Don't Miss!
- News కాంగ్రెస్ లో చేరిక పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే బిగ్ ట్విస్ట్..!!
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Sports ఆర్సీబీ తుది జట్టు అంచనా
- Finance Tata Sons IPO: టాటా సన్స్ ఐపీఓ వస్తుందా.. రాదా..!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
టెంపర్ రీమేక్ వసూళ్ల జైత్రయాత్ర.. మరో రికార్డుకు చేరువలో సింబా
టెంపర్ రీమేక్‌గా రూపొందిన సింబా చిత్రం బాక్సాఫీస్ వద్ద జైత్రయాత్రను కొనసాగిస్తున్నది. రణ్వీర్ సింగ్, సారా అలీ ఖాన్ జంటగా నటించిన ఈ చిత్రం భారీ కలెక్షన్ల వైపు దూసుకెళ్తున్నది. రెండో వారాంతం తర్వాత కూడా నిలకడగా కలెక్షన్లు సాధిస్తున్నది. దేశవ్యాప్తంగానే కాకుండా, ఓవర్సీస్లో కూడా బ్రహ్మండమైన కలెక్షన్ల రాబడుతున్నది. ఈ చిత్రానికి సంబంధించిన 11వ రోజు కలెక్షన్లు ఇలా ఉన్నాయి.
రెండోవారంలోకి సింబా
సింబా చిత్రం రెండో వారాంతంలో భారీగా కలెక్షన్లను రాబట్టింది. రెండోవారంలోకి ప్రవేశించిన తర్వాత రూ.39.83 కోట్లు రాబట్టింది. దాంతో ఈ చిత్రం రూ.190.64 కోట్ల వసూలు చేసింది. బాలీవుడ్లో భారీ సినిమాలు రిలీజ్‌కు లేకపోవడం వల్ల రానున్న రోజుల్లో ఇంకా భారీ కలెక్షన్లు రాబట్టే అవకాశం లేకపోలేదు.
11వ రోజున కలెక్షన్లు
రెండో వారాంతం తర్వాత 11వ రోజు అంటే సోమవారం రోజున రూ.8 కోట్లు వసూలు చేసింది. మూడోవారం ముగిసే సమయానికి సింబా చిత్రం రూ.200 కోట్ల క్లబ్లో చేరడానికి అవకాశం ఉంది. ఓవరాల్‌గా ఈ చిత్రం రూ.250 కోట్ల వద్ద స్థిరపడే అవకాశం ఉంది.
యూఎస్ కలెక్షన్లు
ఇక ఓవర్సీస్లో సింబా చిత్రం వసూళ్లను భారీగా రాబడుతున్నది. యూఎస్‌లో శుక్రవారం 683 డాలర్లు, శనివారం 793 డాలర్లు, ఆదివారం 583 డాలర్లు మేర వసూలు చేసింది. మొత్తంగా ఈ చిత్రం యూఎస్‌లో రూ.72.88 కోట్లు వసూలు చేసింది. భారీగా కలెక్షన్లను సాధిస్తూ రూ.100 కోట్ల చేరువైంది.
ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల తీరు
సింబా చిత్రం తొలివారం రూ.150.81 కోట్లు, రెండోవారం రూ.39.83 కోట్లు వసూలు చేసింది. ఇప్పటి వరకు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.190.64 కోట్లు రాబట్టింది. సింబా చిత్రం 5వ రోజున 100 కోట్లు, 7వ రోజున రూ.150 కోట్లు, 10వ రోజున రూ.175 కోట్లు వసూలు చేసింది.