Single Movie Business : సింగిల్‌ మూవీకి రికార్డ్ ట్రేడ్ .. శ్రీవిష్ణు సినిమా లాభాల్లోకి రావాలంటే ?

హిట్టు, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా వరుసపెట్టి సినిమాలు చేసే అతికొద్దిమంది హీరోలలో శ్రీవిష్ణు ఒకరు. రోటీన్ కమర్షియల్ సినిమాలు కాకుండా విభిన్న కథలతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్నారు శ్రీవిష్ణు. గతేడాది స్వాగ్ అనే డిఫరెంట్ సబ్జెక్ట్‌తో అలరించిన శ్రీవిష్ణు తాజాగా మరో విభిన్న చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అదే సింగిల్. మే 9వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతుండగా సింగిల్ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? ఎంత వస్తే శ్రీవిష్ణు మూవీ లాభాల్లోకి వస్తుంది? ఈ వివరాల్లోకి వెళితే..

శ్రీవిష్ణు కెరీర్‌లో 18వ చిత్రంగా సింగిల్

సింగిల్ మూవీలో శ్రీవిష్ణు సరసన కేతికా శర్మ, ఇవానాలు హీరోయిన్లుగా నటించారు. వెన్నెల కిశోర్, వీటీవీ గణేష్, కల్పలత తదితరులు ఇతర కీలకపాత్రలు పోషించారు. కార్తీక్ రాజు దర్శకత్వం వహించగా.. గీతా ఆర్ట్స్, కళ్యా ఫిల్మ్స్ పతాకాలపై విద్య కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరిలు సంయుక్తంగా సింగిల్ చిత్రాన్ని నిర్మించారు. విశాల్ చంద్రశేఖర్ స్వరాలు సమకూరుస్తుండగా.. ఆర్ వేళ్‌రాజ్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. సింగిల్ చిత్రం శ్రీవిష్ణు కెరీర్‌లో 18వది కావడం విశేషం.

Single Movie Business Worldwide Sree Vishnu scores career highest trade

మంచు విష్ణుతో వివాదం

విడుదలకు ముందే సింగిల్ చిత్రం వివాదాస్పదమైంది. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కాగా.. ఇందులో కన్నప్ప, మంచు అనే పదాల్ని అభ్యంతరకరంగా ఉపయోగించారంటూ మా అధ్యక్షుడు, హీరో మంచు విష్ణు ఫైర్ అయ్యారు . సినీ ప్రముఖులపై కొందరు ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో చేస్తున్న ట్రోలింగ్‌పై తాను పోరాడుతున్నానని విష్ణు తెలిపారు. అలాంటిది సినిమా వాళ్లే అయ్యుండి తనను, తమ కుటుంబాన్ని ఇలా టార్గెట్ చేయడం కరెక్ట్ కాదంటూ విష్ణు ఫైర్ అయ్యారు. ఈ సినిమా రచయితకు కూడా విష్ణు క్లాస్ పీకినట్లు ఫిలింనగర్‌ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ పరిణామాలతో సింగిల్ టీమ్ స్పందించింది. స్వయంగా హీరో శ్రీవిష్ణు.. మంచు విష్ణుకు క్షమాపణలు చెప్పడంతో పాటు వివాదాస్పద డైలాగ్‌ను తొలగిస్తున్నట్లు చెప్పారు.

సింగిల్‌పై మంచి బజ్

టీజర్, ట్రైలర్ తాజా వివాదంతో సింగిల్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. స్వాగ్ తర్వాత శ్రీవిష్ణు చేస్తున్న సినిమా కావడంతో టాలీవుడ్‌లో ఈ సినిమాపై మంచి బజ్ ఉంది. ఈ నేపథ్యంలో సింగిల్ సినిమా ఎంత బిజినెస్ చేసిందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ వివరాల్లోకి వెళితే.. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ అయిన గీతా ఆర్ట్స్ స్వయంగా మేజర్ ఏరియాలలో సింగిల్ మూవీని రిలీజ్ చేసినట్లు టాక్. అయినప్పటికీ శ్రీవిష్ణు చిత్రానికి బాగానే బిజినెస్ అయినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

సింగిల్ మూవీ బిజినెస్ ఎంతంటే?

ఆంధ్రా, నైజాం, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి సింగిల్ మూవీకి రూ.6.50 కోట్ల బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ పండితులు తెలిపారు. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే రూ.7 కోట్ల షేర్.. రూ.14 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టాల్సి ఉంటుందని అనలిస్టులు విలువ నిర్దేశించారు. శ్రీవిష్ణు చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో 400 థియేటర్లలో, ప్రపంచవ్యాప్తంగా 650 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు.

Take a Poll

అయితే శ్రీవిష్ణు గత చిత్రం స్వాగ్‌తో పోలిస్తే సింగిల్ ప్రీ రిలీజ్ బిజినెస్ తక్కువేనని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. స్వాగ్‌కు దాదాపు రూ.9 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. మరి తాజా టార్గెట్‌ను శ్రీవిష్ణు ఎలా కొడతాడో చూడాలి. ప్రస్తుతం యాక్షన్ చిత్రాలు బాక్సాఫీస్‌పై దండయాత్ర చేస్తుండటంతో సరైన కామెడీ సినిమా లేదని జనాలు ఫీల్ అవుతున్నారు. శ్రీవిష్ణు కనుక ఏమాత్రం ఆకట్టుకున్నా సింగిల్ మూవీకీ కలెక్షన్స్ అదిరిపోతాయని భావిస్తున్నారు.

More from Filmibeat

Read more about: sree vishnu ketika sharma single
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X