Single Day 1 Collections: సింగిల్ మూవీకి రికార్డ్ ఓపెనింగ్స్ .. శ్రీవిష్ణు చిత్రానికి ఫస్ట్ డే ఎన్ని కోట్లంటే?

యంగ్ హీరో శ్రీవిష్ణు హీరోగా కేతికా శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించిన చిత్రం సింగిల్. వెన్నెల కిశోర్, వీటీవీ గణేష్, కల్పలత తదితరులు ఇతర కీలకపాత్రలు పోషించారు. కార్తీక్ రాజు దర్శకత్వం వహించగా.. గీతా ఆర్ట్స్, కళ్యా ఫిల్మ్స్ పతాకాలపై విద్య కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరిలు సంయుక్తంగా సింగిల్ చిత్రాన్ని నిర్మించారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సమర్పించారు. సింగిల్ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు ఎంత అనే వివరాల్లోకి వెళితే..

సింగిల్ బడ్జెట్, బిజినెస్ & బ్రేక్ ఈవెన్ టార్గెట్

నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి సింగిల్ చిత్రాన్ని సుమారుగా 15 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌ను 7 కోట్ల రూపాయలు జరిగినట్లుగా ట్రేడ్ పండితులు తెలిపారు. సింగిల్ చిత్రం లాభాల్లోకి రావాలంటే రూ.8 కోట్ల షేర్.. రూ.16 కోట్ల గ్రాస్ వసూలు చేయాలని విలువ కట్టారు.

Single Day 1 Box Office Collections Worldwide Sree Vishnu starts on a decent note

భారీగా ప్రమోషనల్ కార్యక్రమాలు

ఓం భీమ్ బుష్, స్వాగ్ చిత్రాల తర్వాత శ్రీవిష్ణు నటించిన సినిమా కావడంతో పాటు టీజర్, ట్రైలర్లతో పాటు విస్త్రృతంగా చేసిన ప్రమోషనల్ కార్యక్రమాలతో సింగిల్ చిత్రంపై మంచి బజ్ ఏర్పడింది. విభిన్న చిత్రాలతో శ్రీవిష్ణు యూత్‌లో సెపరేట్ ఫాలోయింగ్ ఏర్పాటు చేసుకున్నాడు. దీంతో సింగిల్ మూవీ కోసం ఓ వర్గం ఉత్కంఠగా ఎదురుచూసింది. ఈ చిత్రాన్ని మే 9న సుమారుగా తెలుగు రాష్ట్రాల్లో 400 స్క్రీన్లలో, ప్రపంచవ్యాప్తంగా 700 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న సింగిల్

తొలి రోజు ఈ సినిమాకు తెలుగులో దాదాపు 35.75 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లుగా సాక్‌నిల్క్ వెల్లడించింది. హైదరాబాద్‌లో 262, బెంగళూరులో 121, విజయవాడలో 68, విశాఖపట్నంలో 87 షోలు పడినట్లు తెలిపింది. తొలి ఆట నుంచే మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు కలెక్షన్స్ ఎలా ఉంటాయోనని విశ్లేషకులు ఉత్కంఠగా ఎదురుచూశారు. భారత్ - పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కూడా కొంతమేర ప్రభావం చూపిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సింగిల్ మూవీ ఓపెనింగ్స్

తొలి రోజు శ్రీవిష్ణు చిత్రం రూ.2 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టినట్లు సాక్‌నిల్క్ తెలిపింది. అయితే ఇది ఆయన గత చిత్రాల కంటే తక్కువ కావడం గమనార్హం. శ్రీవిష్ణు చివరి రెండు చిత్రాలలో స్వాగ్ 2.5 కోట్ల రూపాయల గ్రాస్, ఓం భీమ్ బుష్ 3.5 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టాయి. అయితే కొన్ని మీడియా సంస్థలు సింగిల్ చిత్రానికి తొలి రోజు రూ.4.3 కోట్ల ఓపెనింగ్స్ వచ్చినట్లుగా తెలిపాయి. అయితే చిత్ర యూనిట్ అధికారికంగా దీనిపై క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. కుటుంబం మొత్తం చూసే కామెడీ సినిమా వచ్చి చాలా కాలం కావడంతో పాటు నాని నటించిన హిట్ 3 సినిమా ప్రభావం కూడా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో సింగిల్ సినిమాకు కలిసొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి శ్రీ విష్ణు ఎలాంటి మేజిక్ చేస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X