Sing Geetham Day 3 Collections: సింగ్ గీతం 3వ రోజు కలెక్షన్స్.. సింగీతం శ్రీనివాసరావు మూవీకి వసూళ్లు ఎంతంటే?

లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు 94 ఏళ్ల వయసులో దర్శకత్వం వహించిన మూవీ సింగ్ గీతం. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా బ్యానర్‌‌లపై ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాను దాదాపు 22 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. అహిల్య బమ్రూ, అయాన్, షాలినీ కొండెపూడి, శివ నారాయణ, బెనర్జీ, వామ్కీ తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. అంకుర్ సీ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. జూన్ 12న సింగ్ గీతం మూవీ వరల్డ్ వైడ్‌గా రిలీజైంది. ఈ నేపథ్యంలో సింగ్ గీతం మూవీ మూడో రోజు ఈ సినిమా ఎంత వసూలు చేసింది. ఈ వివరాల్లోకి వెళితే..

సింగ్ గీతం రెండు రోజుల కలెక్షన్స్
సింగ్ గీతం సినిమాకు ఇండియాలో 54 లక్షల రూపాయలు, రెండో రోజున కోటి రూపాయలు వసూలైంది. దాంతో ఇప్పటి వరకు ఇండియాలో 1.83 కోట్ల రూపాయల నెట్.. 2 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు సాక్‌నిక్ నివేదించింది. ఓవర్సీస్ కలెక్షన్స్ పరిశీలిస్తే.. నార్త్ అమెరికాలో శుక్రవారం 30K డాలర్లు (28.53 లక్షల రూపాయలు), శనివారం 41 కేంద్రాలలో 27K డాలర్లు (25.67 లక్షల రూపాయలు) చొప్పున రెండ్రోజుల్లోనే నార్త్ అమెరికాలో 57K డాలర్లకు పైగా (55 లక్షల రూపాయలు) వసూలు చేసినట్లు ఈ సినిమా నార్త్ అమెరికా డిస్ట్రిబ్యూటర్ అధికారికంగా ప్రకటించారు.

Sing Geetham Day 3 Expected Box Office Collections Worldwide Singeetham Srinivasa Rao s film witnessed Impressive Growth Over Weekend

యూకే, యూరప్, గల్ఫ్, సింగపూర్, మలేషియా తదితర దేశాలలో మరో 15 లక్షల రూపాయలు రాబట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి. మొత్తంగా ఓవర్సీస్‌లో సింగ్ గీతం మూవీ 70 లక్షలు రాబట్టినట్లుగా తెలుస్తోంది. భారత్‌లో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి సింగ్ గీతం మూవీకి వరల్డ్ వైడ్‌గా రెండ్రోజుల్లో 2.70 లక్షల రూపాయలు వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి.

పెద్ది మూడో రోజు వసూళ్ల అంచనా
సింగ్ గీతం శ్రీనివాసరావు టేకింగ్, దేవిశ్రీ ప్రసాద్ మేజిక్‌కు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. 94 ఏళ్ల వయసులో సింగీతం ఎలా డైరెక్ట్ చేశారో చూడటానికి జెన్ జీ ఆసక్తి కనబరుస్తోంది. అయితే తెలుగులో పెద్ది నుంచి ఈ సినిమాకు గట్టి పోటీ ఎదురవుతోంది. కరుప్పు, దృశ్యం 3 సినిమాల ప్రభావం కూడా పడుతోంది. వీకెండ్ కావడంతో కుటుంబ ప్రేక్షకుల నుంచి ఓ మాదిరిగా సింగ్ గీతం మూవీకి రెస్పాన్స్ చూపిస్తున్నారు. మూడో రోజు ఈ సినిమాకు ఇండియాలో 323 షోలు ప్రదర్శితమై 23 శాతం ఆక్యూపెన్సీ రాబట్టినట్లుగా సాక్‌నిక్ నివేదించింది.

ఇక ట్రాక్ టాలీవుడ్ లెక్కల ప్రకారం.. మూడో రోజు సింగ్ గీతం మూవీకి ఇప్పటి వరకు ఇండియాలో 100 కేంద్రాలలో 403 షోలు ప్రదర్శితమై 24 శాతం ఆక్యూపెన్సీ సాధించింది. ఇప్పటి వరకు అందుతున్న లెక్కల ప్రకారం ఆదివారం సింగ్ గీతం మూవీకి 52 లక్షల రూపాయల నెట్ వసూలైనట్లు ట్రాక్ టాలీవుడ్ పేర్కొంది. మూడో రోజు హైదరాబాద్‌లో 96 షోలు, బెంగళూరులో 29 షోలు, విశాఖలో 25 షోలు, విజయవాడలో 25 షోలు ప్రదర్శితం అయ్యాయి. మూడో రోజు సింగ్ గీతం మూవీకి వరల్డ్ వైడ్‌గా 1.50 కోట్ల రూపాయల నుంచి 2 కోట్ల రూపాయల రేంజ్‌లో వసూళ్లు రాబట్టవచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

వీకెండ్ వరకు పర్లేదనే స్థాయిలో వసూళ్లు వస్తుండగా.. సోమవారం నుంచి మాత్రం సింగ్ గీతం మూవీకి అసలు సిసలు టెస్ట్ ఎదురుకానుంది. వేసవి సెలవులు ముగిసి జూన్ 15 నుంచి పూర్తి స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లో పాఠశాలలు, కాలేజీలు తెరచుకోనున్నాయి. వర్కింగ్ డేస్ కావడంతో రేపటి నుంచి సింగీతం శ్రీనివాసరావు మూవీ ఏ స్థాయిలో నిలబడుతుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X