Single Box Office: వీకెండ్‌లో కుమ్మేస్తోన్న శ్రీవిష్ణు.. సింగిల్ మూవీకి కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?
శ్రీవిష్ణు నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సింగిల్ మూవీ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే పెట్టిన పెట్టుబడికి మించి 50 శాతం పైగా లాభాలను అందించిన ఈ చిత్రం తన జోరును కొనసాగిస్తోంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో కార్తీక్ రాజు దర్శకత్వంలో సింగిల్ తెరకెక్కగా ఇవానా, కేతిక శర్మలు హీరోయిన్లు. గీతా ఆర్ట్స్, కళ్యా ఫిల్మ్స్ పతాకాలపై విద్య కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరిలు సంయుక్తంగా సింగిల్ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా 16 రోజుల్లో ఎన్ని కోట్లు వసూలు చేసింది? ఎన్ని కోట్ల లాభాలను అందించింది ? అనే వివరాల్లోకి వెళితే..
సింగిల్ బడ్జెట్, బిజినెస్ & బ్రేక్ ఈవెన్ టార్గెట్
సింగిల్ చిత్రాన్ని సుమారుగా 15 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించగా, ఈ సినిమాకు దాదాపు 7 కోట్ల రూపాయలు జరిగినట్లుగా ఫిలింనగర్ వర్గాలు తెలిపాయి. సింగిల్ చిత్రం లాభాల్లోకి రావాలంటే రూ.8 కోట్ల షేర్.. రూ.16 కోట్ల గ్రాస్ వసూలు చేయాలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు. మే 9న సుమారుగా తెలుగు రాష్ట్రాల్లో 400 స్క్రీన్లలో, ప్రపంచవ్యాప్తంగా 700 స్క్రీన్లలో సింగిల్ సినిమాను రిలీజ్ చేశారు.

సింగిల్ 15 రోజుల వసూళ్లు
సింగిల్ మూవీకి తొలి రోజు ఇండియాలో రూ.2.5 కోట్లు, రెండో రోజు రూ.3.5 కోట్ల నెట్, మూడో రోజు రూ.3.55 కోట్ల నెట్, నాలుగో రోజు రూ.1.7 కోట్లు, ఐదో రోజు రూ.1.58 కోట్లు, ఆరో రోజు రూ.1.17 కోట్లు, ఏడో రోజు రూ.1.1 కోట్లు, ఎనిమిదో రోజు రూ.1.32 కోట్లు, తొమ్మిదో రోజు రూ.1.83 కోట్లు, పదవ రోజున రూ.2.09 కోట్లు, పదకొండవ రోజున రూ.77 లక్షలు, పన్నెండవ రోజున రూ.55 లక్షలు, పదమూడవ రోజున రూ.47 లక్షలు, పద్నాలుగవ రోజున రూ.39 లక్షలు, పదిహేనవ రోజున రూ.34 లక్షల చొప్పున 15 రోజుల్లో సింగిల్ మూవీ నికరంగా రూ.22 కోట్లు సాధించినట్లు సాక్‌నిల్క్ తెలిపింది. అటు ఓవర్సీస్‌లో తొలి నుంచి మంచి హోల్డ్ సాధిస్తోన్న సింగిల్ మూవీ ఇప్పటి వరకు రూ.5 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
సింగిల్ 16వ రోజు వసూళ్లు
సింగిల్ చిత్రం 16వ రోజైన శనివారం 25.94 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీని సాధించింది. హైదరాబాద్‌లో 203, బెంగళూరులో 26, విజయవాడలో 44, విశాఖటపట్నంలో 76 షోలు పడ్డాయి. 16వ రోజు సింగిల్ మూవీకి ఇండియా వైడ్ నికరంగా రూ.48 లక్షల కలెక్షన్స్ వచ్చినట్లు సాక్‌నిల్క్ తెలిపింది. దీంతో 16 రోజుల వరకు శ్రీవిష్ణు సినిమాకు భారత్‌లో రూ.22.53 కోట్ల నెట్, రూ.31 కోట్ల గ్రాస్ వచ్చింది. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ రూ.5 కోట్లు కలిపి 16 రోజుల వరకు ప్రపంచవ్యాప్తంగా సింగిల్ మూవీ రూ.36 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ వీకెండ్ తర్వాత శ్రీవిష్ణు సినిమా థియేట్రికల్ రన్‌పై ఓ క్లారిటీ రానుంది. జూన్ వరకు పెద్ద సినిమాలు ఏం లేకపోవడంతో నెక్ట్స్ వీక్‌లోనూ సింగిల్ తన హవా చూపించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











