Simhadri Day 1 Collections: సింహాద్రికి సంచలన వసూళ్లు.. ఫస్ట్ డేనే అన్ని కోట్లు.. పవన్ రికార్డు సేఫ్

టాలీవుడ్‌లో ఎప్పటికప్పుడు సరికొత్త ట్రెండ్‌లు పుట్టుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇటీవలి కాలంలో పాత సినిమాల రీరిలీజ్‌లు ఎక్కువగా జరుగుతున్నాయి. గతంలో వచ్చి సూపర్ హిట్ అయిన చిత్రాలనో, అప్పుడు ప్రేక్షకులు ఆదరించని క్లాసిక్ మూవీలనో ఇప్పుడు మళ్లీ తీసుకు వస్తున్నారు. ఇలా ఇప్పటికే ఎన్నో సినిమాలు రాగా.. వాటికి విశేషమైన స్పందన వచ్చింది. దీంతో ఆయా చిత్రాలకు మంచి కలెక్షన్లు కూడా దక్కాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'సింహాద్రి' సినిమాను కూడా రీ రిలీజ్ చేశారు. మరి ఈ మూవీ కలెక్షన్లను చూద్దామా!

ఎన్టీఆర్ బర్త్‌డే సింహాద్రి: టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందించిన చిత్రమే 'సింహాద్రి'. అప్పట్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ఈ సినిమా అదిరిపోయే స్పందనతో ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. ఈ భారీ చిత్రాన్ని తారక్ పుట్టినరోజు సందర్భంగా మే 20వ తేదీన రీ రిలీజ్ చేశారు. దీన్ని ఏకంగా 1200 థియేటర్లలో విడదలు చేశారు.

Simhadri Re-Release

అంతటా భారీ రెస్పాన్స్: ఇప్పటికే ఎన్నో సినిమాలు రీరిలీజ్ అయ్యాయి. కానీ, 'సింహాద్రి' రేంజ్‌లో దేనికీ హడావిడి కనిపించలేదని చెప్పొచ్చు. అందుకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు రెస్పాన్స్ భారీ స్థాయిలో వచ్చింది. దీంతో ఈ సినిమాకు అనుకున్న దానికంటే ఓపెనింగ్ డేన అత్యధిక కలెక్షన్లు వస్తాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అందుకు తగ్గట్లే వసూళ్లు భారీగా దక్కాయి.

ఫస్ట్‌ డే తెలుగు వసూళ్లు: 'సింహాద్రి' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో ఫస్ట్ డే భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 1.06 కోట్లు, సీడెడ్‌లో రూ. 76 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 27 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 16 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 14 లక్షలు, గుంటూరులో రూ. 19 లక్షలు, కృష్ణాలో రూ. 20 లక్షలు, నెల్లూరులో రూ. 12 లక్షలు రాబట్టింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 2.90 కోట్లు గ్రాస్ వచ్చింది.

Simhadri Re-Release

ప్రపంచ వ్యాప్తంగా ఎంత: 'సింహాద్రి' చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే స్పందన లభించింది. దీంతో మొదటి రోజు కర్నాటకలో రూ. 20 లక్షలు, తమిళనాడులో రూ. 10 లక్షలు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 12 లక్షలు, యూఎస్‌లో రూ. 46 లక్షలు, జపాన్‌లో రూ. 8 లక్షలు, మిగిలిన దేశాల్లో రూ. 15 లక్షలు గ్రాస్ వసూలు అయింది. ఇలా వరల్డ్ వైడ్‌గా మొదటి రోజే దీనికి రూ. 4.01 కోట్లు గ్రాస్ దక్కింది.

పవన్ రికార్డు చేరలేదు: రీరిలీజ్‌ల ట్రెండ్ మొదలైన తర్వాత కొన్ని చిత్రాలు టాప్ కలెక్షన్లతో సత్తా చాటింది. మరీ ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'ఖుషి' సినిమా మొదటి రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 3.62 కోట్లు వసూలు చేసింది. అలాగే, వరల్డ్ వైడ్‌గా రూ. 4.15 కోట్లు రాబట్టింది. ఇప్పుడు ఈ రికార్డును 'సింహాద్రి' మూవీ చేరలేదని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

నైజాంలో 2.. సీడెడ్ 1: తెలుగు రాష్ట్రాల్లో నైజాం ఏరియా ప్రభావం సినిమాల కలెక్షన్లపై తీవ్ర స్థాయిలో చూపిస్తూ ఉంటుంది. అక్కడ 'సింహాద్రి' మూవీ రూ. 1.06 కోట్లు రాబట్టింది. దీంతో ఖుషి రూ. 1.65 కోట్లు, జల్సా రూ. 1.26 కోట్లు తర్వాత స్థానంలో నిలిచింది. ఇక, సీడెడ్ ఏరియాలో మాత్రం 'సింహాద్రి' టాప్ పొజిషన్‌కు చేరుకుంది. అక్కడ ఏకంగా రూ. 76 లక్షలు రాబట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది.

Simhadri Re-Release

ఫ్యాన్స్ లెక్కలు వేరే : టాలీవుడ్‌లోని మెజారిటీ ట్రేడ్ వర్గాలు చెప్పిన లెక్కలు ఇలా ఉంటే.. నందమూరి అభిమానులు మాత్రం 'సింహాద్రి' సినిమా ఏకంగా రూ. 6 కోట్లు పైగానే గ్రాస్‌ను వసూలు చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు, చాలా ఏరియాల్లో ఈ చిత్రం టాప్ ప్లేస్‌కు చేరుకుందని కూడా వెల్లడించారు. దీంతో ఈ లెక్కలు అర్థం కాక చాలా మంది తికమక పడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X