బాలీవుడ్‌లో టెంపర్ రీమేక్ జోరు.. 200 కోట్లపై కన్నేసిన సింబా..
దర్శకుడు పూరి జగన్నాథ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన టెంపర్ చిత్రానికి రీమేక్‌గా వచ్చిన సింబా చిత్రం కలెక్షన్ల జోరు కొనసాగిస్తున్నది. బాలీవుడ్ బాక్సాఫీస్‌ను రణ్‌వీర్ సింగ్ షేక్ చేస్తున్నాడు. డిసెంబర్ 28న రిలీజైన ఈ చిత్రం నాలుగైదు రోజుల్లోనే వంద కోట్లను దాటించింది. సింబా వసూళ్లపరంగా వెనకకు తిరిగిచూసుకొన్న పరిస్థితి కనిపించడం లేదు. గత ఎనిమిది రోజుల కలెక్షన్లు ఇలా ఉన్నాయి.

రెండోవారంలోకి సింబా
సింబా చిత్రం రెండో శుక్రవారం రోజున కొంత వసూళ్లు తట్టినప్పటికీ, కలెక్షన్లు నిలకడగానే ఉన్నాయి. ఈ చిత్రం రెండో శుక్రవారం నాడు దేశవ్యాప్తంగా రూ.9 కోట్ల వసూళ్లను సాధించింది. మరే భారీ చిత్రం రిలీజ్ కనిపించకపోవడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మరిన్ని కలెక్షన్లు సాధించే అవకాశం కనిపిస్తున్నది.

150 కోట్లను దాటేసి
రిలీజ్ తర్వాత నాలుగో రోజునే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన సింబా ఆ వెంటనే 150 కోట్లను దాటేసింది. ఏడు రోజుల్లోనే రూ.150 కోట్లను దాటడం బాక్సాఫీస్ వద్ద సినిమా సత్తాను చాటిచెప్పింది. ఓవర్సీస్‌లో కూడా భారీ కలెక్షన్లు సాధిస్తున్నది.

యూఎస్ మార్కెట్‌లో
యూఎస్ మార్కెట్‌లో కూడా సింబా నిలకడగా వసూళ్లు సాధిస్తున్నది. శుక్రవారం నుంచి గురువారం వరకు ఈ చిత్రం సుమారు రూ.60 కోట్ల వసూళ్లను సాధించింది. గురువారం వరకు 8 లక్షలకుపైగా డాలర్లను ఈ చిత్రం సొంతం చేసుకొన్నది.

200 కోట్లపై కన్ను
రోహిత్ శెట్టి డైరెక్షన్‌లో సారా అలీఖాన్, రణ్‌వీర్ జంటగా నటించిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా 4 వేలకుపైగా స్క్రీన్లలో రిలీజ్ అయింది. బాలీవుడ్‌లో భారీ సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశం లేనందున్న దేశీయంగా ఈ చిత్రం రూ.200 కోట్లు వసూలు చేయవచ్చని అంచనా వేస్తున్నారు.

రూ.250 కోట్ల టార్గెట్
మూడు రోజుల్లోనే రూ.50 కోట్లు, 5 రోజుల్లోనే 100 కోట్లు, 7 రోజుల్లో 150 కోట్లు సింబా చిత్రం వసూలు చేసింది. మార్కెట్‌లో ప్రస్తుతం సింబాదే హవా కొనసాగుతున్నది. రానున్న రోజుల్లో రూ.250 కోట్లు వసూలు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు అని ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్ష్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











