855 కోట్ల బడ్జెట్.. 500 కోట్ల కలెక్షన్లు.. ఇండియాలో ఎన్ని కోట్ల వసూళ్లంటే?
అమెరికన్ సదరన్ గోతిక్ హారర్ సినిమాగా రూపొందిన సిన్నర్స (Sinners) చిత్రం ఇటీవల ప్రపంచవ్యాప్తంగా రిలీజై భారీ వసూళ్లను సాధిస్తున్నది. 1932 సంవత్సరంలో మిస్సిసిపి డెల్టా జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమాకు ర్యాన్ కూగ్లర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మైఖేల్ బీ జోర్డాన్ ద్విపాత్రాభినయం చేయగా.. హెయిలీ స్టెయిన్‌పెల్డ్, మైల్స్ కాటన్, జాక్ ఓకానెల్, ఓమర్ మిల్లర్ తదితరులు నటించారు. ఈ సినిమా బడ్జెట్ ఎంత? వసూలు చేసిన కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..
సిన్నర్ సినిమాను టాప్ యాక్టర్లు, టెక్నిషియన్స్‌తో కలిపి భారీ బడ్జెట్‌తో రూపొందించారు. ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ మూవీని సుమారుగా 100 మిలియన్ డాలర్లు అంటే.. 855 కోట్ల రూపాయల వ్యయంతో రూపొందించారు. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ పొందడానికి సోనీ పిక్చర్స్, వార్నర్ బ్రదర్స్, యూనివర్సల్ పిక్చర్స్ పోటీపడ్డాయి. అయితే ఫ్యాన్సీ రేటు చెల్లించి వార్నర్ బ్రదర్స్ ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ డిస్ట్రిబ్యూషన్‌ను పొందాయి.

సిన్నర్స్ సినిమా భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 18వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది. ఈ మూవీకి అడ్వాన్స్ బుకింగ్ రూపంలో బాక్సాఫీస్ వద్ద మంచి రెస్సాన్స్ లభించింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ విషయానికి వస్తే.. గ్లోబల్ బాక్సాఫీస్ (GBOC) వద్ద సుమారుగా 185 మిలియన్ డాలర్లు వసూలు చేయాల్సి ఉంటుంది. ఈ రేంజ్ కలెక్షన్ల టార్గెట్‌తో ఈ సినిమా బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.
మైఖేల్ బీ జోర్డాన్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద క్రేజీగా కలెక్షన్లు సాధించింది. ఈ సినిమా అమెరికా, కెనడాలో తొలివారాంతంలో సుమారుగా 46 మిలియన్ డాలర్లు అంటే.. 350 కోట్ల రూపాయలకుపైగా వసూళ్లను రాబట్టింది. అలాగే ఈ సినిమా ఓవర్సీస్‌లో 16 మిలియన్లు రాబట్టింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మొత్తంగా 62 మిలియన్ డాలర్లు అంటే.. సుమారుగా 500 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక ఇండియాలో ఈ మూవీ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు ఇండియాలో 60 లక్షల రూాపాయలు, రెండో రోజు 80 లక్ష్లలు, మూడో రోజు 90 లక్షలు వసూలు చేసింది. గత మూడు రోజుల్లో ఈ చిత్రం సుమారుగా 2.3 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను వసూలు చేసింది. అయితే ఈ సినిమాకు అంతగా ప్రేక్షకాదరణ కనిపించకపోవడంపై ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
సిన్నర్ సినిమా మీడియం రేంజ్‌లో బాక్సాఫీస్ వద్ద ప్రభావాన్ని చూపుతున్నది. ఈ వారాంతం తర్వాత కూడా ఇదే జోష్ కొనసాగిస్తే.. బ్రేక్ ఈవెన్ రేంజ్‌కు చేరువ అవుతుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమా ఏ మేరకు లాభాలను పంచిపెడుతాయో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











