Single Box Office: హిట్ 3ని కొట్టేసిన సింగిల్.. శ్రీవిష్ణు మూవీకి కళ్లు చెదిరే ప్రాఫిట్స్, ఎన్ని కోట్లంటే?
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో కార్తీక్ రాజు దర్శకత్వంలో వచ్చిన మూవీ సింగిల్. శ్రీవిష్ణు, కేతిక శర్మ, ఇవానా, వెన్నెల కిషోర్‌లు నటించారు. గీతా ఆర్ట్స్, కళ్యా ఫిల్మ్స్ పతాకాలపై విద్య కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరిలు సంయుక్తంగా సింగిల్ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా 12 రోజుల్లో ఎన్ని కోట్లు వసూలు చేసింది? ఎన్ని కోట్ల లాభాలను అందించింది ? అనే వివరాల్లోకి వెళితే..
సింగిల్ బడ్జెట్, బిజినెస్ & బ్రేక్ ఈవెన్ టార్గెట్
సింగిల్ చిత్రాన్ని సుమారుగా 15 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించగా, ఈ సినిమాకు దాదాపు 7 కోట్ల రూపాయలు జరిగినట్లుగా ఫిలింనగర్ వర్గాలు తెలిపాయి. సింగిల్ చిత్రం లాభాల్లోకి రావాలంటే రూ.8 కోట్ల షేర్.. రూ.16 కోట్ల గ్రాస్ వసూలు చేయాలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు. మే 9న సుమారుగా తెలుగు రాష్ట్రాల్లో 400 స్క్రీన్లలో, ప్రపంచవ్యాప్తంగా 700 స్క్రీన్లలో సింగిల్ సినిమాను రిలీజ్ చేశారు.

సింగిల్ 11 రోజుల వసూళ్లు
సింగిల్ మూవీకి తొలి రోజు ఇండియాలో రూ.2.5 కోట్లు, రెండో రోజు రూ.3.5 కోట్ల నెట్, మూడో రోజు రూ.3.55 కోట్ల నెట్, నాలుగో రోజు రూ.1.7 కోట్లు, ఐదో రోజు రూ.1.58 కోట్లు, ఆరో రోజు రూ.1.17 కోట్లు, ఏడో రోజు రూ.1.1 కోట్లు, ఎనిమిదో రోజు రూ.1.32 కోట్లు, తొమ్మిదో రోజు రూ.1.83 కోట్లు, పదవ రోజున రూ.2.09 కోట్లు, పదకొండవ రోజున రూ.77 లక్షల చొప్పున 11 రోజుల్లో సింగిల్ మూవీ నికరంగా రూ.20 కోట్లు సాధించినట్లు సాక్‌నిల్క్ తెలిపింది. అలాగే ఈ సినిమా ఓవర్సీస్‌లో రూ.4 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
సింగిల్ 12వ రోజు వసూళ్లు
యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తుండటంతో గత వీకెండ్‌లో సింగిల్ దుమ్ములేపింది. శుక్రవారం రూ.1.32 కోట్లు, శనివారం రూ.1.83 కోట్లు, ఆదివారం రూ.2.09 కోట్లతో వారాంతంలో ఏకంగా 5 కోట్ల వరకు కలెక్షన్స్ అందుకుని శ్రీవిష్ణు తన హవా చూపించాడు. వర్కింగ్ డేస్‌లోనూ మంచి హోల్డ్ సాధిస్తోంది సింగిల్ మూవీ. 12వ రోజైన మంగళవారం ఈ సినిమాకు 19.49 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైంది. హైదరాబాద్‌లో 301, బెంగళూరులో 56, విజయవాడలో 50, విశాఖటపట్నంలో 84 షోలు పడ్డాయి.
12వ రోజు సింగిల్ మూవీకి ఇండియా వైడ్ నికరంగా రూ.58 లక్షల కలెక్షన్స్ వచ్చినట్లు సాక్‌నిల్క్ తెలిపింది. దీంతో 12 రోజుల వరకు శ్రీవిష్ణు సినిమాకు భారత్‌లో రూ.21.89 కోట్ల నెట్, రూ. 27.09 కోట్ల గ్రాస్ వచ్చింది. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ రూ.4 కోట్లు కలిపి 7 రోజుల వరకు ప్రపంచవ్యాప్తంగా సింగిల్ మూవీ రూ.34 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
2025లో అత్యధిక లాభాలు సాధించిన సినిమాల్లో సింగిల్ ఇప్పటికే మూడవ స్థానంలో నిలిచింది. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద 45 శాతం వరకు లాభాలను ఆర్జించిన శ్రీవిష్ణు.. 10వ రోజు నాటి వసూళ్లతో తన గత చిత్రాలు స్వాగ్ (6.86 కోట్లు), ఓం భీం బుష్ (రూ.12.89 కోట్లు)ల టోటల్ కలెక్షన్స్‌ను అధిగమించాడు. అలాగే నేచురల్ స్టార్ నాని రీసెంట్ మూవీ హిట్ 3, నార్నే నితిన్‌ల మ్యాడ్ స్క్వేర్‌ల లాభాలను సింగిల్ మూవీ క్రాస్ చేయడం విశేషం. రానున్న రోజుల్లో శ్రీవిష్ణు సినిమా ఎలాంటి మేజిక్ చేస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











