Sing Geetham Day 6 Collections: నాగ్ అశ్విన్‌కు ఎదురుదెబ్బ.. ‘సింగ్ గీతం' ఎంత రాబట్టిందో తెలుసా?

Sing Geetham Collection: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన సింగ్ గీతం సినిమా జూన్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ వైజయంతి మూవీస్, స్వప్న సినిమా బ్యానర్లపై ఈ సినిమాను నిర్మించారు. అహిల్య బమ్రూ, అయాన్, షాలినీ కొండెపూడి, శివ నారాయణ, బెనర్జీ, వామ్కీ తదితరులు కీలక పాత్రలు పోషించగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. సంగీత ప్రధాన అంశాలతో రూపొందిన ఈ సినిమా విడుదల తర్వాత పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. కానీ, ఆశించిన స్తాయిలో కలెక్షన్లు అందుకోలేకపోతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు సింగ్ గీతం మూవీ ఎన్ని కోట్లు రాబట్టింది? 6వ రోజు సింగీతం శ్రీనివాసరావు మూవీకి వసూళ్లు ఎంత? అనేది పరిశీలిస్తే..

ట్రేడ్ వర్గాల ప్రకారం.. సుమారు రూ.22 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన సింగ్ గీతం సినిమా తొలి రోజు రూ.54 లక్షలు, రెండో రోజు 1 కోటి రూపాయలు, మూడో రోజు 1. 16 కోట్లు రూపాయలు, నాలుగో రోజు 45 లక్షల రూపాయలు, ఐదో రోజు 41 లక్షల రూపాయల నెట్ కలెక్షన్లు సాధించింది. దీంతో తొలి ఐదు రోజుల్లో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 3. 76 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్, 4.35 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు నమోదు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Sing Geetham Day 6 Expected Box Office Collections Worldwide Singeetham Srinivasa Rao s film faces huge drop

ఓవర్సీస్‌లో కూడా 'సింగ్ గీతం'కలెక్షన్లు అలాగే ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా, కెనడా మార్కెట్లలో ఈ సినిమా కలెక్షన్లు పడిపోయాయి. నాలుగో రోజు నార్త్ అమెరికాలో కేవలం 24 వేల డాలర్లు (సుమారు రూ.22.7 లక్షలు) వసూలు చేసిందట. అలాగే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకే, యూరప్, గల్ఫ్ దేశాలు, మిడిల్ ఈస్ట్ మార్కెట్ల నుంచి కూడా ఈ సినిమాకి ఆదరణ లభించిందట. ఈ ప్రాంతాల నుంచి సుమారు రూ.20 లక్షల గ్రాస్ వచ్చినట్లు ట్రేడ్ రిపోర్టులు చెబుతున్నాయి. దీంతో ఓవర్సీస్‌లో మొత్తం వసూళ్లు రూ.1 కోట్లకు పైగా చేరాయట. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 4.35 కోట్ల రూపాయల గ్రాస్‌ అందుకోగా.. ఓవర్సీస్ నుంచి వచ్చిన రూ.1 కోటి గ్రాస్‌ను కలిపితే, సింగ్ గీతం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 5.35 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు తెలుస్తోంది.

సింగ్ గీతం 6వ రోజు వసూళ్ల అంచనా
వీకెండ్‌లో ఆశాజనకమైన వసూళ్లు నమోదు చేసిన సింగ్ గీతం సినిమా వీక్‌డేస్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో నిలబడలేకపోతోంది. సోమవారం ఈ సినిమా సుమారు రూ.45 లక్షల నెట్ కలెక్షన్లు సాధించగా, మంగళవారం ఆ సంఖ్య మరింత తగ్గి రూ.40 లక్షల వద్దకు చేరింది. దీంతో వీక్‌డే ఎఫెక్ట్ సినిమా వసూళ్లపై స్పష్టంగా కనిపిస్తోంది. ఇక బుధవారం కూడా పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించలేదు. ఉదయం షోల నుంచే బుకింగ్స్ మందగించడంతో ఆక్యుపెన్సీపై ప్రభావం పడింది.

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 352కు పైగా షోలు ప్రదర్శితమవగా, సగటు ఆక్యుపెన్సీ కేవలం 16 శాతం మాత్రమే నమోదైంది. ముఖ్యంగా నగర ప్రాంతాల్లో ప్రేక్షకుల స్పందన పరిమితంగానే కనిపిస్తోంది. ఏరియాల వారీగా చూస్తే హైదరాబాద్‌లో 187 షోలు, విశాఖపట్నంలో 55, విజయవాడలో 53, బెంగళూరులో 45, గుంటూరులో 12 షోలు ప్రదర్శితమైనట్లు తెలుస్తోంది. అయితే షోల సంఖ్యతో పోలిస్తే ప్రేక్షకుల హాజరు తక్కువగా ఉండటం ట్రేడ్ వర్గాలను నిరాశపరుస్తోంది.

బుధవారం మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ సినిమా దేశవ్యాప్తంగా సుమారు రూ.12 లక్షల నెట్ వసూళ్లు మాత్రమే నమోదు చేసినట్లు సమాచారం. వర్కింగ్ డే కావడంతో సాయంత్రం, రాత్రి షోల బుకింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో లేవని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుత ట్రెండ్స్‌ను బట్టి చూస్తే సింగ్ గీతం ఆరో రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.40 నుంచి రూ.42 లక్షల మధ్య గ్రాస్ వసూళ్లు సాధించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఫైనల్ ఫిగర్స్ రావాల్సి ఉన్నప్పటికీ, వీక్‌డేస్‌లో సినిమా కలెక్షన్లు గణనీయంగా తగ్గినట్లు స్పష్టమవుతోంది. అయితే వీకెండ్‌లో మళ్లీ పుంజుకుంటుందా లేదా అనేది చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X