twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టెంపర్ రీమేక్ వసూళ్ల జైత్రయాత్ర.. మరో రికార్డుకు చేరువలో సింబా

    |

    టెంపర్ రీమేక్‌గా రూపొందిన సింబా చిత్రం బాక్సాఫీస్ వద్ద జైత్రయాత్రను కొనసాగిస్తున్నది. రణ్‌వీర్ సింగ్, సారా అలీ ఖాన్ జంటగా నటించిన ఈ చిత్రం భారీ కలెక్షన్ల వైపు దూసుకెళ్తున్నది. రెండో వారాంతం తర్వాత కూడా నిలకడగా కలెక్షన్లు సాధిస్తున్నది. దేశవ్యాప్తంగానే కాకుండా, ఓవర్సీస్‌లో కూడా బ్రహ్మండమైన కలెక్షన్ల రాబడుతున్నది. ఈ చిత్రానికి సంబంధించిన 11వ రోజు కలెక్షన్లు ఇలా ఉన్నాయి.

    రెండోవారంలోకి సింబా

    రెండోవారంలోకి సింబా

    సింబా చిత్రం రెండో వారాంతంలో భారీగా కలెక్షన్లను రాబట్టింది. రెండోవారంలోకి ప్రవేశించిన తర్వాత రూ.39.83 కోట్లు రాబట్టింది. దాంతో ఈ చిత్రం రూ.190.64 కోట్ల వసూలు చేసింది. బాలీవుడ్‌లో భారీ సినిమాలు రిలీజ్‌కు లేకపోవడం వల్ల రానున్న రోజుల్లో ఇంకా భారీ కలెక్షన్లు రాబట్టే అవకాశం లేకపోలేదు.

    11వ రోజున కలెక్షన్లు

    11వ రోజున కలెక్షన్లు

    రెండో వారాంతం తర్వాత 11వ రోజు అంటే సోమవారం రోజున రూ.8 కోట్లు వసూలు చేసింది. మూడోవారం ముగిసే సమయానికి సింబా చిత్రం రూ.200 కోట్ల క్లబ్‌లో చేరడానికి అవకాశం ఉంది. ఓవరాల్‌గా ఈ చిత్రం రూ.250 కోట్ల వద్ద స్థిరపడే అవకాశం ఉంది.

    యూఎస్ కలెక్షన్లు

    యూఎస్ కలెక్షన్లు

    ఇక ఓవర్సీస్‌లో సింబా చిత్రం వసూళ్లను భారీగా రాబడుతున్నది. యూఎస్‌లో శుక్రవారం 683 డాలర్లు, శనివారం 793 డాలర్లు, ఆదివారం 583 డాలర్లు మేర వసూలు చేసింది. మొత్తంగా ఈ చిత్రం యూఎస్‌లో రూ.72.88 కోట్లు వసూలు చేసింది. భారీగా కలెక్షన్లను సాధిస్తూ రూ.100 కోట్ల చేరువైంది.

    ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల తీరు

    ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల తీరు

    సింబా చిత్రం తొలివారం రూ.150.81 కోట్లు, రెండోవారం రూ.39.83 కోట్లు వసూలు చేసింది. ఇప్పటి వరకు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.190.64 కోట్లు రాబట్టింది. సింబా చిత్రం 5వ రోజున 100 కోట్లు, 7వ రోజున రూ.150 కోట్లు, 10వ రోజున రూ.175 కోట్లు వసూలు చేసింది.

    English summary
    Director Rohit Shetty's masala entertainer Simmba (Simba) starring Ranveer Singh has drawn its paws maintaining a strong hold on its second Monday as well. this movie nearly crossing the coveted Rs 200 crore mark at the box office. The exact figures will be calculated and out soon
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X