Sing Geetham Day 1 Collections: సింగ్ గీతం కలెక్షన్స్.. సింగీతం శ్రీనివాసరావు మూవీకి బాక్సాఫీస్ రిపోర్ట్ ఏంటీ?
పుష్పక విమానం, అపూర్వ సహోదరులు, ఆదిత్య 369, భైరవ ద్వీపం వంటి టెక్నికల్, ఫాంటసీ మూవీలను దశాబ్ధాల క్రితమే ఆవిష్కరించి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించారు లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు. ఈ తరంలోనూ సన్ ఆఫ్ అల్లాడిన్, ఘటోత్కచ్ వంటి ఎనిమేటేడ్ సినిమాలు.. సరోగసి ఇతివృత్తంతో తీసిన వెల్‌కమ్ ఒబామా వంటి సినిమాలో జెన్ జీ తరాన్ని కూడా ఆకట్టుకున్నారు శ్రీనివాసరావు. తాజాగా ఆయన దర్శకత్వం వహించిన మూవీ సింగ్ గీతం. 94 ఏళ్ల వయసులో శ్రీనివాసరావు డైరెక్షన్ చేసి తెరకెక్కించడం విశేషం. జూన్ 12న సింగ్ గీతం మూవీ వరల్డ్ వైడ్‌గా రిలీజైంది. ఈ నేపథ్యంలో సింగ్ గీతం మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? తొలి రోజు ఈ సినిమా ఎంత వసూలు చేసింది. ఈ వివరాల్లోకి వెళితే..
సింగ్ గీతం తారాగణం
వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా బ్యానర్‌లపై ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాను నిర్మించారు. అహిల్య బమ్రూ, అయాన్, షాలినీ కొండెపూడి, శివ నారాయణ, బెనర్జీ, వామ్కీ తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. అంకుర్ సీ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. సింగీతం శ్రీనివాసరావు ఈ వయసులోనూ పడిన కష్టం, వీల్‌చైర్‌లో కూర్చొని స్వయంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి హాజరుకావడం ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ చేసింది.

సింగ్ గీతం బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి సింగ్ గీతం సినిమాకు దాదాపు 22 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. సినిమా నిర్మాణ విలువల విషయంలో వైజయంతీ మూవీస్ ఎక్కడా రాజీపడలేదు. సింగీతం శ్రీనివాసరావు ఏం కావాలంటే అది సమకూర్చారు.. నిర్మాత నాగ్ అశ్విన్ ఆయన టీమ్ ఎప్పటికప్పుడు షూటింగ్, ఇతర వ్యవహారాలను దగ్గరుండి పర్యవేక్షించారు.
సింగ్ గీతం మూవీపై హైప్
సింగీతం శ్రీనివాసరావుపై ఉన్న క్రేజ్‌కి తోడు నాగ్ అశ్విన్, వైజయంతీ మూవీస్ బ్యానర్‌లకు ఉన్న ఛరిష్మాతో సింగ్ గీతం మూవీపై చిత్ర సీమలోనూ బజ్ నెలకొంది. దాంతో సినిమాలో ఖచ్చితంగా ఏదో ప్రత్యేకత ఉండే ఉంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాలు+ రెస్టాఫ్ ఇండియాలో వైజయంతీ మూవీస్ నేరుగా రిలీజ్ చేస్తోంది. అలాగే తమిళనాడులో థింక్ స్టూడియోస్, నార్త్ అమెరికాలో దమ్‌తిక మీడియా.. ఓవర్సీస్+ యూకేలో డ్రీమ్జ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సింగ్ గీతం సినిమాను రిలీజ్ చేస్తున్నట్లుగా ఫిలింనగర్ వర్గాలు తెలిపాయి.
సింగ్ గీతం తొలిరోజు వసూళ్లు అంచనా
కరుప్పు, దృశ్యం 3, పెద్ది వంటి భారీ చిత్రాలు థియేటర్‌లలో ఉన్నప్పటికీ కంటెంట్‌పై ఉన్న నమ్మకంతో నిర్మాతలు జూన్ 12న సింగ్ గీతం మూవీని రిలీజ్ చేసేందుకు రిస్క్ చేశారనే చెప్పాలి. మార్నింగ్ షో నుంచే సినిమాకు మిక్స్‌డ్ టాక్ వస్తోంది. అయితే వసూళ్లపరంగా చూస్తే సింగ్ గీతం మూవీకి ఇంకా పుంజుకోవాలని విశ్లేషకులు చెబుతున్నారు. తొలిరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు సింగ్ గీతం మూవీని ఇండియాలో 84 కేంద్రాలలో 367 షోలు ప్రదర్శితమై దాదాపు 15.6 శాతం ఆక్యూపెన్సీ నమోదు చేసినట్లుగా ట్రాక్ టాలీవుడ్ నివేదించింది.
తొలిరోజు ఇప్పటి వరకు సింగీతం శ్రీనివాసరావు మూవీకి ఇండియాలో 28 లక్షల రూపాల గ్రాస్ వసూలైనట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఈ ట్రెండ్స్‌ని బట్టి తొలిరోజు సింగ్ గీతం మూవీ వరల్డ్ వైడ్‌గా కోటి రూపాయల నుంచి 1.50 కోట్ల రూపాయల రేంజ్‌లో ఓపెనింగ్స్ రాబట్టవచ్చని భావిస్తున్నారు. శుక్రవారం ఫస్ట్ షో, సెకండ్ షోల నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వీకెండ్, శని, ఆదివారాలు ఉండటంతో సింగ్ గీతం మూవీ ఫస్ట్ వీకెండ్ మెరుగైన ప్రదర్శన చేస్తుందని భావిస్తున్నారు. మరి సింగీతం శ్రీనివాసరావు మూవీకి ప్రేక్షకుల నుంచి ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications



