Sing Geetham Day 4 Collections: సింగ్ గీతం కలెక్షన్లకు బ్రేక్.. 4 రోజుల వసూళ్లు ఇంతేనా?

Sing Geetham Collections: తెలుగు సినీ పరిశ్రమలో కంటెంట్ ఆధారిత సినిమాలకు ప్రేక్షకుల నుంచి ఎప్పుడూ ప్రత్యేక ఆదరణ ఉంటుంది. కానీ, బాక్సాఫీస్ విజయానికి సరిపోదని మరోసారి నిరూపిస్తున్న సినిమా 'సింగ్ గీతం'. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాత నాగ్ అశ్విన్ నిర్మాణంలో రూపొందించబడింది ఈ మ్యూజికల్ డ్రామా. ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నప్పటికీ, థియేటర్లలో మాత్రం ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోతోందనే చెప్పాలి. జూన్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'సింగ్ గీతం' సినిమా ఇప్పటి వరకు ఎన్ని కోట్లు వసూలు చేసింది? నాలుగో రోజు అంచనా కలెక్షన్లు ఎంతంటే?

లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన సినిమా 'సింగ్ గీతం'. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా బ్యానర్‌‌లపై ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమాలో అహిల్య బమ్రూ, అయాన్, షాలినీ కొండెపూడి, శివ నారాయణ, బెనర్జీ, వామ్కీ తదితరులు కీలకపాత్రలు పోషించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా.. అంకుర్ సీ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు.

Sing Geetham Day 4 Expected Box Office Collections Worldwide Nag Ashwin Faces Box Office Test Weak Numbers

జూన్ 12న విడుదలైన ఈ సినిమా మొదటి రోజే తన కంటెంట్‌తో విమర్శకులను ఆకట్టుకుంది. భావోద్వేగాలు, సంగీతం, సామాజిక సందేశాన్ని కలగలిపిన ఈ సినిమా చూసిన ప్రేక్షకులు కూడా సోషల్ మీడియాలో పాజిటివ్ స్పందన వ్యక్తం చేశారు. ముఖ్యంగా దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు పనితనం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, నటీనటుల ప్రదర్శనకు ప్రశంసలు లభించాయి. అయినప్పటికీ ఈ ప్రశంసలు టికెట్ కౌంటర్ల వద్ద భారీ వసూళ్లుగా మారలేకపోయాయి

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, మొదటి రోజు 72. 99 లక్షల రూపాయాలు, రెండో రోజు 1. 14 కోట్ల రూపాయాలు, ఇక మూడో రోజు 1. 26 కోట్ల రూపాయాలకు పైగా గ్రాస్ కలెక్షన్లు అందుకుంది. సినిమా తొలి మూడు రోజుల్లో సుమారు రూ. 3.14 కోట్ల నుంచి రూ.3.28 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసిందట. అయితే.. వీకెండ్ ఆదివారం వసూళ్లు పెరగడం కొంత ఊరటనిచ్చినా, లాంగ్ వీకెండ్‌ను పూర్తిగా క్యాష్ చేసుకోలేకపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక నాలుగో రోజు (సోమవారం) వీక్ డే.. ఈ కలెక్షన్లు మరింత దారుణంగా పడిపోయే అవకాశముంది. సోమవారం నాడు దేశవ్యాప్తంగా 102 నగరాల్లో 439 షోలతో ప్రదర్శించబడుతున్న ఈ సినిమా కేవలం 23 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే నమోదు చేసింది. దీంతో వీక్‌డేస్‌ (సోమవారం) నాడు కేవలం. 30 లక్షల నుంచి 40 లక్షల రూపాయాల మధ్య వసూలు చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది. తాజాగా వసూళ్లు కలిపితే.. సినిమా మొత్తం ఇండియా గ్రాస్ వసూలు 3.70 కోట్ల నుంచి 3.8 కోట్లకు చేరుకున్నట్లు అంచనా. ఇక మరో వైపు ఓవర్సీస్ 50 లక్షల వరకూ వసూలు చేసినట్టు టాక్.

అయితే ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. థియేటర్లలో కలెక్షన్లు ఆశించిన స్థాయిలో లేకపోయినా, నిర్మాతల పరంగా 'సింగ్ గీతం' ఇప్పటికే సేఫ్ ప్రాజెక్ట్‌గా మారిపోయిందని సమాచారం. దాదాపు 22 కోట్లతో తెరకెక్కిన సింగ్ గీతం సినిమాకు సంబంధించిన ఓటీటీ, శాటిలైట్, ఆడియో, ఇతర నాన్-థియేట్రికల్ హక్కుల ద్వారా సుమారు రూ.14 కోట్లకు పైగా ఆదాయం వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ డిజిటల్ హక్కుల ద్వారా భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

సాధారణంగా కంటెంట్ ఆధారిత సినిమాలు థియేటర్లలో భారీ వసూళ్లు సాధించకపోయినా, డిజిటల్ మార్కెట్‌లో మంచి డిమాండ్‌ను కలిగి ఉంటాయి. 'సింగ్ గీతం' విషయంలో కూడా అదే జరిగింది. విడుదలకు ముందే పెట్టుబడిలో గణనీయమైన భాగం రికవరీ కావడంతో నిర్మాతలపై ఒత్తిడి తగ్గిపోయింది. ఇప్పుడు థియేటర్ల నుంచి వచ్చే ఆదాయం అదనపు లాభంగానే పరిగణించబడుతోంది.

ట్రేడ్ లెక్కల ప్రకారం ఈ సినిమా థియేట్రికల్ బ్రేక్ ఈవెన్ దాటాలంటే దాదాపు రూ.8 కోట్ల షేర్ సాధించాల్సి ఉంటుంది. ప్రస్తుతం సినిమా సుమారు రూ.2 కోట్ల షేర్ మాత్రమే రాబట్టినట్లు సమాచారం. అంటే పూర్తి స్థాయి బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకా రూ. 6 కోట్లకు పైగా షేర్ అవసరం. ఇదే కారణంగా థియేట్రికల్ పరంగా సినిమా ముందు ఇంకా పెద్ద సవాల్ ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే పాజిటివ్ మౌత్ టాక్ వస్తే మాత్రం కలెక్షన్లు పెరిగే అవకాశముంది. ఈ సినిమా చివరికి థియేటర్లలో ఎంత మేరకు రికవరీ సాధిస్తుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X