Single Box Office: శ్రీవిష్ణు బాక్సాఫీస్ సునామీ.. 40 కోట్ల దిశగా సింగిల్!
శ్రీవిషు , కేతికా శర్మ, ఇవానా, వెన్నెల కిషోర్ నటించిన కామెడీ, లవ్ ఎంటర్‌టైనర్ సింగిల్ మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ టార్గెట్ కొట్టేసిన ఈ సినిమా లాభాలను అందిస్తోంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో కార్తీక్ రాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్, కళ్యా ఫిల్మ్స్ పతాకాలపై విద్య కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరిలు సంయుక్తంగా సింగిల్ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా 10 రోజుల్లో ఎన్ని కోట్లు వసూలు చేసింది? ఎన్ని కోట్ల లాభాలను అందించింది ? అనే వివరాల్లోకి వెళితే..
సింగిల్ బడ్జెట్, బిజినెస్ & బ్రేక్ ఈవెన్ టార్గెట్
సింగిల్ చిత్రాన్ని సుమారుగా 15 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించగా, ఈ సినిమాకు దాదాపు 7 కోట్ల రూపాయలు జరిగినట్లుగా ఫిలింనగర్ వర్గాలు తెలిపాయి. సింగిల్ చిత్రం లాభాల్లోకి రావాలంటే రూ.8 కోట్ల షేర్.. రూ.16 కోట్ల గ్రాస్ వసూలు చేయాలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు. మే 9న సుమారుగా తెలుగు రాష్ట్రాల్లో 400 స్క్రీన్లలో, ప్రపంచవ్యాప్తంగా 700 స్క్రీన్లలో సింగిల్ సినిమాను రిలీజ్ చేశారు.

సింగిల్ 9 రోజుల వసూళ్లు
సింగిల్ మూవీకి తొలి రోజు ఇండియాలో రూ.2.5 కోట్లు, రెండో రోజు రూ.3.5 కోట్ల నెట్, మూడో రోజు రూ.3.55 కోట్ల నెట్, నాలుగో రోజు రూ.1.7 కోట్లు, ఐదో రోజు రూ.1.58 కోట్లు, ఆరో రోజు రూ.1.17 కోట్లు, ఏడో రోజు రూ.1.1 కోట్లు, ఎనిమిదో రోజు రూ.1.32 కోట్లు, తొమ్మిదో రోజు రూ.1.83 కోట్లు చొప్పున 9 రోజుల్లో సింగిల్ మూవీ నికరంగా రూ.19 కోట్లు సాధించినట్లు సాక్‌నిల్క్ తెలిపింది. అలాగే ఓవర్సీస్‌లో రూ.3.25 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ పండితులు చెప్పారు.
సింగిల్ 10వ రోజు వసూళ్లు
పెద్ద సినిమాలే కలెక్షన్ల విషయంలో చతికిలపడుతుంటే సింగిల్ చిత్రం మాత్రం రిలీజైన నాటి నుంచి రోజుకు రూ. కోటి రూపాయలు తగ్గకుండా వసూళ్లు సాధిస్తోంది. వీకెండ్ కలిసిరావడంతో 10వ రోజైన ఆదివారం ఫ్యామిలీ, యూత్ ఆడియన్స్ నుంచి ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది. ఆదివారం ఓవరాల్‌గా 34.38 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైంది. హైదరాబాద్‌లో 284, బెంగళూరులో 50, విజయవాడలో 51, విశాఖటపట్నంలో 94 షోలు పడ్డాయి. 10వ రోజు సింగిల్ మూవీకి ఇండియా వైడ్ నికరంగా రూ.1.80 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు సాక్‌నిల్క్ తెలిపింది. దీంతో 10 రోజుల వరకు ఈ సినిమాకు భారత్‌లో రూ.20.25 కోట్ల నెట్, రూ. 24.62 కోట్ల గ్రాస్ వచ్చింది. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ రూ.4 కోట్లు కలిపి 7 రోజుల వరకు ప్రపంచవ్యాప్తంగా సింగిల్ మూవీ రూ.32 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
అయితే కొందరు క్రిటిక్స్ సహా పలు సోషల్ మీడియా సంస్ధలు మాత్రం సింగిల్ మూవీ రూ. 40 కోట్లకు చేరువైనట్లుగా చెబుతున్నారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావడానికి కావాల్సిన రూ.16 కోట్లను ఐదు రోజుల్లోనే కొట్టేసిన శ్రీవిష్ణు.. ఇప్పుడు ఏకంగా 15 కోట్లకు పైగా లాభాలను నిర్మాతలకు అందించినట్లుగా సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఐపీఎల్ కొద్దిరోజులు వాయిదాపడటం, పెద్ద సినిమాలు లేకపోవడం కూడా సింగిల్ మూవీకి కలిసొచ్చింది. ఈ వారం కూడా శ్రీవిష్ణు సినిమా తన హవా చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి లాంగ్ రన్‌లో సింగిల్ మూవీ ఎలాంటి మేజిక్ చేస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











