Single Day 2 Collections: బాక్సాఫీస్ దుమ్మురేపిన సింగిల్.. శ్రీవిష్ణు మూవీకి ఎన్ని కోట్లంటే?

యువ హీరో శ్రీ విష్ణు, టాప్ కమెడియన్ వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం సింగిల్. కామెడీ ప్రధానంగా సాగే ఈ సినిమాలో కేతికా శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పించగా విద్యా కొప్పినీడు, భాను ప్రతాప్, రియాజ్ చౌదరీ నిర్మించారు. కార్తీక్ రాజు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా మే 9వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది. బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ కలెక్షన్లు సాధించావనే వివరాల్లోకి వెళితే..

ఫన్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఆధారంగా వినోదభరితంగా రూపొందించిన ఈ చిత్రాన్ని సుమారుగా 15 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌ను 8 కోట్లుగా వాల్యూ కట్టారు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రాన్ని సుమారుగా తెలుగు రాష్ట్రాల్లో 400 స్క్రీన్లలో, ప్రపంచవ్యాప్తంగా 700 స్క్రీన్లలో రిలీజ్ చేశారు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించారు.

Single Day 2 Expected Box Office

సింగిల్ చిత్రం తొలి రోజు సానుకూలమైన కలెక్షన్లను రాబట్టింది. ఈ చిత్రం ఇండియాలో 2.5 కోట్లు నెట్, 2.9 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఇక ఓవర్సీస్‌లో కూడా భారీ కలెక్షన్లను సాధించింది. ఈ చిత్రం 125K డాలర్లు అంటే సుమారుగా 1.1 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో తొలి రోజు 4 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.

ఇక సింగిల్ చిత్రం రెండో రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ మూవీకి శుక్రవారం కంటే శనివారం బెటర్ ఆక్యుపెన్సీ నమోదైంది. ఈ రెండో రోజు 50 శాతానికి పైగా ఆక్యుపెన్సీ నమోదు కావడంతో సెకండ్ డే భారీ వసూళ్లు నమోదు చేసేందుకు మార్గం సుగమమైంది. సాక్ నిల్క్ అంచనాల ప్రకారం ఈ మూవీ రెండో రోజు 3.5 కోట్ల రూపాయలు ఇండియాలో, ఓవర్సీస్‌లో 1.5 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని అంచనా వేశారు.

తాజా అంచనాల ప్రకారం రెండు రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 4 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది. ఇక రెండో రోజు 5 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ల అంచనాతో ఈ చిత్రం 9 కోట్లు ఓవరాల్‌గా వసూలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఆదివారం కూడా భారీ వసూళ్లు రాబట్ట గలిగితే.. ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌కు 50 శాతం చేరువ అయ్యే ఛాన్స్ మెరుగుపడుతుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

సింగిల్ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే.. కనీసం 8 కోట్ల రూపాయల షేర్, 16 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు బాక్సాఫీస్ వద్ద రాబట్టాల్సి ఉంటుంది. రెండు రోజుల్లో 9 కోట్ల రూపాయలు వసూలు చేయగలిగితే.. వచ్చే వారం ఇదే జోష్‌ను కొనసాగిస్తే.. బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉంటుంది. రానున్న రోజుల్లో ఇదే జోష్‌ను ఈ సినిమా కొనసాగిస్తుందో లేదో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X