Single Closing Collections: సింగిల్ హిట్టా? ఫట్టా? .. శ్రీవిష్ణు మూవీకి లాభమెంత? నష్టమెంత?
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో కార్తీక్ రాజు దర్శకత్వంలో సింగిల్ మూవీ తెరకెక్కింది. గీతా ఆర్ట్స్, కళ్యాణ్ ఫిల్మ్స్ పతాకాలపై విద్య కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరిలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీవిష్ణు, కేతిక శర్మ, ఇవానా, వెన్నెల కిషోర్ నటించారు. ఈ సినిమా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఈ సినిమాకు లాభమెంత? నష్టమెంత? అనే వివరాల్లోకి వెళితే..
ఓం భీం బుష్, స్వాగ్ సినిమాల హిట్స్‌తో నాని దూకుడు మీదున్నారు. తన హిట్ ట్రాక్ కంటిన్యూ చేయడంతో పాటు మార్కెట్ పెంచుకుంటున్న శ్రీవిష్ణు మరోసారి యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌ని టార్గెట్ చేశాడు. కార్తీక్ రాజు దర్శకత్వంలో శ్రీవిష్ణు నటించిన సినిమాయే సింగిల్. టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ కార్యక్రమాలతో మంచి బజ్ సాధించిన సింగిల్.. బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించింది.

సింగిల్ బడ్జెట్, బిజినెస్ & బ్రేక్ ఈవెన్ టార్గెట్
సింగిల్ చిత్రాన్ని సుమారుగా 15 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించగా, ఈ సినిమాకు దాదాపు 7 కోట్ల రూపాయల బిజినెస్ జరిగినట్లుగా ఫిలింనగర్ వర్గాలు తెలిపాయి. సింగిల్ చిత్రం లాభాల్లోకి రావాలంటే రూ.8 కోట్ల షేర్.. రూ.16 కోట్ల గ్రాస్ వసూలు చేయాలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు. మే 9న సుమారుగా తెలుగు రాష్ట్రాల్లో 400 స్క్రీన్లలో, ప్రపంచవ్యాప్తంగా 700 స్క్రీన్లలో సింగిల్ సినిమాను రిలీజ్ చేశారు.
సింగిల్ కలెక్షన్స్
సింగిల్ మూవీకి తొలి రోజు ఇండియాలో రూ.2.5 కోట్లు, రెండవ రోజు రూ.3.5 కోట్ల నెట్, మూడో రోజు రూ.3.55 కోట్ల నెట్, నాలుగో రోజు రూ.1.7 కోట్లు, ఐదో రోజు రూ.1.58 కోట్లు, ఆరో రోజు రూ.1.17 కోట్లు, ఏడో రోజు రూ.1.1 కోట్లు, ఎనిమిదో రోజు రూ.1.32 కోట్లు, తొమ్మిదో రోజు రూ.1.83 కోట్లు, పదవ రోజున రూ.2.09 కోట్లు, పదకొండవ రోజున రూ.77 లక్షలు, పన్నెండవ రోజున రూ.55 లక్షలు, పదమూడవ రోజున రూ.47 లక్షలు, పద్నాలుగవ రోజున రూ.39 లక్షలు, పదిహేనవ రోజున రూ.34 లక్షలు , పదహారో రోజున రూ.59 లక్షలు, పదిహేడవ రోజున రూ.64 లక్షలు, పద్దెనిమిదవ రోజున రూ.32 లక్షలు చొప్పున 18 రోజుల వరకు ఇండియాలో రూ.23.6 కోట్ల నెట్, రూ.26.82 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు సాక్‌నిల్క్ తెలిపింది.
ఓవర్సీస్‌లో సింగిల్ మూవీకి అనూహ్య స్పందన లభించింది. ట్రేడ్ వర్గాల అంచనాను బట్టి హాఫ్ మిలియన్ వరకు అక్కడ కలెక్షన్స్ రాబట్టాడు శ్రీవిష్ణు. ఓవర్సీస్ మార్కెట్‌లో దాదాపు రూ.4.20 కోట్ల వరకు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇండియాలో వచ్చిన గ్రాస్ 26.82 కోట్లు + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి సింగిల్ మూవీకి ప్రపంచవ్యాప్తంగా రూ.32 కోట్ల వసూళ్లు ఆర్జించినట్లు అనలిస్టులు చెబుతున్నారు. థియేట్రికల్ రన్ ముగిసేసరికి ఈ మొత్తం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.
సింగిల్‌కి ఎన్ని కోట్ల లాభమంటే?
సింగిల్ మూవీ థియేట్రికల్ బిజినెస్ వాల్యూ ప్రకారం చూస్తే.. ఈ సినిమా పూర్తి రికవరీ సాధించి లాభాల్లోకి వచ్చింది. దాదాపు రూ.14 కోట్లకు పైగా లాభాలతో శ్రీవిష్ణు మూవీ థియేట్రికల్ బిజినెస్ క్లోజ్ చేసింది. ఓవరాల్ బడ్జెట్, థియేట్రికల్ బిజినెస్, ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్ అన్నింటి ద్వారా నిర్మాతకు భారీ లాభాలను అందించినట్లు ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. కొన్ని ఏరియాలలో ఈ సినిమాను థియేటర్ల నుంచి తొలగిస్తుండగా, ఈ వారాంతంతో థియేట్రికల్ రన్ ముగింపుపై పూర్తి క్లారిటీ రానుంది. మరి శ్రీవిష్ణు తన పరుగు ఆపే వరకు ఎన్ని కోట్లు రాబడతాడో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











