Single Box Office: 25 కోట్లతో శ్రీవిష్ణు సంచలనం.. సింగిల్ మూవీకి కళ్లు చెదిరే ప్రాఫిట్స్!
శ్రీవిషు హీరోగా వచ్చిన రీసెంట్ మూవీ సింగిల్. కేతికా శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించారు. కామెడీ, రొమాంటిక్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తుతోంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో కార్తీక్ రాజు దర్శకత్వం వహించగా.. గీతా ఆర్ట్స్, కళ్యా ఫిల్మ్స్ పతాకాలపై విద్య కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరిలు సంయుక్తంగా సింగిల్ చిత్రాన్ని నిర్మించారు. వెన్నెల కిశోర్, వీటీవీ గణేష్, కల్పలత తదితరులు ఇతర కీలకపాత్రలు పోషించారు. సింగిల్ సినిమా ఏడు రోజుల్లో ఎన్ని కోట్లు వసూలు చేసింది? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..
సింగిల్ బడ్జెట్, బిజినెస్ & బ్రేక్ ఈవెన్ టార్గెట్
సింగిల్ చిత్రాన్ని సుమారుగా 15 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించగా, ఈ సినిమాకు దాదాపు 7 కోట్ల రూపాయలు జరిగినట్లుగా ఫిలింనగర్ వర్గాలు తెలిపాయి. సింగిల్ చిత్రం లాభాల్లోకి రావాలంటే రూ.8 కోట్ల షేర్.. రూ.16 కోట్ల గ్రాస్ వసూలు చేయాలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు. మే 9న సుమారుగా తెలుగు రాష్ట్రాల్లో 400 స్క్రీన్లలో, ప్రపంచవ్యాప్తంగా 700 స్క్రీన్లలో సింగిల్ సినిమాను రిలీజ్ చేశారు.

సింగిల్ ఆరు రోజుల వసూళ్లు
సింగిల్ మూవీకి తొలి రోజు ఇండియాలో రూ.2.5 కోట్లు, రెండో రోజు రూ.3.5 కోట్ల నెట్, మూడో రోజు రూ.3.55 కోట్ల నెట్, నాలుగో రోజు రూ.1.7 కోట్లు, ఐదో రోజు రూ.1.58 కోట్లు, ఆరో రోజు రూ.1.17 కోట్లు చొప్పున ఆరు రోజుల్లో సింగిల్ మూవీ రూ.14 కోట్లు సాధించినట్లు సాక్‌నిల్క్ తెలిపింది. అలాగే ఓవర్సీస్‌లో రూ.3.25 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ పండితులు చెప్పారు.
సింగిల్ ఏడో రోజు వసూళ్లు
శ్రీవిష్ణు, వెన్నెల కిషోర్ కామెడీకి యువత ఫిదా అవుతున్నారు. రిలీజ్ అయిన నాటి నుంచి రోజుకు రూ. కోటి రూపాయలు తగ్గకుండా వసూళ్లు సాధిస్తోంది సింగిల్. ఏడో రోజైన గురువారం ఓవరాల్‌గా 18.88 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైంది. హైదరాబాద్‌లో 345, బెంగళూరులో 155, విజయవాడలో 78, విశాఖటపట్నంలో 100 షోలు పడ్డాయి. 7వ రోజు సింగిల్ మూవీకి ఇండియా వైడ్ నికరంగా 82 లక్షల రూపాయల కలెక్షన్స్ వచ్చినట్లు సాక్‌నిల్క్ తెలిపింది. దీంతో 7 రోజుల వరకు ఈ సినిమాకు భారత్‌లో రూ.14.82 కోట్ల నెట్, రూ.16.52 కోట్ల గ్రాస్ వచ్చింది. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ రూ.3.25 కోట్లు కలిపి 7 రోజుల వరకు ప్రపంచవ్యాప్తంగా సింగిల్ మూవీ రూ.19.77 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
అయితే కొందరు క్రిటిక్స్ సహా పలు సోషల్ మీడియా సంస్ధలు మాత్రం సింగిల్ మూవీ ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.25 కోట్ల కలెక్సన్స్ సాధించినట్లు చెబుతున్నారు. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ టార్గెట్ కొట్టేసిన శ్రీవిష్ణు మూవీ భారీగా లాభాలను అందిస్తోంది. అటు అమెరికాలో సింగిల్ మూవీ ప్రభంజనం సృష్టిస్తున్నట్లు ఓ క్రిటిక్ వెల్లడించారు. ఏడు రోజుల వరకు యూఎస్ఏలో శ్రీవిష్ణు మూవీకి 550k (భారత కరెన్సీలో రూ.4.70 కోట్లు) రాబట్టినట్లు రమేశ్ బాలా పేర్కొన్నారు. శ్రీవిష్ణు దూకుడు చూస్తుంటే ఈ వీకెండ్‌లో సింగిల్‌కు మంచి వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి చూద్దాం ఏం జరుగుతుందో?


Click it and Unblock the Notifications











