Sing Geetham Day 2 Collections: సింగ్ గీతం బాక్సాఫీస్ కలెక్షన్స్.. సింగీతం మూవీ రెండో రోజు ఎంతంటే?

లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన మూవీ సింగ్ గీతం. 94 ఏళ్ల వయసులో తనదైన విజన్‌తో ఆయన సినిమాను తెరకెక్కించారు. జూన్ 12న సింగ్ గీతం మూవీ వరల్డ్ వైడ్‌గా రిలీజైంది. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా బ్యానర్‌‌లపై ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాను నిర్మించారు. అహిల్య బమ్రూ, అయాన్, షాలినీ కొండెపూడి, శివ నారాయణ, బెనర్జీ, వామ్కీ తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. అంకుర్ సీ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో సింగ్ గీతం మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? రెండో రోజు ఈ సినిమా ఎంత వసూలు చేసింది. ఈ వివరాల్లోకి వెళితే..

సింగ్ గీతం బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి సింగ్ గీతం సినిమాకు దాదాపు 22 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. టీజర్, ట్రైలర్, ఇతర ప్రమోషనల్ కార్యక్రమాలతో సింగ్ గీతం మూవీపై అంచనాలు నెలకొన్నాయి. ఈ వయసులోనూ సింగీతం శ్రీనివాసరావు వీల్‌చైర్‌పైనే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రావడం విశేషం.

Sing Geetham Day 2 Expected Box Office Collections Worldwide Singeetham Srinivasa Rao s film face struggles

సింగ్ గీతం తొలిరోజు కలెక్షన్స్
సింగ్ గీతం మూవీకి తొలిరోజున ఇండియాలో 54 లక్షల రూపాయల నెట్ రాబట్టినట్లు సాక్‌నిక్ పేర్కొంది. నార్త్ అమెరికాలో తొలిరోజున 17K డాలర్లు (భారత కరెన్సీలో 16 లక్షల రూపాయలు) వసూలు చేసింది. మొత్తంగా తొలిరోజున సింగ్ గీతం మూవీ వరల్డ్ వైడ్‌గా 80 లక్షల రూపాయల నెట్.. కోటి రూపాయల గ్రాస్ వసూలు చేసి ఉండొచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

సింగ్ గీతం రెండోరోజు కలెక్షన్స్ అంచనా
94 ఏళ్ల వయసులో సింగీతం శ్రీనివాసరావు ప్రయత్నాన్ని ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు. అయితే సింగ్ గీతం మూవీకి అనుకున్న స్థాయిలో బుకింగ్స్ జరగడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే థియేటర్‌లలో ఉన్న పెద్ది, కరుప్పులతో పాటు బాలీవుడ్ సినిమాలు గవర్నర్, భారత్ భాగ్య విధాత తదితర సినిమాల నుంచి సింగ్ గీతానికి గట్టి పోటీ ఎదురవుతోంది.

ట్రాక్ టాలీవుడ్ లెక్కల ప్రకారం... రెండో రోజున సింగ్ గీతం మూవీకి 23 శాతం ఆక్యూపెన్సీతో 213 కేంద్రాలలో 396 షోలు ప్రదర్శితమైనట్లు నివేదించింది. ఇప్పటి వరకు 28471 టికెట్లు అమ్ముడై.. ఇండియాలో 48.35 లక్షల రూపాయల గ్రాస్ రాబట్టినట్లు తెలిపింది. శనివారం ఇప్పటి వరకు తెలంగాణలో 24.78 లక్షల రూపాయలు, ఆంధ్రప్రదేశ్‌లో 15.51 లక్షల రూపాయలు, కర్ణాటకలో 6.20 లక్షల రూపాయలు, మహారాష్ట్రలో 53,680 రూపాయలు, హర్యానాలో 22,750 రూపాయలు రాబట్టినట్లుగా తెలిపింది.

ఈ ట్రెండ్స్‌ను బట్టి రెండో రోజు సింగీతం శ్రీనివాసరావు మూవీకి వరల్డ్ వైడ్‌గా కోటి రూపాయలకు పైగా గ్రాస్ వస్తుందని అంచనా వేస్తున్నారు. మరి ఫస్ట్ వీకెండ్‌లో సింగ్ గీతం మూవీ ఎంత మేరకు వసూలు చేస్తుందో చూడాలి. సోమవారం నుంచి స్కూల్స్ తిరిగి ఓపెన్ కానుండటంతో పాటు వర్కింగ్ డేస్ కావడంతో ఈ వీకెండ్‌లోనే సింగ్ గీతం రాబట్టుకోవాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X