Top Re-Release Openings: సింహాద్రి 4K గ్రాండ్ రీ రిలీజ్.. ఖుషి రికార్డును బ్రేక్ చేయగలదా?
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో చాలాకాలంగా రీ రిలీజ్ ట్రెండ్ అనేది ఒక సెన్సేషన్ అవుతున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోలకు సంబంధించిన పాత సినిమాలకు వస్తున్న రెస్పాన్స్ అయితే మామూలుగా ఉండడం లేదు. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ఊహించని స్థాయిలో వస్తున్నాయి. వెండితెరపై ఇప్పుడు మరోసారి సింహాద్రి సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ సందడి చేయడానికి సిద్ధమయ్యాడు. అయితే ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండులో అయితే టాప్ లిస్టులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా కొనసాగుతోంది. ఈ సినిమా రికార్డును ఈసారి సింహాద్రి సినిమా బ్రేక్ చేస్తుందా లేదా అనేది ఆసక్తిగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ : రిలీజ్ ట్రెండ్ అనేది టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ స్థాయిలో వైరల్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక సింహాద్రి సినిమా కూడా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాను 4కే వెర్షన్ లో విడుదల చేస్తు ఉండడంతో ఫ్యాన్స్ లో అయితే అంచనాలు పెరిగిపోయాయి. ఇటీవల గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. ఆ వేడుకలో యువ హీరో విశ్వక్సేన్ కూడా పాల్గొనడంతో మంచి బజ్ అయితే క్రియేట్ అయింది.

ఇతర దేశాలలో కూడా : ఈనెల 19వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కంటే ఒక రోజు ముందే సింహాద్రి సినిమా ప్రపంచ వ్యాప్తంగా వెయ్యికి పైగా ధియేటర్లలో విడుదల కాబోతూ ఉండడం విశేషం. అమెరికాలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా ఈ సినిమాను గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో కూడా మంచి ఓపెనింగ్స్ నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే సింహాద్రి సినిమా మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తోంది.

మొదటి రోజు రికార్డ్ : అయితే సింహాద్రి సినిమాకు ఇప్పుడు ఈ రీ రిలీస్ ట్రెండ్ లో అయితే కొన్ని రికార్డులను బ్రేక్ చేస్తుందా లేదా అనేది ఆసక్తిగా మారింది. పవన్ కళ్యాణ్ హిట్ సినిమా ఖుషి అయితే రీ రిలీజ్ ట్రెండ్ లో మొదటి స్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మొదటి రోజు ఖుషి సినిమా 3.62 కోట్ల ను కలెక్ట్ చేసింది. ఇక ఆ తర్వాత మళ్లీ పవన్ కళ్యాణ్ జల్సా సినిమా 2.57 కోట్లతో రెండవ స్థానంలో ఉంది.

అల్లు అర్జున్ కూడా : అయితే ఈ రెండు సినిమాల తర్వాత మూడవ స్థానంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక్కడు సినిమా 1.90 కోట్లతో కొనసాగుతోంది. ఇక అత్యధిక స్థాయిలో ఒపెనింగ్స్ అందుకున్న సినిమాలలో అల్లు అర్జున్ కూడా తన దేశముదురు సినిమాతో 1.54 కోట్లు అందుకున్నాడు. ఇక పోకిరి సినిమా 1.52 కోట్లు, ఆరెంజ్ సినిమా 1.46 కోట్లతో ఈ రికార్డులో కొనసాగుతున్నాయి.

సింహాద్రి ఆ రికార్డ్ బ్రేక్ చేయగలదా : ఇక ఇప్పుడు సింహాద్రి సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ స్థాయిలోనే విడుదలవుతోంది. దాదాపు 1000కి పైగా థియేటర్లలో విడుదలవుతోంది. అంటే తప్పకుండా కలెక్షన్స్ అయితే మొదటి రోజే ఉహించని ఉంటాయి అని అనిపిస్తుంది. ఇక మొదటి రోజు ఖుషి 3.62 కోట్ల రికార్డును ఈ సినిమా బ్రేక్ చేస్తుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇక మొత్తంగా అయితే టోటల్ కలెక్షన్స్ లో ఖుషి సినిమా ఏడు కోట్లకు పైగానే కలెక్షన్స్ అందుకుంది. మరి ఆ స్థాయిలో సింహాద్రి అత్యధిక కలెక్షన్స్ అందుకుంటుందో లేదో చూడాలి.



Click it and Unblock the Notifications











