Singham Again 3 days Collections: బాక్సాఫీస్‌ను కుమ్మేస్తున్న సింగం అగైన్.. అజయ్ దేవగన్ మూవీకి ఎన్ని కోట్లంటే?

బాలీవుడ్‌లో బిగ్గెస్ట్ ఫ్రాంచైజీ సింగం మూవీకి సీక్వెల్‌గా వచ్చిన సింగం అగైన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తున్నది. హిందీ సినిమా పరిశ్రమలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు రిలయెన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, జియో స్టూడియోస్, రోహిత్ శెట్టి పిక్చర్స్, దేవగన్ ఫిల్మ్స్, సినెర్జీ బ్యానర్లపై రోహిత్ శెట్టి, అజయ్ దేవగన్, జ్యోతి దేశ్ పాండే నిర్మించారు. రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? బాక్సాఫీస్ వద్ద సాధిస్తున్న కలెక్షన్లు వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్ సూపర్ స్టార్స్ అజయ్ దేవగన్, కరీనా కపూర్, సల్మాన్ ఖాన్ (గెస్ట్ అప్పీయరెన్స్) రణ్‌వీర్ సింగ్, అక్షయ్ కుమార్, దీపిక పదుకోన్, అర్జున్ కపూర్, జాకీ ష్రాఫ్, రవికిషన్, శ్వేత తివారీ తదితరులు నటించిన ఈ సినిమా రామాయణం కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు. సీతాపహరణం, రావణ వధ పాయింట్‌ను ఆధారంగా తీసుకొని సోషియో ఫాంటసీ మూవీగా రూపొందించారు.

Singham Again 1st Weekend Box Office Collections Worldwide Ajay Devgn Movie crores 150 crores

సింగం మూవీకి సీక్వెల్‌గా రోహిత్ శెట్టి మల్టీ యూనివర్స్‌లో భాగంగా రూపొందిన మల్టీ స్టారర్ చిత్రాన్ని భారీగా నిర్మించారు. అనుక్షణం థ్రిలింగ్‌గా రూపొందే ఈ సినిమాను ఖర్చుకు వెనకాడకుండా హై ఎండ్ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ మూవీలో నటించిన యాక్టర్లు, టెక్నిషియన్ల రెమ్యునరేషన్లు కలిపి ఈ సినిమాను సమారుగా 400 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు.

సింగం అగైన్ చిత్రం అజయ్ దేవగన్ కెరీర్‌లో రికార్డు ఓపెనింగ్స్‌తో బాక్సాఫీస్ జర్నీని ప్రారంభించింది. ఈ సినిమా తొలి రోజున ఇండియాలో 44 కోట్ల నెట్, ప్రపంచవ్యాప్తంగా 60 కోట్ల రూపాయలు వసూలు చేసింది. రెండో రోజున ఈ చిత్రం భారత్‌లో 43 కోట్ల రూపాయలు, ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల రాబట్టింది. దాంతో రెండు రోజుల్లోనే ఈ సినిమా 110 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

సింగం అగైన్ చిత్రం 3వ రోజు ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. మార్నింగ్ షోకు 35 శాతం, మ్యాట్నీకి 60 శాతం, ఫస్ట్ షోకు 70 శాతం, సెకండ్ షోకు 60 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసింది. సూరత్, జైపూర్, లక్నో, ఆహ్మదాబాద్, చెన్నై, ముంబై, పూణేలో 50 శాతం నుంచి 65 శాతం వరకు ఆక్యుపెన్సీ కనిపించింది.

ఇక మూడో రోజు సెలవు దినం నాడు పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఈ సినిమా ఇండియాలో 38 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 45 కోట్ల రాబట్టింది. ఓవర్సీస్‌లో ఈ చిత్రం 30 కోట్లు రాబట్టింది. దాంతో ఈ సినిమా 3 రోజుల్లో 155 కోట్ల రూపాయలను రాబట్టింది. ఈ సినిమా 400 కోట్ల షేర్ రాబట్టాల్సిన అవసరం ఉంది.ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవుతుందా? లేదా అనేది వేచి చూడాల్సాందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X