Single Day 2 Box Office: శ్రీవిష్ణు మేజిక్ .. రెండో రోజు రికార్డ్ కలెక్షన్స్, సింగిల్ మూవీకి ఎన్ని కోట్లంటే?
శ్రీవిష్ణు హీరోగా కేతికా శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించిన చిత్రం సింగిల్. కార్తీక్ రాజు దర్శకత్వం వహించగా.. గీతా ఆర్ట్స్, కళ్యా ఫిల్మ్స్ పతాకాలపై విద్య కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరిలు సంయుక్తంగా సింగిల్ చిత్రాన్ని నిర్మించారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సమర్పించారు. వెన్నెల కిశోర్, వీటీవీ గణేష్, కల్పలత తదితరులు ఇతర కీలకపాత్రలు పోషించారు. సింగిల్ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు ఎంత అనే వివరాల్లోకి వెళితే..
సింగిల్ బడ్జెట్, బిజినెస్ & బ్రేక్ ఈవెన్ టార్గెట్
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి సింగిల్ చిత్రాన్ని సుమారుగా 15 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌ను 7 కోట్ల రూపాయలు జరిగినట్లుగా ట్రేడ్ పండితులు తెలిపారు. సింగిల్ చిత్రం లాభాల్లోకి రావాలంటే రూ.8 కోట్ల షేర్.. రూ.16 కోట్ల గ్రాస్ వసూలు చేయాలని విలువ కట్టారు. టీజర్, ట్రైలర్లతో పాటు విస్త్రృతంగా చేసిన ప్రమోషనల్ కార్యక్రమాలతో సింగిల్ చిత్రంపై మంచి హైప్ వచ్చింది. మే 9న సుమారుగా తెలుగు రాష్ట్రాల్లో 400 స్క్రీన్లలో, ప్రపంచవ్యాప్తంగా 700 స్క్రీన్లలో సింగిల్ సినిమాను రిలీజ్ చేశారు.

సింగిల్ తొలి రోజు వసూళ్లు
సింగిల్ మూవీకి తొలి రోజు ఇండియాలో రూ.2.5 కోట్ల ఓపెనింగ్స్ రాగా.. ప్రపంచవ్యాప్తంగా రూ.4.1 కోట్ల వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో 2.6 కోట్లు , రెస్టాఫ్ ఇండియా + ఓవర్సీస్‌లో రూ.1.5 కోట్ల చొప్పున సింగిల్ మూవీకి కలెక్షన్స్ వచ్చాయి. హీరో శ్రీవిష్ణు కెరీర్‌లో ఓ సినిమాకు అత్యధిక ఓపెనింగ్స్ రావడం ఇదే ప్రథమం. ఇంతకు ముందు స్వాగ్ రూ.2.5 కోట్లు, ఓం భీమ్ బుష్ 3.5 కోట్ల ఓపెనింగ్స్ అందుకున్నాయి.
సింగిల్ రెండో రోజు వసూళ్లు
మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ వీకెండ్‌లో శ్రీవిష్ణు మూవీకి మంచి బుకింగ్స్ జరిగాయి. శనివారం సింగిల్ సినిమాకు 47.59 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిల్క్ తెలిపింది. రెండో రోజు హైదరాబాద్‌లో 310, బెంగళూరులో 134, విజయవాడలో 75, విశాఖలో 101 షోలు పడినట్లు వెల్లడించింది. శనివారం సింగిల్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.7.05 కోట్ల కలెక్షన్స్ సాధించి దుమ్మురేపింది. తొలి రోజుతో పోలిస్తే రెండు రెట్ల మేర వసూళ్లు భారీగా పెరగడం విశేషం. అమెరికాలోనూ సింగిల్ మూవీకి మంచి ఆదరణ లభిస్తోంది. రెండ్రోజుల్లోనే ఇక్కడ 300కే మార్క్ వసూళ్లు (భారత కరెన్సీలో రూ.2.56 కోట్లు) రాబట్టినట్లు వార్తలు వస్తున్నాయి.
రెండు రోజులకు కలిపి సింగిల్ సినిమా గ్లోబల్ వైడ్ రూ.11.20 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు సాక్‌నిల్క్ తెలిపింది. దీంతో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్‌కు దగ్గరైంది. శ్రీవిష్ణు మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 5 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంది. ప్రస్తుతం శ్రీవిష్ణు జోరు చూస్తుంటే ఆదివారంతోనే టార్గెట్ కొట్టేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వీకెండ్ కావడం, సినిమాపై పాజిటివ్ టాక్ నేపథ్యంలో ఆదివారం సింగిల్ సినిమాకు భారీ కలెక్షన్స్ వస్తాయని చిత్ర యూనిట్ ఆశలు పెట్టుకుంది.


Click it and Unblock the Notifications











