Simhadri4K Closing collections బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన సింహాద్రి4K..NTR మూవీకి ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?

తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం పాత హిట్, బ్లాక్ బస్టర్, కల్ట్ క్లాసిక్ సినిమాల రీ రిలీజ్ హవా కొనసాగుతున్నది. పోకిరి, ఖుషీ, ఆరెంజ్ సినిమాలు కలెక్షన్లు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. స్టార్ హీరోల హిట్ సినిమాలను ప్రేక్షకుల ఆదరించడంతో రి రిలీజ్‌లకు మంచి క్రేజ్ పెరిగింది. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం సందర్బంగా రిలీజైన సింహాద్రి చిత్రం భారీ వసూళ్లను సాధించింది. అయితే ఈ చిత్రం ఏ రేంజ్ కలెక్షన్లను సాధించిందనే వివరాల్లోకి వెళితే..

తెలుగులో స్టార్ హీరోల బ్లాక్ బస్టర్ సినిమాలను ప్రస్తుత టెక్నాలజీకి అనుగుణంగా మార్పులు చేసి ఈ తరం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచే ప్రయత్నం చేస్తున్నారు. అప్పట్లో భారీ వసూళ్లను సాధించిన సింహాద్రి చిత్రాన్ని 4K టెక్నాలజీలో రూపొందించి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ కూడా నమోదయ్యాయి.

Simhadri4K Closing collections worldwide: Jr NTRs movie gets great response at box office

సింహాద్రి సినిమాను అమెరికా, యూకేలో భారీగా ప్రదర్శించారు. అమెరికాలో 89 లోకేషన్లలో ప్రదర్శించగా, యూకేలో 45 లోకేషన్లలో ప్రీమియర్స్ వేశారు. ఓవర్సీస్‌లో జూనియర్ ఎన్టీఆర్ మూవీకి మంచి కలెక్షన్లు నమోదు అయ్యాయి. అమెరికా, యూకేలో కలిపి ఈ చిత్రం సుమారు 1.08 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో సింహాద్రి సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. నైజాంలో 2.69 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 3.23 కోట్ల రూపాయలు, ఆంధ్రాలో 2.99 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఏపీ, తెలంగాణలో కలిపి ఈ చిత్రం సుమారు 9 కోట్ల రూపాయలను వసూలు చేసింది. తొలి రోజు రికార్డు స్థాయిలో 5 కోట్లకుపైగా కలెక్షన్లను సాధించిన విషయం తెలిసిందే.

ఇక తెలుగేతర రాష్ట్రాల్లో కూడా సింహాద్రి4k మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. కర్ణాటకలో బాక్సాఫీస్ వద్ద మంచి స్పందన వ్యక్తమైంది. కర్ణాటకలో ఈ చిత్రం 50 లక్షల రూపాయలు వసూలు చేసింది. తమిళనాడు, ఇతర రాష్ట్రాల్లో 20 లక్షలకుపైగా వసూళ్లను సాధించింది. ఇతర రాష్ట్రాల్లో ఎన్టీఆర్ స్టామినా ఏంటో ఈ చిత్రం తెలియచెప్పింది.

ప్రపంచవ్యాప్తంగా సింహాద్రి4K చిత్రం కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. నైజాం, ఆంధ్రాలో సుమారు 9 కోట్ల రూపాయలు. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 70 లక్షలు, ఓవర్సీస్‌లో 1.10 కోట్ల వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 11 కోట్ల రూపాయల వరకు కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల కాలంలో అత్యధిక వసూళ్లు సాధించిన రీరిలీజ్‌లో ఒకటిగా నిలిచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X