Single Day 5 Box Office: టార్గెట్ ఔట్.. భారీ హిట్ దిశగా సింగిల్, శ్రీవిష్ణు మూవీకి కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?
చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించింది సింగిల్. కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీవిషు హీరోగా కేతికా శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో కార్తీక్ రాజు దర్శకత్వం వహించగా.. గీతా ఆర్ట్స్, కళ్యా ఫిల్మ్స్ పతాకాలపై విద్య కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరిలు సంయుక్తంగా సింగిల్ చిత్రాన్ని నిర్మించారు. వెన్నెల కిశోర్, వీటీవీ గణేష్, కల్పలత తదితరులు ఇతర కీలకపాత్రలు పోషించారు. సింగిల్ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? ఐదు రోజుల్లో ఈ సినిమా ఎన్ని కోట్లు వసూలు చేసింది ? అనే వివరాల్లోకి వెళితే..
సింగిల్ బడ్జెట్, బిజినెస్ & బ్రేక్ ఈవెన్ టార్గెట్
సింగిల్ చిత్రాన్ని సుమారుగా 15 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించగా, ఈ సినిమాకు దాదాపు 7 కోట్ల రూపాయలు జరిగినట్లుగా ఫిలింనగర్ వర్గాలు తెలిపాయి. సింగిల్ చిత్రం లాభాల్లోకి రావాలంటే రూ.8 కోట్ల షేర్.. రూ.16 కోట్ల గ్రాస్ వసూలు చేయాలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు. మే 9న సుమారుగా తెలుగు రాష్ట్రాల్లో 400 స్క్రీన్లలో, ప్రపంచవ్యాప్తంగా 700 స్క్రీన్లలో సింగిల్ సినిమాను రిలీజ్ చేశారు.

సింగిల్ నాలుగు రోజుల వసూళ్లు
సింగిల్ మూవీకి తొలి రోజు ఇండియాలో రూ.2.5 కోట్ల ఓపెనింగ్స్ రాగా.. ప్రపంచవ్యాప్తంగా రూ.4.15 కోట్ల వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. హీరో శ్రీవిష్ణు కెరీర్‌లో అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా సింగిల్ నిలిచింది. ఆ తర్వాత రెండో రోజు రూ.3.5 కోట్ల నెట్, మూడో రోజు రూ.3.55 కోట్ల నెట్, నాలుగో రోజు రూ.1.7 కోట్ల చొప్పున నాలుగు రోజుల్లో సింగిల్ మూవీ రూ.11 కోట్ల నికర వసూళ్లు సాధించింది.
సింగిల్ ఐదో రోజు వసూళ్లు
యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన సింగిల్ మూవీకి యువత బ్రహ్మారథం పడుతున్నారు. శ్రీవిష్ణు - వెన్నెల కిషోర్ కామెడీతో థియేటర్‌లో ప్రేక్షకులు పడిపడి నవ్వుకుంటున్నారు. ఐదో రోజైన మంగళవారం సింగిల్ మూవీకి 24.34 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిల్క్ తెలిపింది. ఐదో రోజు హైదరాబాద్‌లో 328, బెంగళూరులో 155, విజయవాడలో 99, విశాఖలో 119 షోలు పడినట్లు వెల్లడించింది.
మంగళవారం సింగిల్ మూవీ ఇండియాలో నికరంగా రూ.1.33 కోట్లు రాబట్టింది. తద్వారా ఐదు రోజుల వరకు ఇండియా వైడ్ రూ.12.58 కోట్ల నెట్, రూ.13.72 కోట్ల గ్రాస్ వసూళ్లు అందుకుంది శ్రీవిష్ణు సినిమా. ఇండియాలో గ్రాస్ + ఓవర్సీస్‌లో వచ్చిన 3.42 కోట్ల రూపాయల కలెక్షన్స్‌తో కలిపి సింగిల్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.17 కోట్లు వసూలు చేసింది. దీంతో వారం తిరిగేసరికి శ్రీవిష్ణు సినిమా లాభాల్లోకి చేరుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సింగిల్ మూవీకి దక్కుతున్న ఆదరణ దృష్ట్యా చిత్ర యూనిట్ థియేటర్ల సంఖ్యను మరింత పెంచుతోంది.


Click it and Unblock the Notifications











