Single Day 3 Box Office: నక్క తోక తొక్కిన శ్రీవిష్ణు.. 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్..సింగిల్‌కు ఎన్ని కోట్లంటే!
ఫన్, ఎమోషన్స్‌తో ట్రాయాంగిల్ లవ్ స్టోరీగా రూపొందిన సింగిల్ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల రూపంలో దూసుకుపోతున్నది. శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్, కేతికా శర్మ, ఇవానా తదితరులు నటించిన ఈ సినిమా సినీ విమర్శకులు, సాధారణ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకొన్నది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్మాణ సారథ్యంలో రూపొందించిన ఈ సినిమాకు కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. విద్యా కొప్పినీడు, భాను ప్రతాప్, రియాజ్ చౌదరీ నిర్మాతలుగా వ్యవహరించిన ఈ సినిమా మే 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ సినిమా గత మూడు రోజుల్లో ఏ రేంజ్ కలెక్షన్లు సాధించింది? ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..
బడ్జెట్, బ్రేక్ ఈవెన్ టార్గెట్
సింగిల్ చిత్రాన్ని సుమారుగా 15 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌ను 7 కోట్లుగా వాల్యూ కట్టారు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రాన్ని సుమారుగా తెలుగు రాష్ట్రాల్లో 400 స్క్రీన్లలో, ప్రపంచవ్యాప్తంగా 700 స్క్రీన్లలో రిలీజ్ చేశారు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించారు. ఈ సినిమా 7.5 కోట్ల షేర్ కలెక్షన్ల టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని ప్రారంభించింది.

ఆంధ్రా, నైజాంలో వసూళ్లు
తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ మూవీ ఇటీవల కాలంలో ఇతర సినిమా కంటే టాప్ కలెక్షన్లను నమోదు చేస్తున్నది. ఈ చిత్రం గత రెండు రోజుల్లో నైజాంలో 2 కోట్ల రూపాయలు, ఆంధ్రాలో 1.9 కోట్ల రూపాయలు కలెక్షన్లను సాధించింది. దాంతో ఈ సినిమా 3.9 కోట్ల రూపాయల వసూళ్లను నమోదు చేసింది. దాంతో ఈ సినిమా రెండు రోజుల్లో 6.8 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
కర్ణాటక, ఓవర్సీస్‌లో కలిపి
ఇక కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో ఈ సినిమా మెరుగైన కలెక్షన్లను నమోదు చేస్తున్నది. ఓవర్సీస్‌లో అంటే నార్త్ అమెరికాలో 300K డాలర్లు అంటే.. భారతీయ కరెన్సీలో 2.6 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు 4.15 కోట్ల రూపాయల గ్రాస్, రెండో రోజు 7.05 కోట్ల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది. మొత్తంగా 11.2 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
3వ రోజు కలెక్షన్లు ఎంతంటే?
సింగిల్ మూవీ 3వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ సినిమాకు ఆదివారం సెలవు దినం, అలాగే ఐపీఎల్ రద్దు అంశాలు బాగా కలిసి రావడమే కాకుండా నక్కతోక తొక్కినంత లక్ దక్కింది. దాంతో మూడో రోజు ఆక్యుపెన్సీ బెటర్‌గా కనిపించింది. మార్నింగ్ షోకు 30 శాతం లోపు, మ్యాట్నీ, ఫస్ట్, సెకండ్ షోలకు 50 శాతానికిపైగా ఆక్యుపెన్సీ నమోదైందని సాక్ నిల్క్ వెల్లడించింది. అయితే ఈ సినిమా తెలుగు రాష్ట్రాలు, కన్నడతో కలిపి మూడో రోజు 3 కోట్ల రూపాయల నికరంగా వసూళ్లను సాధించే అవకాశం ఉంది. అలాగే ఓవర్సీస్‌తో కలిపి 3.25 నుంచి 3.5 కోట్ల నికర వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది.
బ్రేక్ ఈవెన్‌కు చేరువగా
గత రెండు రోజుల్లో 11 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం మూడో రోజు మరో 3.5 కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తుందని అంచనా వస్తున్నారు. దాంతో ఈ సినిమా 14.5 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను నమోదు చేసే అవకాశం ఉంది. ఈ సినిమా మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌కు చేరువయ్యే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











