Singapore Saloon Collectoins 8 కోట్ల బడ్జెట్.. భారీగా కలెక్షన్లు.. చిన్న హీరో మూవీకి ఎన్ని కోట్లంటే?
సినిమా పరిశ్రమలో చిన్న చిత్రాలు ఎలాంటి హడావిడి లేకుండా భారీ విజయాలను అందుకొంటాయి. ఇటీవల కాలంలో అలాంటి చిత్రాల్లో బలగం, హనుమ్యాన్ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కంటెంట్‌ను ప్రధానంగా బలంగా మార్చుకొని హిట్టుకొట్టిన ఇలాంటి చిత్రాల మాదిరిగాన చిత్ర చిత్రంగా రిలీజైన తమిళ సినిమా సింగపూర్ సెలూన్. ఆర్జే బాలాజీ హీరోగా నటించిన ఈ సినిమాకు సంబంధించిన బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్, కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
వేల్స్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై గోకుల్ దర్శకత్వంలో ఇషారీ కే గణేష్ నిర్మించిన చిత్రం సింగపూర్ సెలూన్. తమిళ హీరో, ఆర్జే బాలాజీతోపాటు మీనాక్షి చౌదరీ జంటగా నటించింది. ఈ సినిమాలో జాన్ విజయ్, సత్య రాజ్, రోబో శంకర్, లోకేష్ కనకరాజ్, జీవా అతిథి పాత్రల్లో నటించారు.

ఇక కథ విషయానికి వస్తే.. సచా అనే స్థానిక సెలూన్‌ను చూసి కదీర్ (ఆర్జే బాలాజీ), బషీర్ (కిషన్ దాస్) భారీ కలలు కంటారు. జీవితంలో హెయిర్ స్టైలిష్ట్‌గా మారి పాపులర్ కావాలనుకొంటారు. ఆ క్రమంలో కదీర్ సింగపూర్ సెలూన్ అనే షాప్‌ను మొదలుపెడుతారు. ఆ క్రమంలో ఎదరైన ఛాలెంజ్‌లు, సెలూన్‌ను ఓపెన్ చేయడానికి పడిన కష్టాలు, ఆ తర్వాత జరిగిన సంఘటనల నేపథ్యమే సింగపూర్ సెలూన్ సినిమా కథ.

సింగపూర్ సెలూన్ సినిమా బడ్జెట్ విషయానికి వస్తే.. ఈ సినిమాను అన్ని ఖర్చులతో కలిపి 8 కోట్ల రూపాయలతో నిర్మించారు. అయితే ఈ సినిమా రిలీజ్‌కు ముందే ఓటీటీ, ఇతర హక్కుల అమ్మకాలతో లాభాల్లోకి ప్రవేశించింది. థియేట్రికల్‌గా ఈ సినిమా 8 కోట్ల రూపాయల టార్గెట్‌తో బాక్సాఫీస్ యాత్రను ప్రారంభించింది.
తమిళనాడులో మాత్రమే రిలీజైన సింగపూర్ సెలూన్ చిత్రం తొలి రోజు వారాంతంలో భారీగానే వసూళ్లు సాధించింది. తొలి రోజు 1 కోటి రూపాయలు నికరంగా, రెండో రోజు 2 కోట్ల రూపాయలు, మూడో రోజు 1.5 కోట్లు, నాలుగో రోజు 1.3 కోట్లు వసూలు చేసింది. ఇక ఐదో రోజు కలెక్షన్లు తగ్గాయి.. కానీ బాక్సాఫీస్ వద్ద 55 లక్షలు నికరంగా.. 1 కోటి రూపాయలు గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

సింగపూర్ సెలూన్ చిత్రం గత 5 రోజుల్లో 6.3 కోట్ల రూపాయలు బాక్సాఫీస్ వద్ద నమోదు చేసింది. ఆర్జే బాలాజీ తన కెరీర్‌లో ఇది హీరోగా 5వ సినిమా. ముక్తీ అమ్మన్ సినిమాతో హీరోగా మారిన ఆర్జే బాలాజీ తనదైన శైలిలో రాణిస్తున్నారు. ఈ సినిమా అతడి కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.


Click it and Unblock the Notifications











