Singham Again VS Bhool Bhulaiyaa 3: సింగమ్ అగైన్‌తో భూల్ భులయ్యా బాక్సాఫీస్ ఫైట్.. విజయం అజయ్ దేవగన్ దేనా?
బాలీవుడ్‌లో రెండు భారీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీగా తలపడుతున్నాయి. భూల్ భులయ్యా 3 చిత్రంతో సింగమ్ అగైన్ మూవీ నువ్వా నేనా అనే విధంగా కలెక్షన్ల యుద్దాన్ని కొనసాగిస్తున్నాయి. ఈ రెండు చిత్రాలు కూడా సీక్వెల్స్ కావడంతో దీపావళీ పండుగ ప్రేక్షకులకు పండుగ వాతావరణాన్ని తెచ్చిపెట్టాయి. అయితే కార్తీక్ ఆర్యన్, విద్యా బాలన్ కలిసి నటించిన భూల్ భులయ్య 3, అలాగే సింగమ్ అగైన్ సినిమాల అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.
సినిమాపై ఉండే క్రేజ్ కారణంగా భూల్ భులయ్య 3 చిత్రాన్ని భారీగా రిలీజ్ చేశారు. ఇండియాలో ఈ సినిమాను సుమారుగా 10000 స్క్రీన్లలో ప్రదర్శించారు. ఈ సినిమా టికెట్లు సుమారుగా 5 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమాకు పాజిటివ్ రిపోర్ట్స్ రావడం కూడా సానుకూలంగా మారింది.

అజయ్ దేవగన్ నటించిన సింగమ్ అగైన్ మూవీ కూడా భారీగా రిలీజైంది. రికార్డు స్థాయిలో సుమారుగా 14 వేలకుపైగా స్క్రీన్లలో ప్రదర్శిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టికెట్లు సుమారుగా 5 లక్షలకుపైగా అమ్ముడుపోయాయి. దాంతో ఈ మూవీ తొలి రోజున రికార్డు వసూళ్లను నమోదు చేసే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
సింగమ్ సినిమా అత్యధికంగా స్క్రీన్లలో రిలీజ్ అయినప్పటికీ.. తక్కువ స్క్రీన్లలో రిలీజైన భూల్ భులయ్య 3 మూవీ అడ్వాన్స్ బుకింగ్ పరంగా పై చేయి సాధించింది. స్త్రీ 2 మూవీ తర్వాత ఈ ఏడాదిలో అత్యధిక టికెట్లు అమ్ముడుపోయిన రెండో చిత్రంగా భూల్ భులయ్యా 3 రికార్డు క్రియేట్ చేసింది.

భూల్ భులయ్యా 3 చిత్రం ఆధిపత్యం కలెక్షన్ల పరంగా కూడా కొనసాగుతున్నది. సింగం అగైన్ సినిమాను మంచి బాక్సాఫీస్ డామినేషన్ ప్రదర్శిస్తున్నది. ఈ చిత్రం 12 కోట్లు అడ్వాన్స్ బుకింగ్ పరంగా వసూలు చేస్తే.. దాంతో ఈ మూవీ తొలి రోజు రికార్డు వసూళ్లను రాబడుతుందని అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉండగా, సింగమ్ అగైన్ చిత్రం కూడా భారీగానే కలెక్షన్లు రాబట్టింది. ఈ చిత్రం సుమారుగా 10 కోట్లకుపైగా వసూళ్లను నమోదు చేసింది. దాంతో ఈ చిత్రం కూడా కలెక్షన్లపరంగా పుంజుకొనే అవకాశం ఉంది. ఈ సినిమా కరెంట్ బుకింగ్ మంచి రెస్పాన్స్ లభిస్తున్నది.

ఇక భూల్ భూలయ్య 3 చిత్రం తొలి రోజు కలెక్షన్లు విషయానికి వస్తే.. ఇండియాలో 5 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో మరో 3 కోట్ల రూపాయలతో మొత్తంగా 8 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అలాగే సింగమ్ అగైన్ చిత్రం కూడా ఇండియాలో 4 నుంచి 5 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 4 కోట్ల రూపాయలు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











