Single Box Office Collections: సింగిల్ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్లు.. శ్రీ విష్ణు మూవీకి షాకింగ్ కలెక్షన్లు!
యువ హీరో శ్రీ విష్ణు, టాప్ కమెడియన్ వెన్నెల కిషోర్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం సింగిల్. ఫన్, ఎమోషన్స్‌తో కూడిన ఈ సినిమాలో కేతికా శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పించగా విద్యా కొప్పినీడు, భాను ప్రతాప్, రియాజ్ చౌదరీ నిర్మించారు. కార్తీక్ రాజు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా మే 9వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు ఎంత అనే వివరాల్లోకి వెళితే..
కామెడీ సన్నివేశాలకు పెద్ద పీట వేస్తూ పూర్తిస్థాయి వినోదభరితంగా రూపొందించిన ఈ చిత్రాన్ని మీడియం రేంజ్ ఆర్టిస్టులు, టెక్నిషియన్స్‌తో అదే రేంజ్ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ సినిమాను సుమారుగా 15 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌ను 8 కోట్లుగా వాల్యూ కట్టారు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

సింగిల్ సినిమాను డిజిటల్ మీడియాలో భారీగా ప్రమోషన్స్ చేయడం.. టీమ్ అంతా ఎక్కువగా ఇంటర్వ్యూలు, రీల్స్ ప్లాన్ చేసి సినిమాపై బజ్ క్రియేట్ చేశారు. దాంతో ఈ సినిమా కోసం ఓ వర్గం ఆసక్తిగా ఎదురు చూసింది. దాంతో ఈ చిత్రాన్ని సుమారుగా తెలుగు రాష్ట్రాల్లో 400 స్క్రీన్లలో, ప్రపంచవ్యాప్తంగా 700 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.
ఇక ఈ సినిమాకు ఓవరాల్‌గా 35 శాతం ఆక్యుపెన్సీ సుమారుగా నమోదైందని ట్రేడ్ వర్గాలు వెల్లడించారు. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, వైజాగ్, కాకినాడ తదితర ప్రాంతాల్లో 35 శాతం నుంచి 55 శాతం వరకు ఆక్యుపెన్సీ నమోదైంది. మిగితా ప్రాంతాల్లో 30 శాతం కంటే తక్కువగా నమోదైందని సాక్ నిల్క్ వెల్లడించింది.
సింగిల్ సినిమా రిలీజ్ తర్వాత మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకొన్నది. దాంతో ఈ సినిమాకు మీడియం రేంజ్‌లో బుకింగ్స్ నమోదు అవుతున్నాయి. అయితే ఐపీఎల్ మ్యాచ్‌లు లేకపోవడం వల్ల ఈ సినిమా నైట్ షోలకు పాజిటివ్‌గా మారింది. దాంతో ఈ సినిమా తొలి రోజు 2.5 కోట్ల నుంచి 3 కోట్ల గ్రాస్, 1. 5 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది. ఐపీఎల్ ప్రభావం లేకపోతే ఇంకా కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
శ్రీ విష్ణు గత రెండు సినిమాలు పాజిటివ్‌గా ఓపెనింగ్స్ సాధించింది. ఆయన నటించిన స్వాగ్ చిత్రం 2.5 కోట్ల రూపాయల గ్రాస్, ఓం భీమ్ బుష్ 3.5 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. అయితే ఈ రెండు సినిమాల తొలి రోజు కలెక్షన్లకు సమానంగానే సింగిల్ మూవీ కలెక్షన్లు సాధించే అవకాశం ఉంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. 8 కోట్ల షేర్.. 16 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టాల్సి ఉంది. ఈ సినిమా రానున్న రోజుల్లో ఏ మేరకు లాభాలను సాధిస్తుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











