twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ సినిమా హిట్ అని ఎవరన్నారు... భారీగా నష్టాలే!

    ‘సింగం 3’ థియేట్రికల్ రైట్స్ రూ. 90 కోట్లకు అమ్ముడవ్వగా.... బాక్సాఫీసు వద్ద కేవలం రూ. 60 కోట్లు మాత్రమే వసూలు చేసింది. బయ్యర్లకు 2/3 వంతు మాత్రమే రికవరీ అయింది. సినిమాకు మంచి టాకే వచ్చినా ఇలా నష్టాలు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: సూర్య-హరి కాంబినేషన్లో వచ్చే 'సింగం' సిరీస్ సినిమాలకు ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సీరీస్ లో వచ్చిన తొలి రెండు భాగాలు బాక్సాఫీసు వద్ద భారీ విజయం సాధించాయి. ఈ నేపథ్యంల ఇటీవల విడుదలైన సింగం-3 సినిమా భారీ అంచనాలతో విడుదలైంది.

    సినిమా విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి ఓపెనింగ్సే సాధించింది. తెలుగు కంటే తమిళంలో రెస్పాన్స్ బాగానే వచ్చింది. దీంతో సినిమా భారీ లాభాలు తెస్తుందని ఆశించారు. అయితే సినిమా ఫుల్ రన్ లో బయ్యర్లకు భారీ నష్టాలే మిగిల్చిందని తాజాగా తేలిసింది.

    100 కోట్ల బిజినెస్

    100 కోట్ల బిజినెస్

    తన సొంత నిర్మాణ సంస్థపై ‘24' సినిమాను నిర్మించిన సూర్య ఆ సినిమా వల్ల భారీగా నష్టపోయాడు. దీంతో సింగం-3 సినిమాపై ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకుని నష్టాలను భర్తీ చేసుకున్నాడు. థియేట్రికల్ రైట్స్, శాటిలైట్ రైట్స్ కలిపి దాదాపు 100 కోట్ల బిజినెస్ జరిగింది.

    తెలుగు, తమిళంలో 90 కోట్లు

    తెలుగు, తమిళంలో 90 కోట్లు

    తెలుగు, తమిళంలో థియేట్రికల్ రైట్స్ రూపంలో ఈ చిత్రం రూ. 90 కోట్ల బిజినెస్ జరిగింది. కేవలం సినిమాపై ఉన్న క్రేజ్ అడ్డు పెట్టుకుని బయ్యర్లకు సినిమాను భారీ ధరకు అమ్మారు.

    ఫుల్ రన్ లో భారీ నష్టాలు

    ఫుల్ రన్ లో భారీ నష్టాలు

    ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ రూ. 90 కోట్లకు అమ్ముడవ్వగా.... బాక్సాఫీసు వద్ద కేవలం రూ. 60 కోట్లు మాత్రమే వసూలు చేసింది. బయ్యర్లకు 2/3 వంతు మాత్రమే రికవరీ అయింది. సినిమాకు మంచి టాకే వచ్చినా ఇలా నష్టాలు రావడం అందరినీ షాక్ కు గురి చేసింది.

    తెలుగులో నష్టం

    తెలుగులో నష్టం

    ఈ చిత్రాన్ని తెలుగులో మల్కాపురం శివ కుమార్ రూ. 18 కోట్లకు కొన్నారు. కానీ సినిమా ఫుల్ రన్ లో రూ. 11 కోట్లు మాత్రమే వసూలు చేసింది. దీంతో ఆయనకు కూడా భారీ నష్టాలు తప్పలేదు.

    అదే ఎఫెక్ట్

    అదే ఎఫెక్ట్

    డిసెంబర్లో విడుదలవ్వాల్సిన సినిమా అనేక సార్లు వాయిదా పడటం, చివరకు ఫిబ్రవరిలో రిలీజ్ అవ్వడం, అదే సమయంలో పరీక్షల సీజన్ మొదలవ్వడం లాంటివన్నీ మంచి టాక్ వచ్చినా సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపినట్లు స్పష్టమవుతోంది.

    English summary
    As Suriya Hari combination carries huge buzz among the trade circles.. 'Singam 3' has done bumper pre-release business. The total business of the film crossed Rs.100 crores including satellite, audio and digital rights. If we take only theatrical rights of Telugu Tamil versions.. they have touched 90 crores. But everybody will get a shock if they have a look at the 'S 3' full run collections. The movie has collected below Rs.60 crores in the full run in both Tamil and Telugu languages.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X