Sing Geetham Day 5 Collections: సింగ్ గీతంకు షాకింగ్ కలెక్షన్స్.. సింగీతం శ్రీనివాసరావు మూవీకి ఐదో రోజు ఎంతంటే

లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన మూవీ సింగ్ గీతం. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా బ్యానర్‌‌లపై ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాను నిర్మించారు. అహిల్య బమ్రూ, అయాన్, షాలినీ కొండెపూడి, శివ నారాయణ, బెనర్జీ, వామ్కీ తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. అంకుర్ సీ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. జూన్ 12న సింగ్ గీతం మూవీ వరల్డ్ వైడ్‌గా రిలీజైంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు సింగ్ గీతం మూవీ ఎన్ని కోట్లు రాబట్టింది? 5వ రోజు సింగీతం శ్రీనివాసరావు మూవీకి వసూళ్లు ఎంత? అనేది పరిశీలిస్తే..

Also Read
ఆ రోజు వెక్కి వెక్కి ఏడ్చా... నిహారిక కొణిదెల ఎమోషనల్
ఆ రోజు వెక్కి వెక్కి ఏడ్చా... నిహారిక కొణిదెల ఎమోషనల్

నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి సింగ్ గీతం మూవీని దాదాపు 22 కోట్ల రూపాయలతో నిర్మించారు. మ్యూజిక్ ప్రధాన ఎలిమెంట్‌గా తెరకెక్కిన ఈ సినిమా తొలిరోజు భారతదేశంలో 54 లక్షల రూపాయలు, రెండో రోజున కోటి రూపాయలు, మూడో రోజున 1.16 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 1.16 కోట్ల రూపాయలు, ఐదో రోజున 39 లక్షల రూపాయలు చొప్పున ఇప్పటి వరకు ఇండియాలో 3.25 కోట్ల రూపాయల నెట్.. 3.75 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు సాక్‌నిక్ నివేదించింది.

Sing Geetham Day 5 Expected Box Office Collections Worldwide Singeetham Srinivasa Rao s film faces huge drop

సింగ్ గీతం ఓవర్సీస్ కలెక్షన్స్
పెద్ది వంటి భారీ చిత్రం నుంచి గట్టి పోటీ ఎదురవుతున్నప్పటికీ సింగ్ గీతం మూవీ నార్త్ అమెరికాలో స్టడీగా కలెక్షన్స్ రాబడుతోంది. అమెరికా, కెనడాలలో 4వ రోజు ఈ సినిమా 24K డాలర్లు (భారత కరెన్సీలో 22.71 లక్షల రూపాయలు) వసూలు చేసింది. ఇప్పటి వరకు సింగ్ గీతం మూవీ నార్త్ అమెరికాలో దాదాపు 100K డాలర్లు (దాదాపు 95 లక్షల రూపాయలు) మార్క్ దాటి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్య పరుస్తోంది.

Recommended For You
త్వరలో పెళ్లి పీటలెక్కనున్న శ్రీముఖి? స్టార్ యాంకర్ పెళ్లి డేట్ ఇదే?
త్వరలో పెళ్లి పీటలెక్కనున్న శ్రీముఖి? స్టార్ యాంకర్ పెళ్లి డేట్ ఇదే?

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, గల్ఫ్, మిడిల్ ఈస్ట్, యూకే, యూరప్ తదితర దేశాలో ఈ సినిమాకు 20 లక్షల రూపాయలు వసూలైనట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనితో కలిపి ఇప్పటి వరకు సింగ్ గీతం మూవీకి ఓవర్సీస్‌లో 1.20 కోట్ల రూపాయల వరకు వసూలైంది. భారత్‌లో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి సింగ్ గీతం మూవీకి ఇప్పటి వరకు 4.50 కోట్ల రూపాయలు రాబట్టినట్లుగా తెలుస్తోంది.

సింగ్ గీతం 5వ రోజు వసూళ్ల అంచనా
వీకెండ్ వరకు బాగానే హోల్డ్ చేసిన సింగ్ గీతం మూవీ మండే టెస్ట్‌లో మాత్రం ఫెయిలైంది. సోమవారం కేవలం 39 లక్షల రూపాయలు మాత్రమే వసూలు చేయగలిగింది. మంగళవారం కూడా సింగ్ గీతం పరిస్ధితి ఏమాత్రం మారలేదు. ఉదయం నుంచే బుకింగ్స్ దారుణంగా పడిపోయాయి. ఇప్పటి వరకు ఇండియాలో 375 షోలు ప్రదర్శితమై.. కేవలం 14 శాతం ఆక్యూపెన్సీ మాత్రమే రాబట్టింది. బుకింగ్స్‌లో భారీ డ్రాప్ కనిపిస్తోంది.

You May Also Like
'అందుకే బిగ్‌బాస్‌‌ నుంచి వెళ్లిపోయా... వాడికెంత బలుపు అంటే’
'అందుకే బిగ్‌బాస్‌‌ నుంచి వెళ్లిపోయా... వాడికెంత బలుపు అంటే’

5వ రోజు ఇప్పటి వరకు హైదరాబాద్‌లో 196 షోలు, విశాఖలో 55 షోలు, విజయవాడలో 54 షోలు, బెంగళూరులో 44 షోలు, గుంటూరులో 16 షోలు ప్రదర్శితమైనట్లుగా వార్తలు వస్తున్నాయి. ఐదో రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ సినిమా ఇండియాలో 9 లక్షల రూపాయలు మాత్రమే వసూలు చేసినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. వర్కింగ్ డే కావడంతో ఫస్ట్ ఫో, సెకండ్ షోలకు కూడా బుకింగ్ కష్టంగానే కనిపిస్తోంది. ట్రెండ్స్‌ను బట్టి సింగ్ గీతం మూవీ 5వ రోజు వరల్డ్ వైడ్‌గా 50 లక్షల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X