10 రికార్డ్స్ నమోదు: బాక్సాఫీసు వద్ద బిగ్గెస్ట్ హిట్, ఆగని వసూళ్ల ప్రభంజనం...

రణవీర్ సింగ్ హీరోగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన 'సింబా' చిత్రం బాక్సాఫీసు వద్ద సంచలనాలు నమోదు చేస్తోంది. తెలుగు హిట్ 'టెంపర్' రీమేక్‌గా రూపొందిన ఈ మూవీ... చెన్నై ఎక్స్‌ప్రెస్ లైఫ్‌టైమ్ రికార్డులను బద్దలు కొట్టింది. నిన్నటి వరకు రోహిత్ ఖాతాలో బిగ్గెస్ట్ హిట్‌గా ఉన్న 'చెన్నై ఎక్స్‌ప్రెస్'ను వెనక్కి నెట్టి ఆ స్థానాన్ని 'సింబా'(రూ. 227 కోట్లు) దక్కించుకుంది.

ఫిల్మ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ చెప్పిన వివరాల ప్రకారం....'సింబా' మూడో వారంలోకి ఎంటరైన తర్వాత శుక్రవారం రూ. 2..60 కోట్లు, శనివారం రూ. 4.51 కోట్లు, ఆదివారం రూ. 5.30 కోట్లు, సోమవారం రూ. 2.86 కోట్లు రాబట్టింది. దీంతో 'చెన్నై ఎక్స్‌ప్రెస్' లైఫ్ టైమ్ బిజినెస్(ఇండియా) రికార్డ్ బద్దలు కొట్టింది.

ఓవర్సీస్‌లో 12 మిలియన్

ఓవర్సీస్‌లో 12 మిలియన్

ఈ చిత్రం ఓవర్సీస్ మార్కెట్లో కూడా మంచి వసూళ్లు సాధిస్తోంది. ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ మార్కెట్లో $12 మిలియన్ వసూలు చేసింది. మూడో వారాంతం తర్వాత జనవరి 13 నాటికి $12.23(రూ. 86.61 కోట్లు) రీచ్ అయింది. ఆస్ట్రేలియాలో రోహిత్ శెట్టి హయ్యెస్ట్ గ్రాసర్‌గా($ 1,439,876) నిలవడంతో పాటు మంచి వసూళ్లతో ఇంకా రన్ అవుతోంది.

రణవీర్ సింగ్ కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

రణవీర్ సింగ్ కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

తొలి రోజు రూ. 20 కోట్ల వసూలు చేయడం ద్వారా రణవీర్ సింగ్ కెరీర్లోనే ‘సింబా' హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. తొలివారం రూ. 150 కోట్లు వసూలు చేయగా, రెండో వారంలో రూ. 61 కోట్లు రాబట్టింది. విడుదలైన 5 రోజుల్లోనే రూ. 100 కోట్లను, 12 రోజుల్లో రూ. 200 కోట్ల మార్కును అందుకుంది. అంతే కాదు రోహిత్ శెట్టి కెరీర్లో రూ. 100 కోట్ల మార్కును అందుకున్న 8వ చిత్రం ఇది.

‘సింబా' 10 రికార్డులు

‘సింబా' 10 రికార్డులు

పద్మావత్(రూ. 525 కోట్లు) తర్వాత రణవీర్ సింగ్ హయ్యెస్ట్ గ్రాసర్
దేశీయ బాక్సాఫసు వద్ద అత్యధిక కలెక్షన్స్(రూ. 227 కోట్లు) సాధించిన రోహిత్ శెట్టి చిత్రం
సింబాతో రోహిత్ శెట్టి వరుసగా 8 సినిమాలు... 100 కోట్ల వసూళ్లు సాధించారు
రణవీర్ సింగ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ సోలో మూవీ
సారా అలీ ఖాన్ నటించిన మోస్ట్ సక్సెస్‌ఫుల్ మూవీ
2018లో రూ. 100 కోట్ల మార్కును అందుకున్న బాలీవుడ్ 13వ చిత్రం
2018లో పద్మావత్, సంజు తర్వాత రూ. 200 కోట్ల మార్కు అందుకున్న 3వ చిత్రం
రణవీర్ సింగ్ కెరీర్లో హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన మూవీ (రూ. 20.72 కోట్లు)
సారా అలీ ఖాన్ కెరీర్లో హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన మూవీ
బాలీవుడ్ చరిత్రలో హయ్యెస్ట్ గ్రాస్ సాధించిన 10వ చిత్రం

‘టెంపర్' రీమేక్

‘టెంపర్' రీమేక్

తెలుగులో జూ ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందిన ‘టెంపర్' చిత్రాన్ని ఇందీలో ‘సింబా' పేరుతో రీమేక్ చేశారు. అయితే కథలో కొన్ని మార్పులు చేసి ఈ చిత్రాన్ని రూపొందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X