Single Day 4 Box Office: సింగిల్‌కు లాభమా? నష్టమా? శ్రీవిష్ణు సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్, కేతికా శర్మ, ఇవానా తదితరులు నటించిన సింగిల్ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా నిలకడగా భారీ వసూళ్లు సాధిస్తున్నది. ఫన్, ఎమోషన్స్‌తో ట్రాయాంగిల్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమాకు సినీ విమర్శకులు, సాధారణ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకొన్నది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్మాణ సారథ్యంలో రూపొందించిన ఈ సినిమాకు కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. విద్యా కొప్పినీడు, భాను ప్రతాప్, రియాజ్ చౌదరీ నిర్మాతలుగా వ్యవహరించిన ఈ సినిమా మే 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ సినిమా గత నాలుగు రోజుల్లో ఏ రేంజ్ కలెక్షన్లు సాధించింది? ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..
బడ్జెట్, బ్రేక్ ఈవెన్ టార్గెట్
సింగిల్ చిత్రాన్ని సుమారుగా 15 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌ను 7 కోట్లుగా వాల్యూ కట్టారు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రాన్ని సుమారుగా తెలుగు రాష్ట్రాల్లో 400 స్క్రీన్లలో, ప్రపంచవ్యాప్తంగా 700 స్క్రీన్లలో రిలీజ్ చేశారు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించారు. ఈ సినిమా 7.5 కోట్ల షేర్ కలెక్షన్ల టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని ప్రారంభించింది.

ఇండియా కలెక్షన్లు
సింగిల్ చిత్రం తొలి రోజు నుంచి బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా కలెక్షన్లను రాబడుతున్నది. ఇండియాలో ఈ సినిమా తొలి రోజు 2.5 కోట్ల నికర వసూళ్లు, రెండో రోజు 3.5 కోట్ల నికర వసూళ్లు, మూడో రోజు 3.55 కోట్ల నికర వసూళ్లు రాబట్టిందని సాక్ నిల్క్ వెల్లడించింది. మూడు రోజుల్లో 9.55 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా వసూళ్లను పరిశీలిస్తే.. తొలి రెండు రోజుల కంటే మూడో రోజు అధికంగా కలెక్ట్ చేయడం ట్రేడ్ వర్గాల్లో జోష్ పెంచింది.
ఆంధ్రా, నైజాం వసూళ్లు
ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో సింగిల్ సినిమాకు మంచి ఆదరణ దక్కుతున్నది. నైజాంలో ఈ సినిమా నైజాం ఆంధ్రాలో కలిపి తొలి రోజు 1.75 కోట్లు, రెండో రోజు 2.25 కోట్లు, మూడో రోజు 2 కోట్ల రూపాయలు వసూలు చేసింది. నైజాంలో ఇప్పటి వరకు 3 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 70 లక్షలు, ఆంధ్రాలో 2.5 కోట్లు వసూలు చేసింది. దాంతో మొత్తంగా 6.2 కోట్ల రూపాయలు వసూలు చేసింది. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 3 కోట్ల రూపాయలు రాబట్టింది.
ఓవర్సీస్ బాక్సాఫీస్
ఓవర్సీస్‌లో సింగిల్ సినిమా క్రమేపి వసూళ్ల వేగం పుంజుకొంటున్నది. అమెరికాలో ఈ చిత్రం 400K వసూళ్లను రాబట్టింది. అంటే భారతీయ కరెన్సీలో 3.6 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. దాంతో ఈ సినిమా మొత్తంగా 16.3 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టిందని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది.
4వ రోజు కలెక్షన్ల వివరాలు
ఇక నాలుగో రోజు కూడా ఈ సినిమా స్ట్రాంగ్‌గా వసూళ్లు సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశారు. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌కు చేరువైన ఈ చిత్రం నాలుగో రోజు లాభాల్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. 4వ రోజున ఇండియాలో 2 కోట్ల రూపాయలు, ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టే ఛాన్స్ కనిపిస్తుందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.


Click it and Unblock the Notifications











