6 డేస్ కలెక్షన్: ‘టెంపర్’ రీమేక్ ‘సింబా’ బాక్సాఫీసును షేక్ చేస్తోంది!
Recommended Video

కథలో దమ్ముంటే, కంటెంటులో పవర్ ఉంటే టాలీవుడ్లో అయినా, బాలీవుడ్లో అయినా ప్రేక్షకాదరణ తప్పకుండా ఉంటుందని మరోసారి రుజువైంది. తెలుగు హిట్ మూవీ 'టెంపర్' బాలీవుడ్ రీమేక్ 'సింబా' బాక్సాఫీసు వద్ద సూపర్ వసూళ్లు సాధిస్తోంది.
రణవీర్ సింగ్ హీరోగా రూపొందిన సింబా తొలి 5 రోజుల్లోనే రూ. 124 కోట్లు వసూలు చేసింది. క్రిస్మస్, న్యూ ఇయర్ హాలిడే సీజన్ ముగిసిన తర్వాత 6వ రోజు కూడా మంచి వసూళ్లు రాట్టింది. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రం తొలి రోజు రూ. 20.72 కోట్లు రాబట్టి రణవీర్ సింగ్ కెరీర్లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్ గ్రాసర్‌గా నిలిచింది.

మౌత్ టాక్ అదిరిపోవడంతో వసూళ్లు పెరిగాయి
ఈ చిత్రానికి పాజిటివ్ మౌత్ టాక్ రావడంతో రెండో రోజు నుంచి వసూళ్లూ ఊపందుకున్నాయి. శనివారం రూ. 23.33 కోట్లు, ఆదివారం రూ. 31.06 కోట్లు రాబట్టింది. వసూళ్లు రోజు రోజుకు పెరుగుతుండటంతో చిత్ర బృందంలో మరింత ఉత్సాహం నెలకొంది.

న్యూఇయర్ వేళ కూడా...
డిసెంబర్ 31 సోమవారం సైతం వసూళ్ల జోరు తగ్గలేదు. సెలవు రోజు కాకపోయినా రూ. 21.24 కోట్లు రాబట్టింది. జనవరి 1 సెలవు కావడంతో వసూళ్లు మరింత పుంజుకున్నాయి. రూ. 28.19 రాబట్టింది. దీంతో తొలి 5 రోజుల వసూళ్లు రూ. 124.54 కోట్లకు చేరుకుంది.

హాలిడే ముగిసిన తర్వాత కూడా
జనవరి 1తో హాలిడే సీజన్ ముగిసింది. దీంతో జనవరి 2న వసూళ్లు కాస్త తగ్గాయి. అయినప్పటికీ డబల్ డిజిట్ రూ. 15 కోట్లు పై చిలుకు వసూళ్లు సాధించడం విశేషం.

రణవీర్ సింగ్ పెళ్లి తర్వాత, అంతా శుభమే
రణవీర్ సింగ్-దీపిక వివాహం తర్వాత విడుదలైన తొలి చిత్రం ఇది. పెళ్లి తర్వాత పెద్ద హిట్ పడటంతో దీపిక అతడి జీవితంలోకి రావడం మరింత కలిసొచ్చిందని చర్చించుకుంటున్నారు. సెకండ్ వీకెండ్ సమయానికి ‘సింబా' రూ. 200 కోట్ల మార్కును అందుకుంటుందని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











