు పత్తు తలాతో హ్యాట్రిక్ నమోదు చేసుకొన్నాడు.

పత్తు తలా బడ్జెట్, స్క్రీన్ కౌంట్
పత్తు తలా చిత్రం భారీ బడ్జెట్‌తో స్టూడియో గ్రీన్, పెన్ స్టూడియోస్ తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని సుమారు 40 కోట్లతో రూపొందించారు. తమిళనాడులో దాదాపు 500 కుపైగా స్రీన్లతో రూపొందించారు. ప్రపంచవ్యాప్తంగా 800 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. శింబు కెరీర్‌లో భారీగా రిలీజైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

శింబు మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్
పత్తు తలా చిత్రం విడుదలకు ముందు భారీ బిజినెస్ చేసింది. ఈ సినిమా తమిళ రైట్స్ 20 కోట్లకు అమ్ముడుపోయాయి. ఓవర్సీస్ రైట్స్ 4 కోట్లమేర జరిగినట్టు సమాచారం. దాంతో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలంటే కనీసం 25 కోట్ల మేర షేర్, 40 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను సాధించాల్సిన అవసరం ఉంది.

ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు
తమిళనాడులో తొలి రోజు పత్తు తలా చిత్రం 8.25 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 12 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక రెండో రోజు 4.5 కోట్ల గ్రాస్, ప్రపంచవ్యాప్తంగా 6 కోట్ల గ్రాస్, అలాగే మూడో రోజు 5.75 కోట్ల గ్రాస్, వరల్డ్ వైడ్‌గా 6.75 కోట్ల గ్రాస్ సాధించింది. ఇక ఆదివారం ఈ చిత్రం తమిళంలో 6.5 కోట్ల గ్రాస్, 8 కోట్ల గ్రాస్ వరల్డ్ వైడ్‌గా నమోదు చేసింది.

పత్తు తలా లాభాల్లోకి రావాలంటే?
పత్తు తలా చిత్రం శింబు కెరీర్‌లో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా గత నాలుగు రోజుల్లో రికార్డు వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం సుమారు ప్రపంచవ్యాప్తంగా 37 కోట్ల గ్రాస్, ఇండియాలో దాదాపు 28 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. తొలివారంలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించి.. లాభాల్లోకి వచ్చే పరిస్థితి కనిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











