Simhadri 4K Collections మెగా, ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాక్సాఫీస్ వార్..సింహాద్రి కలెక్షన్లు ఫేకా? మూడు రోజుల్లో
తెలుగు సినిమా పరిశ్రమలో అగ్ర హీరోల సినిమాల రీ రిలీజ్ హంగామా కొనసాగుతున్నది. ఇప్పటికే మహేష్ బాబు, పవన్ కల్యాణ్, రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన చిత్రాలు రి రిలీజ్ అవ్వడమే కాకుండా భారీ కలెక్షన్లను సాధించాయి. అయితే జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా రిలీజైన సింహాద్రి సినిమా కూడా భారీ వసూళ్లను సాధించింది. రాజమౌళి, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం నిలకడగా వసూళ్లను సాధిస్తున్నది. ఈ సినిమా 3వ రోజు కలెక్షన్లు వివరాల్లోకి వెళితే..
8 కోట్ల బడ్జెట్‌తో :దర్శక ధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన సింహాద్రి చిత్రం జూలై 9వ తేదీ 2003 సంవత్సరంలో రిలీజైంది. సుమారు 8 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం అప్పట్లో 26 కోట్ల రూపాయలను వసూలు చేసింది. అలాంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని నేటి టెక్నాలజీకి అనుకూలంగా మార్చి 4K సాంకేతికతతో రిలీజ్ చేశారు.

తొలి రోజు వసూళ్లు:సింహాద్రి చిత్రం తొలి రోజు నైజాంలో 1.95 కోట్లు వసూలు చేసింది. సీడెడ్‌లో ఈ చిత్రం 1.25 కోట్లు, ఆంధ్రాలో 1.75 కోట్లు రాబట్టింది. దాంతో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 4.95 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇక కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 40 లక్షలు, ఓవర్సీస్‌లో 67 లక్షలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం తొలి రోజు 6 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది.
సింహాద్రి 4K రెండో రోజు కలెక్షన్లు :సింహాద్రి 4K చిత్రం రెండో రోజు కూడా మోస్తారు వసూళ్లను సాధించింది. రెండో రోజు నైజాంలో 23 లక్షలు, 70 లక్షలు, ఆంధ్రాలో 28 లక్షలు రాబట్టింది. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 7 లక్షలు, ఓవర్సీస్‌లో 14 లక్షలు రాబట్టింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో రెండు రోజుల్లో 7.5 కోట్లు వసూలు చేసింది.

మూడో రోజు కలెక్షన్లు:సింహాద్రి 4K చిత్రం మూడో రోజు నైజాంలో 6 లక్షలు రూపాయలు, సీడెడ్‌లో 52 లక్షలు, ఆంధ్రాలో 17 లక్షల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 75 లక్షల రూపాయల వసూళ్లను రాబట్టింది. ఇక కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 6 లక్షల రూపాయలు, ఓవర్సీస్‌లో 7 లక్షల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం మూడో రోజు 88 లక్షలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 8.4 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది.

సింహాద్రి 4K ఓవర్సీస్‌లో :సింహాద్రి ఓవర్సీస్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. అమెరికాలో 53 వేల డాలర్లు, కెనడాలో 5 వేల డాలర్లు, ఆస్ట్రేలియాలో 12 వేల డాలర్లు, యూకేలో 10 వేల డాలర్లు, దుబాయ్‌లో 7 లక్షలు, జపాన్‌లో 9 లక్షల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ఓవరాల్‌గా 88 కోట్ల మేర కలెక్షన్లు సాధించింది.

మెగా, ఎన్టీఆర్ ఫ్యాన్స్ వార్:అయితే సింహాద్రి సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. మెగా, నందమూరి ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో భారీ ఫైట్ జరుగుతున్నది. ఇప్పటి వరకు సింహాద్రి చిత్రం ఖుషీ సినిమా కలెక్షన్లను దాటలేకపోయింది అంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్లు పెడితే.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఘాటుగా స్పందిస్తున్నారు. అయితే ఈ కలెక్షన్ల విషయంలో ఏది కరెక్ట్ అనేది ప్రశ్నార్థకంగా మారింది.


Click it and Unblock the Notifications











